పెషావర్: భారత్కు చెందిన ఓ ఇంజినీర్కు పాకిస్ధాన్ సైనిక కోర్టు జైలు శిక్షను విధించింది. గూఢాచర్యం కేసులో అతడికి ఈ శిక్షను ఖరారు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ముంబయికి చెందిన ఇంజినీర్ హమిద్ నెహల్ అన్సారీ (31) అఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి గుఢాచర్యం నిర్వహిస్తున్నాడనే అభియోగాలతో పాక్ పోలీసులు, నిఘా విభాగం అధికారులు 2012లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి పలు కోణాల్లో విచారణ చేపట్టిన పాక్ ఆర్మీ కోర్టు తుది తీర్పును వెలువరిస్తూ అన్సారీని దోషిగా ప్రకటించింది.
మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. తీర్పు అనంతరం అన్సారీని పెషావర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పాక్ ఆర్మీ ఉన్నత కోర్టుకు మరోసారి అపీల్ చేసుకునే అవకాశం అన్సారీకి ఉంది. మరోపక్క, అన్సారీని తాము విడిపించుకునేంత వరకు రక్షణ కల్పించాలని పాక్ అధికారులను భారత అధికారులు కోరారు.
భారత ఇంజినీర్కు పాక్లో జైలు శిక్ష
Published Tue, Feb 16 2016 6:16 PM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
Advertisement