Hamid Nehal Ansari
-
‘తప్పు నాదే... ఎవరినీ నిందించొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు హమీద్ నిహాల్ అన్సారీ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాఘా- అట్టారీ సరిహద్దు గుండా భారత్ చేరిన హమీద్ తల్లిదండ్రులను కలుసుకున్నాడు. అనంతరం తాను విడుదలయ్యేందుకు సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘ సుష్మాజీ నన్ను తన కొడుకులా భావించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నిజంగా ఆమె భరతమాత కంటే తక్కువేమీ కాదు. యువతను సన్మార్గంలో నడిపించే మాతృమూర్తి’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తప్పు నాదే... ‘ప్రస్తుతం నేను నా ఇంటికి తిరిగి వచ్చాను. నా వాళ్ల మధ్య.. స్వదేశంలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. పాక్ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా నాకు ఇంత గొప్ప స్వాగతం లభిస్తుందనుకోలేదు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా బాధను ప్రపంచానికి పరిచయం చేసిన మీడియాకు రుణపడి ఉంటాను. అయితే ఈ విషయంలో తప్పంతా నాదే. నేను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు. నా ఉద్దేశం సరైందే. కానీ దానిని అమలు చేసిన విధానంలోనే పొరపాటు జరిగింది. అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది’ అని హమీద్ వ్యాఖ్యానించాడు. కాగా ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే హమీద్ ఆన్లైన్లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్ మీదుగా పాక్ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించిన పాక్ నిఘా సంస్థలు అతడిని అరెస్ట్ చేశాయి. ఈ క్రమంలో ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు పాక్ మిలటరీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్ జైలుకు తరలించారు. 2018 డిసెంబర్ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. కానీ అతడికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్ హైకోర్టు.. శిక్ష పూర్తయినా వ్యక్తిని జైళ్లో ఎందుకు ఉంచారని, అతడిని వెంటనే స్వదేశానికి పంపాలని ఆదేశించింది. -
అంతా మేడమ్ దయ వల్లే..!
న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న భారతీయుడు హమీద్ నిహాల్ అన్సారీ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. భారత్ చెరుకున్న హమీద్ అనంతరం తన తల్లిదండ్రులతో పాటు వెళ్లి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు హామీద్. అనంతరం ‘‘మేరా భారత్ మహాన్’, ‘మేరా మేడమ్ మహాన్’. ఇదంతా మేడం వల్లే సాధ్యమయ్యిందం’టూ కన్నీళ్లతో హమీద్ తల్లి ఫౌజియా సుష్మా స్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హమీద్ ఆన్లైన్లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్ మీదుగా పాక్ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించి పాక్ నిఘా సంస్థలు అరెస్ట్ చేశాయి. 2015లో పాక్ మిలటరీ కోర్టు అన్సారీపై కేసు విచారణ చేపట్టింది. ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్ జైలుకు తరలించారు. 2018 డిసెంబర్ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. హమీద్‌కు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్ హైకోర్టు.. శిక్ష పూర్తయినా అన్సారీని జైళ్లో ఎందుకుంచారని పాక్ అడిషనల్ అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. స్వదేశానికి పంపాలని ఆదేశించింది. దీంతో హమీద్‌ను మంగళవారం మార్దాన్ జైలు నుంచి విడుదల చేశారు. -
పాక్ జైలు నుంచి ప్రేమికుడి విడుదల
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు హమీద్ నిహాల్ అన్సారీ మంగళవారం విడుదలయ్యాడు. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హమీద్ ఆన్లైన్లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్ మీదుగా పాక్ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించి పాక్ నిఘా సంస్థలు అరెస్ట్ చేశాయి. 2015లో పాక్ మిలటరీ కోర్టు అన్సారీపై కేసు విచారణ చేపట్టింది. ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్ జైలుకు తరలించారు. 