'సరబ్ జిత్'లో అమితాబ్ నటించడం లేదు: సుభాష్ ఘయ్
పాకిస్థానీ జైల్లో మరణించి భారతీయ ఖైదీ సరబ్జిత్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో బిగ్ బీ అమితాబ్ నటించడం లేదని ఆ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయి వెల్లడించారు. ఆ చిత్రంలో పాకిస్థానీ న్యాయవాది పాత్ర పోషించాలని అమితాబ్ని కలసి కోరానని ఆయన తెలిపారు. అయితే ఆయన సినిమాల్లో నటిస్తు మహా బీజిగా ఉన్నానని చెప్పారని పేర్కొన్నారు.
అదికాక ఓ చిత్రంలో న్యాయవాద పాత్ర పోషించేందుకు ఇప్పటికే ఒప్పకున్నట్లు కూడా ఆయన వివరించారని మంగళవారం ముంబైలో తెలిపారు. ఆ మహానటుడితో కలసి పనిచేయాలని తన ఆశపడుతున్నట్లు చెప్పారు. ఆ పాత్ర కోసం మరోకరిని ఎంపిక చేసేందుకు నటుడి అన్వేషణ ప్రారంభించినట్లు వివరించారు. సరబ్జిత్ చిత్రానికి ఈశ్వర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. అలాగే అనురాగ్ సిన్హా, సోనాక్షి సిన్హాలు నటిస్తున్నారని సుభాష్ ఘాయి వెల్లడించారు.
పాకిస్థానీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు భారతీయుడు సరబ్ జిత్ పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దాంతో ఆ దేశ దళాలు సరబ్ జిత్త్ ను అరెస్ట్ చేశారు. పాక్ లో పేలిన బాంబు ఘటనకు సరబ్ తో సంబంధం ఉందని ఆ దేశం ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో శిక్ష అనుభవిస్తూ... తోటి ఖైదీల దాడిలో గాయపడి మరణించిన సంగతి తెలిసిందే.