బీజింగ్: కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో భారతీయుల వీసాలపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనాలో పని చేస్తున్న భారత్ వృత్తివిద్యా నిపుణులు, వారి కుటుంబాలు గత రెండేళ్లుగా మన దేశంలోనే ఉండిపోయారు. వారు తిరిగి చైనాకు వచ్చేలా వీసాలపై ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్టుగా చైనా ప్రకటించింది. చైనా కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులను దేశంలోకి అనుమతించే అంశాన్నీ పరిశీలిస్తోంది.
కాగా మరోవైపు.. ఇతర దేశాల వారికి ఇటీవల కాలంలో వీసాల జారీ మొదలు పెట్టిన డ్రాగన్ దేశం.. భారత్ విషయంలో మాత్రం మీన మేషాలు లేక్కవేస్తూ వచ్చింది. ఈ విషయమై భారత్ పలుమార్లు తీవ్రస్థాయిలో తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీంతో.. తీరు మార్చుకున్న చైనా భారతీయ విద్యార్థులకు మళ్లీ వీసాలు జారీ చేసేందుకు సిద్ధమైంది.
చదవండి: నాటి పరిస్థితుల దృష్ట్య అది సరైనదే! కార్గో విమాన సిబ్బందికి క్లీన్‌చిట్
Comments
Please login to add a commentAdd a comment