2018 డిసెంబర్ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. హమీద్‌కు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్ హైకోర్టు.. శిక్ష పూర్తయినా అన్సారీని జైళ్లో ఎందుకుంచారని పాక్ అడిషనల్ అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. స్వదేశానికి పంపాలని ఆదేశించింది. దీంతో హమీద్‌ను మంగళవారం మార్దాన్ జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం ఇస్లామాబాద్ తరలించారు. హమీద్ పాక్ వెళ్లడంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. తన ప్రేమికురాలికి బలవంతంగా నిర్వహిస్తున్న పెళ్లిని ఆపేందుకు ఖోహత్ అనే ప్రాంతానికి వెళ్లాడని ఓ పత్రిక వెల్లడించింది. ఎయిర్‌లైన్ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అప్ఘానిస్తాన్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి 2012 నవంబర్‌లో అఫ్గాన్ వెళ్లాడని మరో మీడియా సంస్థ పేర్కొంది. ఫలించిన తల్లి పోరాటం.. తన కుమారుడు కనిపించడంలేదంటూ హమీద్ తల్లి ఫాజియా అన్సారీ ఇక్కడి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. స్పందించిన హైకోర్టు హమీద్ పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నాడని సమాధానమిచ్చింది. అక్కడి మిలటరీ కోర్టు అతడికి శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. తన బిడ్డను స్వదేశానికి తిరిగి రప్పించుకునేందుకు ఆమె చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత హమీద్ భారత్‌లోకి అడుగుపెట్టాడు. భారత గడ్డను ముద్దాడిన హమీద్.. హమీద్ మంగళవారం సాయంత్రం భారతదేశంలోకి అడుగుపెట్టాడు. వాఘా– అట్టారీ సరిహద్దు వద్ద భారత గడ్డను ముద్దాడాడు. అనంతరం సరిహద్దు వద్ద వేచిచూస్తున్న అతడి తల్లిదండ్రులను కలుసుకున్నాడు. హమీద్‌ను చూడగానే అతడి తల్లిదండ్రులు ఫాజియా అన్సారీ, నిహాల్ అన్సారీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో హమీద్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. హమీద్ విడుదలకు తోడ్పడిన భారత్, పాక్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ దేశానికి క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. హమీద్ విడుదలయ్యాడని తెలియగానే ముంబైలో అతడు నివసించే వెర్సోవా ప్రాంతంలో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. -
పాక్‌లో జైలు నుంచి ప్రేమ ఖైదీ విడుదల
ఇస్లామాబాద్ : గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ హమీద్ నెహాల్ అన్సారి విడదలయ్యారు. పాక్‌లో ఉన్న ప్రియురాలిని కలుసుకోవడానికి ఆరేళ్ల కిందట(2012) ఆ దేశం వెళ్లిన హమీద్ నెహల్ అన్సారీ ఆదేశ పోలీసులకు పట్టుపడ్డారు. గూఢచర్యం చెయ్యడానికి వచ్చాడని అతనిపై పాక్ పోలీసులు కేసు పెట్టారు. 2015లో విచారణ చేపట్టిన పాక్ మిలిటరీ కోర్టు హమీద్‌కు మూడేళ్ల కారాగారవాసం విధించింది. నేటితో అతని శిక్ష ముగియడంతో హమిద్ భారత్‌కు తిరిగి రానున్నారు. తన కుమారుడి విడుదల పట్ల హమిద్ తల్లి ఫౌజియా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తన కుమారుడిని చూస్తునందుకు సంతోషంగా ఉందన్నారు. హమిద్ విడుదల మాతవత్వం విజయమని చెప్పారు. వీసా లేకుండా ఆ దేశం వెళ్లడం తప్పే కానీ, తన కుమారుడు వేరే ఉద్ధేశంతో వెళ్లలేదని, ప్రేమించిన అమ్మాయి కోసమే వెళ్లాడని వ్యాఖ్యానించారు. ముంబైలోనే ఒక సాఫ్టవేర్ ఇంజనీర్‌గా పనిచేసిన హమీద్ నెహల్, ఆప్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా ప్రవేశించినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు కున్నారు. అతను ఏడు ఫేస్బుక్ అకౌంట్లు, 30కి పైగా ఈమెయిల్ ఐడీల ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు పాక్ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో అక్రమంగా దేశంలోకి చొరబడ్డారనే కారణంతో హమిద్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. తీర్పు అనంతరం అన్సారీని పెషావర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు కాగా సోషల్ మీడియాలో అతనికి పరిచయమై ప్రేమకు దారితీసిన పాక్ యువతిని కలుసుకునేందుకే, వీసా లేకుండా ఆ దేశానికి తన కుమరుడు వెళ్లాడని హమిద్ తల్లి ఫౌజియా అన్సారి పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్ మీదుగా పాక్‌కు రమ్మని ఆ యువతి ఇచ్చిన సలహాతోనే హమిద్ వెళ్లాడని చెప్పారు. తన కుమారుడిపై పాకిస్తాన్ చేసిన అభియోగాలను ఆమె ఖండించారు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం గూఢచార్యం కోసమే తమ దేశంలోని చొరబడ్డారని మూడేళ్లు శిక్ష విధించారు. -
సంచలన జర్నలిస్టు విడుదల..
