విమానంలో రాత్రంతా దుర్బుద్ధి | Indian Accused Of Groping Sleeping Woman On US Plane | Sakshi
Sakshi News home page

విమానంలో రాత్రంతా దుర్బుద్ధి

Published Fri, Jan 5 2018 3:16 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

Indian Accused Of Groping Sleeping Woman On US Plane - Sakshi

న్యూయార్క్‌ : విమానంలో ఓ వ్యక్తి చెప్పకూడని పని చేశాడు. తన పక్క సీట్లో ఉన్న మహిళను అసభ్యకరంగా తడుముతూ రాత్రంతా లైంగికంగా వేధించాడు. అతడి పక్కనే భార్య కూడా ఉంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫెడరల్‌ అథారిటీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రభు రామమూర్తి అనే భారత సంతతి పౌరుడు అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉంటున్నాడు. అతడు ఈ నెల (జనవరి) 3న భార్యతో కలిసి లాస్‌ వేగాస్‌ నుంచి డెట్రాయిట్‌కు బయలుదేరాడు. అయితే, విమానంలో అతడి పక్క సీట్లో కిటికీవద్ద ఓ 22 ఏళ్ల మహిళ కూర్చొని ఉంది. ఆమె ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో పక్కన కూర్చున్న ప్రభు అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఆమె దుస్తుల బటన్స్‌ కూడా తొలగించాడు. ఆ మహిళకు మెలకువ రాగానే తన దుశ్చర్యలను ఆపేశాడు. కంగారుగా ఆ మహిళ వెంటనే లోపల సిబ్బందికి ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన భార్యకు ఆ మహిళకు మధ్య ప్రభు కూర్చుని ఈ దుర్బుద్ది చూపించాడు. సరిగ్గా విమానం మరో 40 నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుందనగా ఈ పనికి పాల్పడ్డాడు. ఈ మేరకు అరెస్టు చేసిన పోలీసులు అతడిని నేరుగా కోర్టుకు తరలించారు. దీంతో కోర్టు అతడికి బెయిల్‌ కూడా ఇవ్వకుండా అతడు చేసింది చాలా తీవ్రమైన నేరం అని పేర్కొంది. మరోపక్క, ఈ ఘటనపై ప్రభు, అతడి భార్య కలిసి వేర్వేరు సమాధానాలు ఇచ్చారు. పిల్స్‌ వేసుకుని తాను నిద్రలోకి జారుకున్నానని, ఆ మహిళే తన మొకాళ్లపై నిద్రపోయిందని ప్రభు చెప్పగా, తాము సీట్లు మార్చాలని కోరినా సిబ్బంది ఆ పనిచేయలేదని భార్య చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement