Indian national
-
అమెరికాలో భారతీయ అంధుల క్రికెట్ జట్టు.. డాలస్‌లో మహాత్ముడికి నివాళి
డాలస్, టెక్సాస్: జూలై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు అమెరికా పర్యటనలో ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్ట్ఙు మంగళవారం డాలస్ లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి మొదలైన వారు వీరికి ఘనస్వాగతం పలికారు.బోస్టన్, న్యూ యార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డి.సి, చికాగో, డాలస్, లాస్ ఏంజిల్స్, సియాటెల్ మరియు బే ఏరియా లలో పర్యటిస్తున్న ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా ఆటగాళ్ళు దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.వీరిలో కొంతమంది పూర్తిగా అంధులు, మరికొంతమంది కొద్దిగా మాత్రమే చూడగల్గుతారు. వీరి క్రికెట్ బంతి సాధారణ బంతిలా కాకుండా దానిలో శబ్దంచేసే కొన్ని మువ్వలు లాంటివి ఉంటాయి. బౌలర్ బంతి విసిరినప్పుడు, ఆ బంతి చేసే శబ్దం ఆధారంగా ఎటువైపు ఎంత వేగంతో బంతి వస్తుందో అంచనావేసి బాట్స్ మాన్ బంతిని కొడతాడు. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని చాంపియన్స్ గా నిలిచిన ఈ భారతజట్టులో విజయవాడకు చెందిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఈ క్రికెట్ టీం విదేశీ పర్యటన మొత్తాన్ని ‘సుబ్బు కోట ఫౌండేషన్’ వారు స్పాన్సర్ చేసి తగు ఆర్ధిక సహకారం అందించడం ముదావహం. పర్యటిస్తున్న అన్ని నగరాలలో అంధులు క్రికెట్ ఎలా ఆడతారో తెలియజేస్తూ ఎగ్జిబిషన్ మ్యాచ్స్ ఆడుతూ తమ క్రికెట్ ఆటలు సుదీర్ఘ కాలం విజయవంతంగా కొనసాగడానికి కావలసిన ఆర్ధిక పరిపుష్టికోసం విరాళాలు సేకరిస్తున్నారు. -
భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన చైనా
బీజింగ్: కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో భారతీయుల వీసాలపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనాలో పని చేస్తున్న భారత్ వృత్తివిద్యా నిపుణులు, వారి కుటుంబాలు గత రెండేళ్లుగా మన దేశంలోనే ఉండిపోయారు. వారు తిరిగి చైనాకు వచ్చేలా వీసాలపై ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్టుగా చైనా ప్రకటించింది. చైనా కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులను దేశంలోకి అనుమతించే అంశాన్నీ పరిశీలిస్తోంది. కాగా మరోవైపు.. ఇతర దేశాల వారికి ఇటీవల కాలంలో వీసాల జారీ మొదలు పెట్టిన డ్రాగన్ దేశం.. భారత్ విషయంలో మాత్రం మీన మేషాలు లేక్కవేస్తూ వచ్చింది. ఈ విషయమై భారత్ పలుమార్లు తీవ్రస్థాయిలో తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో.. తీరు మార్చుకున్న చైనా భారతీయ విద్యార్థులకు మళ్లీ వీసాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. చదవండి: నాటి పరిస్థితుల దృష్ట్య అది సరైనదే! కార్గో విమాన సిబ్బందికి క్లీన్చిట్ -
విమానంలో రాత్రంతా దుర్బుద్ధి
న్యూయార్క్ : విమానంలో ఓ వ్యక్తి చెప్పకూడని పని చేశాడు. తన పక్క సీట్లో ఉన్న మహిళను అసభ్యకరంగా తడుముతూ రాత్రంతా లైంగికంగా వేధించాడు. అతడి పక్కనే భార్య కూడా ఉంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫెడరల్ అథారిటీ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రభు రామమూర్తి అనే భారత సంతతి పౌరుడు అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉంటున్నాడు. అతడు ఈ నెల (జనవరి) 3న భార్యతో కలిసి లాస్ వేగాస్ నుంచి డెట్రాయిట్కు బయలుదేరాడు. అయితే, విమానంలో అతడి పక్క సీట్లో కిటికీవద్ద ఓ 22 ఏళ్ల మహిళ కూర్చొని ఉంది. ఆమె ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో పక్కన కూర్చున్న ప్రభు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె దుస్తుల బటన్స్ కూడా తొలగించాడు. ఆ మహిళకు మెలకువ రాగానే తన దుశ్చర్యలను ఆపేశాడు. కంగారుగా ఆ మహిళ వెంటనే లోపల సిబ్బందికి ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన భార్యకు ఆ మహిళకు మధ్య ప్రభు కూర్చుని ఈ దుర్బుద్ది చూపించాడు. సరిగ్గా విమానం మరో 40 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా ఈ పనికి పాల్పడ్డాడు. ఈ మేరకు అరెస్టు చేసిన పోలీసులు అతడిని నేరుగా కోర్టుకు తరలించారు. దీంతో కోర్టు అతడికి బెయిల్ కూడా ఇవ్వకుండా అతడు చేసింది చాలా తీవ్రమైన నేరం అని పేర్కొంది. మరోపక్క, ఈ ఘటనపై ప్రభు, అతడి భార్య కలిసి వేర్వేరు సమాధానాలు ఇచ్చారు. పిల్స్ వేసుకుని తాను నిద్రలోకి జారుకున్నానని, ఆ మహిళే తన మొకాళ్లపై నిద్రపోయిందని ప్రభు చెప్పగా, తాము సీట్లు మార్చాలని కోరినా సిబ్బంది ఆ పనిచేయలేదని భార్య చెప్పింది. -