లాహోర్: రెండేళ్ల క్రితం అదృశ్యమైన పాకిస్థాన్ సంచలన జర్నలిస్టు జీనత్ షాజాదీ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం పాక్ సరిహద్దుల్లో కొందరి బలుచిస్తాన్ యువకులు, గిరిజనుల సాయంతో అసాంఘిక శక్తుల చెర నుంచి ఆమెను విడిపించారు. ఈవిషయాన్ని సీఐఈడీ ప్రెసిడెంట్ జస్టీస్ జావేద్ ఇక్భాల్ దృవీకరించారు. నయీ ఖబర్ అనే దినపత్రికలో స్థానిక రిపోర్టర్‌గా పనిచేస్తున్న జీనత్ (26) గూఢచార్యం ఆరోపణలపై అరెస్టయిన భారతీయ ఖైదీ హమీద్ అన్సారీ కేసును భుజానికెత్తుకొంది. ఈ క్రమంలో హమీద్ కోసం ఆయన తల్లి ఫౌజియా అన్సారీ తరఫున సుప్రీంకోర్టులోని మానవహక్కుల విభాగంలో జీనత్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత 2015 ఆగస్టు 19న ఆటోరిక్షాలో ఆఫీస్ కెళ్తున్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఐటీ ఇంజినీర్ హమీద్ అన్సారీకి ఫేస్బుక్లో పరిచయమైన పాకిస్థాన్‌లో ఓ యువతి ప్రేమించుకొన్నారు. ఆమెను కలుసుకోవడానికి వీసా లభించకపోవడంతో 2012 నవంబర్ 4న అక్రమంగా కాబూల్ చేరుకొన్నాడు. ఆన్లైన్ ఫ్రెండ్స్ కోహత్ అనే పట్టణంలోని ఓ హోటల్లో వసతి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2012 నవంబర్ 14న హమీద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి భద్రతా సిబ్బందికి అప్పగించారు. అతని తల్లికి సాయంగా నిలిచిన జీనత్ అదృశ్యం అప్పట్లో సంచలనం రేపింది. జీనత్ షాజాదీని లాహోర్‌లోని తన కుటుంబ సభ్యులతో కలపడం ఆనందంగా ఉందని బీనా సర్వర్ అనే సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ఇక అక్కను వెతికి వెతికి విసిగిపోయి.. మానసిక వ్యధకు గురైన ఆమె తమ్ముడు సద్దాం ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇప్పటికీ హమీద్ పాక్ జైళ్లోనే ఉన్నారు. అతనికోసం పాక్ మానవహక్కుల నేత రెహ్మాన్ పోరాడుతున్నారు. -
పాక్ జైల్లో భారతీయ ఖైదీపై దాడి
తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పాకిస్తాన్లో ప్రవేశించాడనే కారణంతో పెషావర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 31 ఏళ్ల భారతీయ ఖైదీపై స్థానిక ఖైదీలు గత కొద్ది నెలల్లో మూడు సార్లు దాడికి పాల్పడినట్లు అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు ముంబైకి చెందిన హమిద్ నెహాల్ అన్సారీ 2012లో తప్పుడు ధ్రువీకరణ పత్రంతో భారత్ నుంచి అఫ్ఘానిస్తాన్ ద్వారా పాక్‌లో ప్రవేశించాడు. హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న తీవ్ర నేరస్తులున్న సెల్లో తన క్లయింట్‌ను ఉంచడం వల్ల వారు అతన్ని తీవ్రంగా కొడుతున్నారని అన్సారీ తరుపు న్యాయవాది పెషావర్ హైకోర్టుకు విన్నవించారు. జైలు హెడ్ వార్డర్ కూడా ఏ కారణం లేకుండానే అతన్ని ప్రతిరోజూ హింసిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. భారతీయ ఖైదీపై దాడి వాస్తవమేనని, ఇదేమీ అంత పెద్ద సంఘటన కాదని, జైళ్లలో ఇటువంటి ఘటనలు సహజమేనని జైలు సూపరింటెండెంట్ అన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది. -
భారత ఇంజినీర్‌కు పాక్‌లో జైలు శిక్ష
పెషావర్: భారత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌కు పాకిస్ధాన్ సైనిక కోర్టు జైలు శిక్షను విధించింది. గూఢాచర్యం కేసులో అతడికి ఈ శిక్షను ఖరారు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ముంబయికి చెందిన ఇంజినీర్ హమిద్ నెహల్ అన్సారీ (31) అఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి గుఢాచర్యం నిర్వహిస్తున్నాడనే అభియోగాలతో పాక్ పోలీసులు, నిఘా విభాగం అధికారులు 2012లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి పలు కోణాల్లో విచారణ చేపట్టిన పాక్ ఆర్మీ కోర్టు తుది తీర్పును వెలువరిస్తూ అన్సారీని దోషిగా ప్రకటించింది. మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. తీర్పు అనంతరం అన్సారీని పెషావర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పాక్ ఆర్మీ ఉన్నత కోర్టుకు మరోసారి అపీల్ చేసుకునే అవకాశం అన్సారీకి ఉంది. మరోపక్క, అన్సారీని తాము విడిపించుకునేంత వరకు రక్షణ కల్పించాలని పాక్ అధికారులను భారత అధికారులు కోరారు.