Indian prisoner
-
‘తప్పు నాదే... ఎవరినీ నిందించొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు హమీద్ నిహాల్ అన్సారీ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాఘా- అట్టారీ సరిహద్దు గుండా భారత్ చేరిన హమీద్ తల్లిదండ్రులను కలుసుకున్నాడు. అనంతరం తాను విడుదలయ్యేందుకు సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘ సుష్మాజీ నన్ను తన కొడుకులా భావించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నిజంగా ఆమె భరతమాత కంటే తక్కువేమీ కాదు. యువతను సన్మార్గంలో నడిపించే మాతృమూర్తి’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తప్పు నాదే... ‘ప్రస్తుతం నేను నా ఇంటికి తిరిగి వచ్చాను. నా వాళ్ల మధ్య.. స్వదేశంలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. పాక్ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా నాకు ఇంత గొప్ప స్వాగతం లభిస్తుందనుకోలేదు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా బాధను ప్రపంచానికి పరిచయం చేసిన మీడియాకు రుణపడి ఉంటాను. అయితే ఈ విషయంలో తప్పంతా నాదే. నేను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు. నా ఉద్దేశం సరైందే. కానీ దానిని అమలు చేసిన విధానంలోనే పొరపాటు జరిగింది. అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది’ అని హమీద్ వ్యాఖ్యానించాడు. కాగా ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే హమీద్ ఆన్లైన్లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్ మీదుగా పాక్ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించిన పాక్ నిఘా సంస్థలు అతడిని అరెస్ట్ చేశాయి. ఈ క్రమంలో ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు పాక్ మిలటరీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్ జైలుకు తరలించారు. 2018 డిసెంబర్ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. కానీ అతడికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్ హైకోర్టు.. శిక్ష పూర్తయినా వ్యక్తిని జైళ్లో ఎందుకు ఉంచారని, అతడిని వెంటనే స్వదేశానికి పంపాలని ఆదేశించింది. -
పాక్‌లో జైలు నుంచి ప్రేమ ఖైదీ విడుదల
ఇస్లామాబాద్ : గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ హమీద్ నెహాల్ అన్సారి విడదలయ్యారు. పాక్‌లో ఉన్న ప్రియురాలిని కలుసుకోవడానికి ఆరేళ్ల కిందట(2012) ఆ దేశం వెళ్లిన హమీద్ నెహల్ అన్సారీ ఆదేశ పోలీసులకు పట్టుపడ్డారు. గూఢచర్యం చెయ్యడానికి వచ్చాడని అతనిపై పాక్ పోలీసులు కేసు పెట్టారు. 2015లో విచారణ చేపట్టిన పాక్ మిలిటరీ కోర్టు హమీద్‌కు మూడేళ్ల కారాగారవాసం విధించింది. నేటితో అతని శిక్ష ముగియడంతో హమిద్ భారత్‌కు తిరిగి రానున్నారు. తన కుమారుడి విడుదల పట్ల హమిద్ తల్లి ఫౌజియా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తన కుమారుడిని చూస్తునందుకు సంతోషంగా ఉందన్నారు. హమిద్ విడుదల మాతవత్వం విజయమని చెప్పారు. వీసా లేకుండా ఆ దేశం వెళ్లడం తప్పే కానీ, తన కుమారుడు వేరే ఉద్ధేశంతో వెళ్లలేదని, ప్రేమించిన అమ్మాయి కోసమే వెళ్లాడని వ్యాఖ్యానించారు. ముంబైలోనే ఒక సాఫ్టవేర్ ఇంజనీర్‌గా పనిచేసిన హమీద్ నెహల్, ఆప్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా ప్రవేశించినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు కున్నారు. అతను ఏడు ఫేస్బుక్ అకౌంట్లు, 30కి పైగా ఈమెయిల్ ఐడీల ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు పాక్ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో అక్రమంగా దేశంలోకి చొరబడ్డారనే కారణంతో హమిద్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. తీర్పు అనంతరం అన్సారీని పెషావర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు కాగా సోషల్ మీడియాలో అతనికి పరిచయమై ప్రేమకు దారితీసిన పాక్ యువతిని కలుసుకునేందుకే, వీసా లేకుండా ఆ దేశానికి తన కుమరుడు వెళ్లాడని హమిద్ తల్లి ఫౌజియా అన్సారి పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్ మీదుగా పాక్‌కు రమ్మని ఆ యువతి ఇచ్చిన సలహాతోనే హమిద్ వెళ్లాడని చెప్పారు. తన కుమారుడిపై పాకిస్తాన్ చేసిన అభియోగాలను ఆమె ఖండించారు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం గూఢచార్యం కోసమే తమ దేశంలోని చొరబడ్డారని మూడేళ్లు శిక్ష విధించారు. -
పాక్ జైల్లో భారతీయ ఖైదీపై దాడి
తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పాకిస్తాన్లో ప్రవేశించాడనే కారణంతో పెషావర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 31 ఏళ్ల భారతీయ ఖైదీపై స్థానిక ఖైదీలు గత కొద్ది నెలల్లో మూడు సార్లు దాడికి పాల్పడినట్లు అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు ముంబైకి చెందిన హమిద్ నెహాల్ అన్సారీ 2012లో తప్పుడు ధ్రువీకరణ పత్రంతో భారత్ నుంచి అఫ్ఘానిస్తాన్ ద్వారా పాక్‌లో ప్రవేశించాడు. హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న తీవ్ర నేరస్తులున్న సెల్లో తన క్లయింట్‌ను ఉంచడం వల్ల వారు అతన్ని తీవ్రంగా కొడుతున్నారని అన్సారీ తరుపు న్యాయవాది పెషావర్ హైకోర్టుకు విన్నవించారు. జైలు హెడ్ వార్డర్ కూడా ఏ కారణం లేకుండానే అతన్ని ప్రతిరోజూ హింసిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. భారతీయ ఖైదీపై దాడి వాస్తవమేనని, ఇదేమీ అంత పెద్ద సంఘటన కాదని, జైళ్లలో ఇటువంటి ఘటనలు సహజమేనని జైలు సూపరింటెండెంట్ అన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది. -
పాక్ జైల్లో భారతీయ ఖైదీ మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ క్రిపల్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందినట్టు పాకిస్థాన్ అధికారులు ప్రకటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న క్రిపల్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే తుది శ్వాస విడిచినట్టు కోట్ లఖ్ పత్ జైలు అధికారులు తెలిపారు. 1991 ఫసియాబాద్ రైల్వే స్టేషన్ బాంబు పేలుళ్ల కేసులో క్రిపల్ దోషిగా, ఉగ్రవాదం, గూఢచర్యం కేసులో యావజ్జీవశిక్షను అనుభవస్తున్నారు. 2013లో ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న సరబ్ సింగ్ పై ఇద్దరు సహ ఖైదీలు దాడిచేయగా తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. -
పరారైన భారతీయ ఖైదీని అరెస్ట్ చేసిన పాక్
పాకిస్థానీ జైలు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో పరారైన భారతీయ ఖైదీ కిషోర్ భగవాన్ బాయిని తిరిగి అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. కరాచీలోని పిబీఐ కాలనీలో కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు స్థానిక జియో న్యూస్ వెల్లడించింది. చేపల వేటలో భారతీయ మత్స్యకారుడు పాకిస్థానీ ప్రాదేశిక జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించారు. ఈ నేపథ్యంలో కొంత మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కరాచీలోని లోది జైలు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రత సిబ్బంది కళ్లు కప్పి కిషోర్ భగవాన్ పరారైయ్యాడు. -
'సరబ్ జిత్'లో అమితాబ్ నటించడం లేదు: సుభాష్ ఘయ్
పాకిస్థానీ జైల్లో మరణించి భారతీయ ఖైదీ సరబ్జిత్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో బిగ్ బీ అమితాబ్ నటించడం లేదని ఆ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయి వెల్లడించారు. ఆ చిత్రంలో పాకిస్థానీ న్యాయవాది పాత్ర పోషించాలని అమితాబ్‌ని కలసి కోరానని ఆయన తెలిపారు. అయితే ఆయన సినిమాల్లో నటిస్తు మహా బీజిగా ఉన్నానని చెప్పారని పేర్కొన్నారు. అదికాక ఓ చిత్రంలో న్యాయవాద పాత్ర పోషించేందుకు ఇప్పటికే ఒప్పకున్నట్లు కూడా ఆయన వివరించారని మంగళవారం ముంబైలో తెలిపారు. ఆ మహానటుడితో కలసి పనిచేయాలని తన ఆశపడుతున్నట్లు చెప్పారు. ఆ పాత్ర కోసం మరోకరిని ఎంపిక చేసేందుకు నటుడి అన్వేషణ ప్రారంభించినట్లు వివరించారు. సరబ్జిత్ చిత్రానికి ఈశ్వర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. అలాగే అనురాగ్ సిన్హా, సోనాక్షి సిన్హాలు నటిస్తున్నారని సుభాష్ ఘాయి వెల్లడించారు. పాకిస్థానీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు భారతీయుడు సరబ్ జిత్ పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దాంతో ఆ దేశ దళాలు సరబ్ జిత్త్ ను అరెస్ట్ చేశారు. పాక్ లో పేలిన బాంబు ఘటనకు సరబ్ తో సంబంధం ఉందని ఆ దేశం ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో శిక్ష అనుభవిస్తూ... తోటి ఖైదీల దాడిలో గాయపడి మరణించిన సంగతి తెలిసిందే. -
పాక్‌లో భారత ఖైదీల విడుదల
కరాచీ: తమ జైళ్లలో ఉన్న 337 మంది భారత ఖైదీలను పాకిస్తాన్ శుక్రవారంనాడు విడుదల చేసింది. వారిలో ఎక్కువమంది జాలర్లు ఉన్నారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఖైదీల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. కరాచీలోని మాలిర్ జైలు నుంచి 329 మంది ఖైదీలను, లాంథి జైలు నుంచి ఎనిమిది మంది బాలలను విడుదల చేసినట్లు దక్షిణసింథ్ రాష్ర్ట హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. మాలిర్లో మరో ఖైదీ ఉన్నారని, అయితే అతని జాతీయతపై సందేహాలు నెలకొనడంతో విడుదల చేయలేదన్నారు.