భారత ఇంజినీర్‌కు పాక్‌లో జైలు శిక్ష
పెషావర్: భారత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌కు పాకిస్ధాన్ సైనిక కోర్టు జైలు శిక్షను విధించింది. గూఢాచర్యం కేసులో అతడికి ఈ శిక్షను ఖరారు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ముంబయికి చెందిన ఇంజినీర్ హమిద్ నెహల్ అన్సారీ (31) అఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి గుఢాచర్యం నిర్వహిస్తున్నాడనే అభియోగాలతో పాక్ పోలీసులు, నిఘా విభాగం అధికారులు 2012లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి పలు కోణాల్లో విచారణ చేపట్టిన పాక్ ఆర్మీ కోర్టు తుది తీర్పును వెలువరిస్తూ అన్సారీని దోషిగా ప్రకటించింది. మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. తీర్పు అనంతరం అన్సారీని పెషావర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పాక్ ఆర్మీ ఉన్నత కోర్టుకు మరోసారి అపీల్ చేసుకునే అవకాశం అన్సారీకి ఉంది. మరోపక్క, అన్సారీని తాము విడిపించుకునేంత వరకు రక్షణ కల్పించాలని పాక్ అధికారులను భారత అధికారులు కోరారు. -
భారతీయుడి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
సింగపూర్: భారతీయుడి హత్య కేసులో మలేసియాకు చెందిన గారింగ్కి సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే నిందితుడికి సహకరించిన టోని లంబాకు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు సింగపూర్ హైకోర్టు జడ్జి సోమవారం తీర్పు వెలువరించారు. భారత్‌కు చెందిన షణ్ముఖనాథన్ (41) సింగపూర్‌లో నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. అయితే 2010లో మే 29 అర్థరాత్రి షణ్ముఖ్ నివాసంలో చోరీకి యత్నించారు. ఆ సమయంలో షణ్ముఖ్తోపాటు అతని రూమ్‌లోని ముగ్గురు ప్రతిఘటించారు. దీంతో ఆగ్రహించిన గారింగ్... షణ్ముఖ్‌ను హత్య చేసి...మిగతా వారిపై దాడి చేసి... తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం గారింగ్తోపాటు లంబా చోరీ చేసి పరారైయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేసి...కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు ఇటీవలే పూర్తయ్యాయి. గారింగ్, లంబాలను నేరస్తులుగా భావించిన హైకోర్టు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు. -
సింగపూర్ హోటల్లో 'ఆ ఇద్దరి' మృతదేహలు
సింగపూర్: ఇద్దరు భార్యభర్తలు కాదు.. పోని ఒకే దేశం వాళ్లు కూడా కాదు.. ఏమైందో ఏమో కానీ ఓ 31 ఏళ్ల ఎన్నారై యువకుడు ... 29 ఏళ్ల ఇండోనేసియా యువతి హోటల్ గదిలో విగత జీవులగా పడి ఉన్నారు. ఆ విషయం హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన సింగపూర్‌లోని గెలాంగ్ లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అవివాహితుడైన ఎన్నారై చిన్నస్వామి భాస్కర్ స్థానిక నిర్మాణ సంస్థలో గత అయిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. అలాగే మృతురాలు రులీ విద్యావతి వంటమనిషిగా పని చేస్తోందని వెల్లడించారు. ఆమెకు వివాహమైందని ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారని తెలిపారు. మృతదేహలకు పోస్ట్‌మార్టం పూర్తి అయిందని భాస్కర్ మృతదేహన్ని స్వదేశం పంపేందుకు సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం సన్నాహలు చేస్తోందన్నారు. అలాగే విద్యావతి మృతదేహాన్ని సోలోలోని ఆమె నివాసానికి పంపేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. విచారణ కూడా పూర్తి అయిందన్నారు. ఇద్దరిది సహజ మరణాలు కావని సింగపూర్ పోలీసులు స్పష్టం చేశారు. వారాంతపు సెలవులు నేపథ్యంలో సింగపూర్‌లోని గెలాంగ్ ప్రాంతమంతా విదేశీయులతో కిటకిటలాడుతోందన్న సంగతి తెలిసిందే. -
బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న భారతీయుడు పట్టివేత
రెండున్నర కిలోల బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన భారతీయుడు బిక్రమ్ కుమార్‌ను ఖట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆ బంగారాన్ని తన బూట్లులో దాచి ఉంచాడు. వీటితోపాటు చేతికి ధరించిన బంగారు బ్రాస్ లెట్‌కు వెండి కోటింగ్ కొట్టి ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చి సోదాలు నిర్వహించారు. దాంతో అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారం లభ్యమైంది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. నేపాల్‌లో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 37.67 కిలోల బంగారాన్ని స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నిందితుడు బిక్రమ్ కుమార్ స్వస్థలమని అధికారులు వెల్లడించారు.