
టోక్యో ఒలింపిక్స్‌లో పాటించాల్సిన నిబంధనల చిట్టా విడుదల
టోక్యో: విశ్వ క్రీడల నిర్వహణ విషయంలో ముందుకే వెళ్తున్న ఆతిథ్య జపాన్ దేశం అక్కడ తు.చ. తప్పకుండా పాటించాల్సిన నిబంధనల చిట్టాను విడుదల చేసింది. టోక్యోకు వెళ్లే విదేశీ అథ్లెట్లు తినేటపుడు, పడుకునేటపుడు తప్ప అన్ని వేళలా మాస్కులు ధరించాల్సిందే! అక్కడి ప్రజా రవాణా వాహనాల్ని అనుమతి లేనిదే వినియోగించరాదు. ఇలాంటి ఎన్నో కట్టుబాట్లతో టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘ప్లేబుక్’ను బుధవారం విడుదల చేసింది.
మీడియాతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు... మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు అంతా బాధ్యతతో మెలగాలని సూచించారు. ఆటగాళ్లే కాదు... ప్రేక్షకులకు ఇందులో బంధనాలున్నాయి. తమ ఫేవరెట్ అథ్లెట్లకు మద్దతుగా ప్రేక్షకులు అరవడంగానీ పాడటంగానీ చేయడం నిషిద్ధం. కరోనా మహమ్మారి ప్రమాదం పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అథ్లెట్లు, సహాయక సిబ్బంది, ఇతర సిబ్బంది, ప్రేక్షకులు అందరూ తమ మార్గదర్శకాలను నిక్కచ్చిగా పాటించాల్సిందేనని కార్యనిర్వాహక కమిటీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌ను చూసేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు లేవు. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని కమిటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment