Dalbir Kaur
-
పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్..
Randeep Hooda Performs Last Rites Of Sarabjit Singh Sister Dalbir Kaur: బాలీవుడ్ ప్రముఖ నటుల్లో రణ్‌దీప్ హుడా ఒకరు. తాజాగా పంజాబ్‌కు చెందిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ పాడెను మోసి, అంత్యక్రియలు నిర్వహించాడు. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణల కింద సరబ్జిత్ సింగ్‌కు పాకిస్తాన్ సుప్రీం కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అతని బయోపిక్‌గా 2016లో తెరకెక్కిన 'సరబ్జిత్' సినిమాలో సరబ్జిత్ సింగ్ పాత్రలో రణ్‌దీప్ హుడా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్‌కు రణ్‌దీప్ హుడాకు మంచి అనుబంధం ఏర్పడింది. రణ్‌దీప్ హుడాలో తన సోదరుడు సరబ్జిత్ సింగ్‌ను చూసుకుంటున్నట్లుగా ఆమె అతనితో చెప్పింది. ఈ క్రమంలోనే రణ్‌దీప్ హుడాను దల్బీర్ కౌర్ ఒక కోరిక కోరింది. తాను చనిపోయినప్పుడు ఆమెకు 'కంధ' (అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు భుజంపై పాడెను మోయడం) ఇవ్వాల్సిందిగా అడిగింది. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా ఒక సోదరుడిలా దల్బీర్ కౌర్ దహన సంస్కరాలు నిర్వహించాడు రణ్‌దీప్. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) ఈ విషయంపై తన ఇన్‌స్టాలో ఆమె చివరిసారిగా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ 'నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ నేను వెళ్లేసరికి ఆమె వెళ్లిపోయింది. దల్బీర్ కౌర్‌జీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారని అనుకోలేదు. ఆమె తన ప్రియమైన సోదరుడు సరబ్జిత్ సింగ్‌ను కాపాడుకునేందుకు ఎంతో పోరాటం చేసింది. ఆమె ప్రేమ, ఆశీర్వాదం నాపై ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. ఆమె కట్టిన రాఖీని నా జీవితంలో మర్చిపోలేను.' అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. కాగా దల్బీర్ కౌర్ పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో ఉన్న భిఖివింద్‌లో ఆదివారం (జూన్ 26) గుండెపోటుతో మరణించింది. -
Dalbir Kaur: సరబ్జిత్ సింగ్ సోదరి మృతి
అమృత్సర్: పాకిస్తాన్ జైల్లో సహచర ఖైదీలు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీ యుడు సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్ను మూశారు. గుండెపోటు వచ్చిన ఆమె ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సరబ్జిత్ సింగ్‌పై తప్పుడు నిందలు మోపి పాకిస్తాన్ 1991లో అదుపులోకి తీసుకుంది. అప్పట్నుంచి ఆమె తన తమ్ముడి విడుదల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. అప్పట్లోనే ఆమె దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచారు. చివరికి 2013లో సరబ్జిత్ పాక్ జైల్లో ప్రాణాలు కోల్పోయారు. సరబ్జిత్ సింగ్.. దల్బీర్ కౌర్ పోరాటం ఇతివృత్తం ఆధారంగానే 2016లో ఒమంగ్ కుమార్ డైరెక్షన్లో ఐశ్వర్యరాయ్-రణ్‌దీప్ హుడా ‘సరబ్జిత్’ సినిమా వచ్చింది. -
బీజేపీలో చేరిన 'సరబ్జిత్' సోదరి
ఫజీకా(పంజాబ్): పాకిస్థాన్ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ ఆదివారం బీజేపీలో చేరారు. వీరి జీవితకథ ఆధారంగా నిర్మించిన బయోపిక్ 'సరబ్జిత్'. రణ్‌దీప్ హుడా సరబ్జిత్గా, ఐశ్యర్యరాయ్ ఆయన సోదరిగా ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సోదరుడి కోసం దల్బీర్ కౌర్ రెండు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం చేశారు. తమ్ముడి విముక్తి కోసం పదివేల కిలోమీటర్ల ప్రయాణించారు. వేలాది కొవ్వొత్తుల ప్రదర్శనలు, వందలాది ర్యాలీలు నిర్వహించారు. తమ్ముడికి విముక్తి కల్పించడం కోసం ఇరు దేశాల మధ్య 170 మంది రాజకీయ నేతలను ఆమె కలుసుకున్నారు. దల్బీర్ కౌర్‌ది అమృత్ సర్‌కు సమీపంలోని భికివిండ్ అనే కుగ్రామం. తమ్ముడు సరబ్జిత్ పొరపాటున దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. తాము వెతుకుతున్న మరెవరో భారత గూఢచారి అనుకొని 1990, ఆగస్టు 28వ తేదీన సరబ్‌ను పాకిస్తాన్ సైనికులు అరెస్టు చేశారు. గూఢచర్యం అభియోగాలపై కేసును విచారించిన పాక్ కోర్టు 1991లో ఉరిశిక్ష విధించి జైల్లో నిర్బంధించింది. తమ్ముడి జాడ కోసం వెతుకుతున్న దల్బీర్ కౌర్‌కు ఈ విషయం తెల్సింది. అప్పటి నుంచి ఆమె తమ్ముడి విడుదల కోసం భారత అధికారుల మీద ఒత్తిడి తీసుకరావడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రధాన మంత్రుల వరకు ఆమె ఎవరిని వదిలి పెట్టలేదు. ఎవరు అనుమతి ఇచ్చినా లేకపోయినా గేట్లు దూసుకుపోయారు. 1991లో ఆమె అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు దాదాపు వంద సార్లు ఫోన్ చేశారు. ఈ బెడద తట్టుకోలేక పీవీ ఆమెను పిలిపించారు. ‘చింతా మత్ కరో హమ్ తుమారే భాయ్ కో లే ఆయెంగే (బాధ పడకు మీ తమ్ముడిని మేము తీసుకొస్తాం)’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా కలుసుకున్నారు. మన్మోహన్ సిఫారసుపై అప్పటి పాక్ అధినేత ముషార్రఫ్‌ను కులుసుకున్నారు. అప్పటికీ సరబ్జిత్కు ఉరిశిక్షను అమలు చేయకపోవడంతో ఉరిశిక్షను నిలిపివేయిస్తానంటూ ముషార్రఫ్ హామీ ఇచ్చారు. మాజీ క్రికెటర్ నవజోతి సింగ్ సిద్ధూను కూడా ఆమె కలుసుకున్నారు. తమ్ముడి కోసం పోరాటం జరపుతున్న ఇలాంటి అక్కను తానెన్నడూ చూడలేదని ఆ సందర్భంగా సిద్ధు వ్యాఖ్యానించారు. లాహోర్‌లోని కోట్ లోక్పత్ జైల్లో ఉన్న సరబ్జిత్ను కలుసుకునేందుకు 2011లో దల్బీర్ కౌర్‌కు అవకాశం దొరికింది. ఈ సందర్భంగా ఆమె తమ్ముడికి రాఖీ కట్టి ఎలాగైనా ‘నిన్ను విడిపించుకుంటానురా తుమ్ముడూ!’ అంటూ శపథం చేశారు. ఆ సందర్భంగా తమ్ముడి కళ్ల నుంచి పెళ్లుబికిన కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయానని ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇటు భారత్ నేతలు, అటు పాక్ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినా సరబ్జిత్ విడుదల కాలేదు. 2013, ఏప్రిల్ 26వ తేదీన సరబ్జిత్ను తోటి ఖైదీలు చంపేశారు. సరబ్జిత్ను విడుదల చేస్తే ఓ అమాయకుడిని అన్యాయంగా అరెస్టుచేసి శిక్ష విధించారనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందనే ఉద్దేశంతో పాక్ సైనిక శక్తులే సరబ్జిత్ హత్యకు కుట్రపన్నాయనే విమర్శలు వచ్చాయి. సరబ్‌కు సజీవంగా స్వాగతం చెబుతామని సొంతూరులో నిరీక్షిస్తున్న దల్బీర్ కౌర్ ఇంటికి తమ్ముడి శవం చేరింది. తమ్ముడికి ఘనంగా దహన సంస్కారాలు చేసిన దల్బీర్ కళ్లల్లో నీళ్లింకిపోయినా పోరాట స్ఫూర్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. -
పోరాట దీప్తి.. దల్బీర్ కౌర్
చండీగఢ్: దల్బీర్ కౌర్...ఆమె పేరు వినగానే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రెండు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం, తమ్ముడి విముక్తి కోసం సాగించిన పదివేల కిలోమీటర్ల ప్రయాణం గుర్తొస్తాయి. వేలాది కొవ్వొత్తుల ప్రదర్శనలు, వందలాది ర్యాలీలు కళ్ల ముందు మెదలుతాయి. ఇరు దేశాల మధ్య 170 మంది రాజకీయ నేతలను కలుసుకున్న సందర్భాలు స్మృతికొస్తాయి. దల్బీర్ కౌర్ తన తమ్ముడి కోసం 23 ఏళ్లపాటు సాగించిన పోరాటంలో ఆమె ఏనాడు అలసిపోలేదు. ప్రతి రోజూ నిత్య పోరాట స్ఫూర్తితోనే నిద్ర లేచారు. ఆ తర్వాత ప్రతి క్షణం తన తమ్ముడిని కలుసుకోవాలని, విడదల కోసం కృషి చేయాలని ఆరాటపడ్డారు. తన తమ్ముడు ఏ జైలులో ఉన్నాడో తెలుసుకోవడంతోపాటు భారత్ పాస్‌పోర్ట్, పాక్ వీసా సాధించడం, జైల్లో తమ్ముడిని కలుసుకోవడం వరకు ఏనాడు నిరాశా నిస్పృహలకు గురికాలేదు. కడుపులో పుట్టిన కన్న బిడ్డకన్నా కడుపు పంచుకొని పుట్టిన తమ్ముడు సరబ్జిత్ కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. దల్బీర్ కౌర్‌ది అమృత్‌సర్‌కు సమీపంలోని భికివిండ్ అనే కుగ్రామం. తమ్ముడు సరబ్జిత్ పొరపాటున దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. తాము వెతుకుతున్న మరెవరో భారత గూఢచారి అనుకొని 1990, ఆగస్టు 28వ తేదీన సరబ్‌ను పాకిస్తాన్ సైనికులు అరెస్టు చేశారు. గూఢచర్యం అభియోగాలపై కేసును విచారించిన పాక్ కోర్టు 1991లో ఉరిశిక్ష విధించి జైల్లో నిర్బంధించింది. తమ్ముడి జాడ కోసం వెతుకుతున్న దల్బీర్ కౌర్‌కు ఈ విషయం తెల్సింది. అప్పటి నుంచి ఆమె తమ్ముడి విడుదల కోసం భారత అధికారుల మీద ఒత్తిడి తీసుకరావడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రధాన మంత్రుల వరకు ఆమె ఎవరిని వదిలి పెట్టలేదు. ఎవరు అనుమతి ఇచ్చినా లేకపోయినా గేట్లు దూసుకుపోయారు. 1991లో ఆమె అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు దాదాపు వంద సార్లు ఫోన్ చేశారు. ఈ బెడద తట్టుకోలేక పీవీ ఆమెను పిలిపించారు. ‘చింతా మత్ కరో హమ్ తుమారే భాయ్ కో లే ఆయెంగే (బాధ పడకు మీ తమ్ముడిని మేము తీసుకొస్తాం)’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా కలుసుకున్నారు. మన్మోహన్ సిఫారసుపై అప్పటి పాక్ అధినేత ముషార్రఫ్‌ను కులుసుకున్నారు. అప్పటికీ సరబ్జిత్కు ఉరిశిక్షను అమలు చేయకపోవడంతో ఉరిశిక్షను నిలిపివేయిస్తానంటూ ముషార్రఫ్ హామీ ఇచ్చారు. మాజీ క్రికెటర్ నవజోతి సింగ్ సిద్ధూను కూడా ఆమె కలుసుకున్నారు. తమ్ముడి కోసం పోరాటం జరపుతున్న ఇలాంటి అక్కను తానెన్నడూ చూడలేదని ఆ సందర్భంగా సిద్ధు వ్యాఖ్యానించారు. లాహోర్‌లోని కోట్ లోక్పత్ జైల్లో ఉన్న సరబ్జిత్ను కలుసుకునేందుకు 2011లో దల్బీర్ కౌర్‌కు అవకాశం దొరికింది. ఈ సందర్భంగా ఆమె తమ్ముడికి రాఖీ కట్టి ఎలాగైనా ‘నిన్ను విడిపించుకుంటానురా తుమ్ముడూ!’ అంటూ శపథం చేశారు. ఆ సందర్భంగా తమ్ముడి కళ్ల నుంచి పెళ్లుబికిన కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయానని ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇటు భారత్ నేతలు, అటు పాక్ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినా సరబ్జిత్ విడుదల కాలేదు. 2013, ఏప్రిల్ 26వ తేదీన సరబ్జిత్ను తోటి ఖైదీలు చంపేశారు. సరబ్జిత్ను విడుదల చేస్తే ఓ అమాయకుడిని అన్యాయంగా అరెస్టుచేసి శిక్ష విధించారనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందనే ఉద్దేశంతో పాక్ సైనిక శక్తులే సరబ్జిత్ హత్యకు కుట్రపన్నాయనే విమర్శలు వచ్చాయి. సరబ్‌కు సజీవంగా స్వాగతం చెబుతామని సొంతూరులో నిరీక్షిస్తున్న దల్బీర్ కౌర్ ఇంటికి తమ్ముడి శవం చేరింది. తమ్ముడికి ఘనంగా దహన సంస్కారాలు చేసిన దల్బీర్ కళ్లల్లో నీళ్లింకిపోయినా పోరాట స్ఫూర్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. (దల్బీర్ కౌర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిర్మించిన బాలివుడ్ చిత్రమే ‘సరబ్జిత్’. దల్బీర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించిన ఈ చిత్రం మే 20వ తేదీన విడుదలవుతోంది.) -
ఐస్ చెమర్చాయి!
ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కేవలం ‘అందాల తార’గా మాత్రమే మిగిలిపోకుండా మంచి నటి అని కూడా నిరూపించుకున్నారు. ఇద్దరు, జీన్స్, హమ్ దిల్ దే చుకే సనమ్, తాళ్, దేవదాస్, గురు, జోథా అక్బర్, రోబో.. ఇలా ఐష్ అద్భుత అభినయానికి ఆమె చేసిన చిత్రాలను ఎన్నింటినో చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ప్రస్తుతం సరబ్ జిత్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో ఐశ్వర్యా రాయ్ చేస్తున్న దల్బీర్ కౌర్ పాత్ర మరో ఎత్తు అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పంజాబీ రైతు సరబ్జిత్ సింగ్ పొరపాటున పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్లడం, గూఢచారి అనే అనుమానంతో పాక్ ప్రభుత్వం అతన్ని జైలులో పెట్టిన విషయం తెలిసిందే. తన తమ్ముడు నిర్దోషి అని నిరూపించి, ఎలాగైనా చెరసాల నుంచి విడిపించాలని తపన పడ్డారు సరబ్ జిత్ సోదరి దల్బీర్ కౌర్. కానీ, 23 ఏళ్లు జైలులో మగ్గి, చివరికి జైలులో తోటి ఖైదీలు దాడి చేయడంతో చనిపోయారు సరబ్జిత్. అతని సోదరి పాత్రనే ఐశ్వర్యా రాయ్ చేస్తున్నారు. తమ్ముడి విడుదల కోసం దల్బీర్ చేసిన పోరాటం, పడిన ఆవేదనలను రీల్‌పై ఐష్ ఆవిష్కరించనున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఐష్ ఉపన్యాసం ఇచ్చే సీన్ తీశారు. కన్నీటి పర్యంతమవుతూ ఐష్ ఆ ఉపన్యాసం ఇస్తారు. ఒకే టేక్‌లో ఈ సీన్ చేసేశారట. ఐష్ నటిస్తున్నప్పుడు అందరి కళ్లూ చెమర్చాయట. ఎవరికి వాళ్లు నిలబడి చప్పట్లతో ఐష్‌ని అభినందించారని సమాచారం. దీన్నిబట్టి ఈ అందాల తార ఎంత సహజంగా ఆ సీన్ పండించి ఉంటారో ఊహించుకోవచ్చు.