Martyr Sarabjit Singh Sister Dalbir Kaur Passed Away With Heart Attack at 60 - Sakshi
Sakshi News home page

Dalbir Kaur: తమ్ముడి కోసం పోరాడిన యోధురాలు కన్నుమూత

Published Mon, Jun 27 2022 6:52 AM | Last Updated on Mon, Jun 27 2022 9:28 AM

Martyr Sarabjit Singh Sister Dalbir Kaur Passed Away - Sakshi

అమృత్‌సర్‌: పాకిస్తాన్‌ జైల్లో సహచర ఖైదీలు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీ యుడు సరబ్‌జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్‌ కౌర్‌ కన్ను మూశారు. గుండెపోటు వచ్చిన ఆమె ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

సరబ్‌జిత్‌ సింగ్‌పై తప్పుడు నిందలు మోపి పాకిస్తాన్‌ 1991లో అదుపులోకి తీసుకుంది. అప్పట్నుంచి ఆమె తన తమ్ముడి విడుదల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. అప్పట్లోనే ఆమె దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచారు. చివరికి  2013లో సరబ్‌జిత్‌ పాక్‌ జైల్లో ప్రాణాలు కోల్పోయారు.

సరబ్‌జిత్‌ సింగ్‌.. దల్బీర్‌ కౌర్‌ పోరాటం ఇతివృత్తం ఆధారంగానే 2016లో ఒమంగ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో ఐశ్వర్యరాయ్‌-రణ్‌దీప్‌ హుడా ‘సరబ్‌జిత్‌’ సినిమా వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement