ఇస్లామాబాద్ : గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ హమీద్ నెహాల్ అన్సారి విడదలయ్యారు. పాక్‌లో ఉన్న ప్రియురాలిని కలుసుకోవడానికి ఆరేళ్ల కిందట(2012) ఆ దేశం వెళ్లిన హమీద్ నెహల్ అన్సారీ ఆదేశ పోలీసులకు పట్టుపడ్డారు. గూఢచర్యం చెయ్యడానికి వచ్చాడని అతనిపై పాక్ పోలీసులు కేసు పెట్టారు. 2015లో విచారణ చేపట్టిన పాక్ మిలిటరీ కోర్టు హమీద్‌కు మూడేళ్ల కారాగారవాసం విధించింది. నేటితో అతని శిక్ష ముగియడంతో హమిద్ భారత్‌కు తిరిగి రానున్నారు.
తన కుమారుడి విడుదల పట్ల హమిద్ తల్లి ఫౌజియా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తన కుమారుడిని చూస్తునందుకు సంతోషంగా ఉందన్నారు. హమిద్ విడుదల మాతవత్వం విజయమని చెప్పారు. వీసా లేకుండా ఆ దేశం వెళ్లడం తప్పే కానీ, తన కుమారుడు వేరే ఉద్ధేశంతో వెళ్లలేదని, ప్రేమించిన అమ్మాయి కోసమే వెళ్లాడని వ్యాఖ్యానించారు.
ముంబైలోనే ఒక సాఫ్టవేర్ ఇంజనీర్‌గా పనిచేసిన హమీద్ నెహల్, ఆప్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు కున్నారు. అతను ఏడు ఫేస్‌బుక్ అకౌంట్లు, 30కి పైగా ఈమెయిల్ ఐడీల ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు పాక్ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో అక్రమంగా దేశంలోకి చొరబడ్డారనే కారణంతో హమిద్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. తీర్పు అనంతరం అన్సారీని పెషావర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు
కాగా సోషల్ మీడియాలో అతనికి పరిచయమై ప్రేమకు దారితీసిన పాక్ యువతిని కలుసుకునేందుకే, వీసా లేకుండా ఆ దేశానికి తన కుమరుడు వెళ్లాడని హమిద్ తల్లి ఫౌజియా అన్సారి పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్ మీదుగా పాక్‌కు రమ్మని ఆ యువతి ఇచ్చిన సలహాతోనే హమిద్ వెళ్లాడని చెప్పారు. తన కుమారుడిపై పాకిస్తాన్ చేసిన అభియోగాలను ఆమె ఖండించారు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం గూఢచార్యం కోసమే తమ దేశంలోని చొరబడ్డారని మూడేళ్లు శిక్ష విధించారు.
Comments
Please login to add a commentAdd a comment