ఐస్ చెమర్చాయి! | Aishwarya Rai Bachchan performs crucial scene for 'Sarbjit' without cuts | Sakshi
Sakshi News home page

ఐస్ చెమర్చాయి!

Published Sun, Jan 24 2016 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

ఐస్ చెమర్చాయి!

ఐస్ చెమర్చాయి!

 ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కేవలం ‘అందాల తార’గా మాత్రమే మిగిలిపోకుండా మంచి నటి అని కూడా నిరూపించుకున్నారు. ఇద్దరు, జీన్స్, హమ్ దిల్ దే చుకే సనమ్, తాళ్,  దేవదాస్, గురు, జోథా అక్బర్, రోబో.. ఇలా ఐష్ అద్భుత అభినయానికి ఆమె చేసిన చిత్రాలను ఎన్నింటినో చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ప్రస్తుతం సరబ్ జిత్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో ఐశ్వర్యా రాయ్ చేస్తున్న దల్బీర్ కౌర్ పాత్ర మరో ఎత్తు అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 
 పంజాబీ రైతు సరబ్‌జిత్ సింగ్ పొరపాటున పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్లడం, గూఢచారి అనే అనుమానంతో పాక్ ప్రభుత్వం అతన్ని జైలులో పెట్టిన విషయం తెలిసిందే. తన తమ్ముడు నిర్దోషి అని నిరూపించి, ఎలాగైనా చెరసాల నుంచి విడిపించాలని తపన పడ్డారు సరబ్ జిత్ సోదరి దల్బీర్ కౌర్. కానీ, 23 ఏళ్లు జైలులో మగ్గి, చివరికి జైలులో తోటి ఖైదీలు దాడి చేయడంతో చనిపోయారు సరబ్‌జిత్. అతని సోదరి పాత్రనే ఐశ్వర్యా రాయ్ చేస్తున్నారు.
 
 తమ్ముడి విడుదల కోసం దల్బీర్ చేసిన పోరాటం, పడిన ఆవేదనలను రీల్‌పై ఐష్ ఆవిష్కరించనున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఐష్ ఉపన్యాసం ఇచ్చే సీన్ తీశారు. కన్నీటి పర్యంతమవుతూ ఐష్ ఆ ఉపన్యాసం ఇస్తారు. ఒకే టేక్‌లో ఈ సీన్ చేసేశారట. ఐష్ నటిస్తున్నప్పుడు అందరి కళ్లూ చెమర్చాయట. ఎవరికి వాళ్లు నిలబడి చప్పట్లతో ఐష్‌ని అభినందించారని సమాచారం. దీన్నిబట్టి ఈ అందాల తార ఎంత సహజంగా ఆ సీన్ పండించి ఉంటారో ఊహించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement