Sarabjit Singh
-
‘ఇది న్యాయం కాదు’.. అమీర్ సర్ఫరాజ్ హత్యపై స్పందించిన సరబ్జిత్ కుమార్తె
భారత్‌కు చెందిన సరబ్జిత్ సింగ్‌ను జైలులో హత్యచేసిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సర్ఫరాజ్‌ను కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని హత్యచేసిన అమీర్ మృతిపై సరబ్జిత్ కుమార్తె స్వపన్‌దీప్ కౌర్ స్పందించారు. ‘ఒక రకంగా సంతృప్తికి కలిగినా.. ఇది న్యాయం కాదు అని భావిస్తున్నా. నా తండ్రి ఎలా హత్య చేయబడ్డారో నిర్ధారణ చేసుకోవడానికి విచారణ జరగాలని కోరుకోన్నాం. నా తండ్రి హత్యలో ముగ్గురు లేదంటే నలుగు వ్యక్తుల ప్రమేయం ఉంది. అయితే ఒక్క అమీర్‌ను హతమార్చి పాక్ ప్రభుత్వం తన తండ్రి హత్యకు జరిగిన కుట్రను కప్పిపుచ్చాలని చూస్తోంది. సరబ్జిత్, అమీర్ హత్యల వెనక పాక్ ప్రభుత్వ హస్తం ఉంది’ అని స్వపన్‌దీప్ కౌర్ తెలిపారు. అమీర్ సర్ఫరాజ్ హత్యపై సరబ్జిత్ సింగ్ బయోపిక్‌లో ప్రధాన ప్రాతలో నటించిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా స్పందించారు. ‘కర్మ అంటే ఇదే.. అమీర్ సర్ఫరాజ్‌ను అంతం చేసిన గుర్తు తెలియని వ్యక్తులకు ధన్యవాదాలు. ఇప్పడు సరబ్జిత్ సింగ్ హత్య విషయంలో కొంత న్యాయం జరిగినట్ల అనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ సింగ్, స్వపన్‌దీప్ కౌర్, పూనమ్లకు నా ప్రేమను తెలియజేస్తున్నా’ అని రన్‌దీప్ హుడా ఎక్స్(ట్వీటర్) వేదికగా తెలిపారు. KARMA Thank you ‘Unknown Men’ 🙏💪 Remembering my Sister Dalbir Kaur and sending love to Swapandeep and Poonam , today some justice to Martyr Sarabjit Singh has been served 🙏 https://t.co/CSn9WmevDv — Randeep Hooda (@RandeepHooda) April 14, 2024 సరబ్జిత్ సింగ్ 1991 పొరపాటుగా సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేవశించారు. 1990లో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌తో జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది పాకిస్థానీయలు మరణించారు. ఆ కేసులో గూఢచర్యం ఆరోపణలతో సరబ్జిత్ను పాకిస్థాన్ అరెస్ట్ చేసి.. ఆయనకు మరణ శిక్ష విధించింది. లాహోర్‌లోని కోట లఖపత్ జైలులో సబర్‌జిత్ సింగ్ శిక్షఅనుభివిస్తున్న సమయంలో సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు ఆయనపై దాడి చేశారు. మెదడుకు తీవ్రగాయాలతో సరబ్జిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జైల్లో సరబ్జిత్ సింగ్‌పై దాడి చేసినందుకు అమీర్ సహా పలువురుపై కేసు నమోదైంది. అయితే.. సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవటంతో 2018లో పాకిస్తాన్ కోర్టు అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది. -
భారతీయుడిని చంపిన పాకిస్తాన్ డాన్ హత్య
ఇస్లామాబాద్ : భారత్‌కు చెందిన సరబ్జిత్ సింగ్‌ను జైలులో చంపిన పాకిస్తాన్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అమీర్ సర్ఫరాజ్‌ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. సరబ్జీత్ సింగ్ ఎవరు? సరబ్జీత్ సింగ్ భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని భిఖివిండ్ గ్రామానికి చెందిన రైతు. 1991లో పొరపాటుగా సరిహద్దును దాటి పాక్‌లోకి ప్రవేశించారు. దీంతో గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసిన పాకిస్థాన్.. ఆయనకు మరణశిక్ష విధించింది. సరబ్జీత్ సింగ్‌పై దాడి చేసిన పాక్ డాన్ అనంతరం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో సరబ్జీత్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, 2013లో భారత్‌లో పార్లమెంట్ దాడికి పాల్పడిన అప్జల్ గురుని ఉరితీసిన కొన్ని రోజుల తర్వాత లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్న పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు సరబ్జీత్పై దారుణంగా దాడి చేశారు. ఖైదీలు ఇటుకలతో సరబ్జీత్పై దాడి చేయడంతో అతని మెదడులో తీవ్రగాయాలై, చికిత్స పొందుతూ జిన్నా ఆస్పత్రిలో మరణించారు. కాగా, సరబ్జీత్ 23 ఏళ్లు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు శిక్షను అనుభవించారు. దల్బీర్ కౌర్ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం సరబ్జీత్ సింగ్ నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆతని సోదరి దల్బీర్‌కౌర్ సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటారని.. ఆయనను విడుదల చేయాలంటూ దల్బీర్ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. సరబ్‌జీత్‌ను చూసేందుకు పాకిస్థాన్ సైతం వెళ్లివచ్చారు. దల్బీర్‌కౌర్ గత ఏడాది ఛాతీ నొప్పితో పంజాబ్ అమృత్‌సర్‌కు చెందన ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ‘సరబ్జీత్’ పేరుతో బయోపిక్ సరబ్జీత్ సింగ్, దల్బీర్‌కౌర్ జీవితాల ఆధారంగా బాలీవుడ్లో ‘సరబ్జీత్’ బయోపిక్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ దల్బీర్ పాత్రలో నటించారు. -
రోడ్డు ప్రమాదంలో సరబ్జిత్ సింగ్ భార్య కన్నుమూత
ఛండీగఢ్: ఉగ్రవాద ఆరోపణలతో ఏళ్లతరబడి పాక్ జైల్లో మగ్గి.. తోటి ఖైదీల చేతిలో ప్రాణాలు వదిలిన భారతీయుడు సరబ్జిత్ సింగ్ గుర్తున్నారా?.. ఆయన భార్య సుఖ్‌ప్రీత్ కౌర్ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. టూవీలర్‌పై వెళ్తున్న సమయంలో.. ఫతేహ్పూర్ వద్ద వెనకాల కూర్చున్న సుఖ్‌ప్రీత్ కౌర్ కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఇవాళ(మంగళవారం) తర్న్ తరన్‌లోని ఆమె స్వస్థలం భిఖివిండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలాఉంటే.. సరబ్జిత్ సింగ్-సుఖ్‌ప్రీత్ కౌర్‌లకు ఇద్దరు సంతానం. జూన్‌లో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్ ఛాతీ నొప్పితో కన్నుమూశారు. సరబ్జిత్ విడుదల కోసం దల్బీర్ కౌర్, సుఖ్‌ప్రీత్ చేసిన పోరాటం.. స్థిరస్థాయిగా గుర్తుండిపోయింది కూడా. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో పట్టుబడ్డ సరబ్జిత్ సింగ్‌కు పాక్ కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే.. ఆ శిక్షను పలుకారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు 2013, ఏప్రిల్‌లో తోటి ఖైదీల చేతిలో లాహోర్ జైల్లో దాడికి గురై.. కన్నుమూశారు. మరణాంతరం ఆయన మృతదేహాన్ని అమృత్‌సర్‌కు తీసుకొచ్చి.. అంత్యక్రియలు నిర్వహించారు. ఇదీ చదవండి: పశువుల పాలిట ప్రాణాంతకం ‘లంపీ’పై ప్రధాని స్పందన -
Dalbir Kaur: సరబ్జిత్ సింగ్ సోదరి మృతి
అమృత్సర్: పాకిస్తాన్ జైల్లో సహచర ఖైదీలు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీ యుడు సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్ను మూశారు. గుండెపోటు వచ్చిన ఆమె ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సరబ్జిత్ సింగ్‌పై తప్పుడు నిందలు మోపి పాకిస్తాన్ 1991లో అదుపులోకి తీసుకుంది. అప్పట్నుంచి ఆమె తన తమ్ముడి విడుదల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. అప్పట్లోనే ఆమె దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచారు. చివరికి 2013లో సరబ్జిత్ పాక్ జైల్లో ప్రాణాలు కోల్పోయారు. సరబ్జిత్ సింగ్.. దల్బీర్ కౌర్ పోరాటం ఇతివృత్తం ఆధారంగానే 2016లో ఒమంగ్ కుమార్ డైరెక్షన్లో ఐశ్వర్యరాయ్-రణ్‌దీప్ హుడా ‘సరబ్జిత్’ సినిమా వచ్చింది. -
బీజేపీలో చేరిన 'సరబ్జిత్' సోదరి
ఫజీకా(పంజాబ్): పాకిస్థాన్ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ ఆదివారం బీజేపీలో చేరారు. వీరి జీవితకథ ఆధారంగా నిర్మించిన బయోపిక్ 'సరబ్జిత్'. రణ్‌దీప్ హుడా సరబ్జిత్గా, ఐశ్యర్యరాయ్ ఆయన సోదరిగా ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సోదరుడి కోసం దల్బీర్ కౌర్ రెండు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం చేశారు. తమ్ముడి విముక్తి కోసం పదివేల కిలోమీటర్ల ప్రయాణించారు. వేలాది కొవ్వొత్తుల ప్రదర్శనలు, వందలాది ర్యాలీలు నిర్వహించారు. తమ్ముడికి విముక్తి కల్పించడం కోసం ఇరు దేశాల మధ్య 170 మంది రాజకీయ నేతలను ఆమె కలుసుకున్నారు. దల్బీర్ కౌర్‌ది అమృత్ సర్‌కు సమీపంలోని భికివిండ్ అనే కుగ్రామం. తమ్ముడు సరబ్జిత్ పొరపాటున దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. తాము వెతుకుతున్న మరెవరో భారత గూఢచారి అనుకొని 1990, ఆగస్టు 28వ తేదీన సరబ్‌ను పాకిస్తాన్ సైనికులు అరెస్టు చేశారు. గూఢచర్యం అభియోగాలపై కేసును విచారించిన పాక్ కోర్టు 1991లో ఉరిశిక్ష విధించి జైల్లో నిర్బంధించింది. తమ్ముడి జాడ కోసం వెతుకుతున్న దల్బీర్ కౌర్‌కు ఈ విషయం తెల్సింది. అప్పటి నుంచి ఆమె తమ్ముడి విడుదల కోసం భారత అధికారుల మీద ఒత్తిడి తీసుకరావడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రధాన మంత్రుల వరకు ఆమె ఎవరిని వదిలి పెట్టలేదు. ఎవరు అనుమతి ఇచ్చినా లేకపోయినా గేట్లు దూసుకుపోయారు. 1991లో ఆమె అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు దాదాపు వంద సార్లు ఫోన్ చేశారు. ఈ బెడద తట్టుకోలేక పీవీ ఆమెను పిలిపించారు. ‘చింతా మత్ కరో హమ్ తుమారే భాయ్ కో లే ఆయెంగే (బాధ పడకు మీ తమ్ముడిని మేము తీసుకొస్తాం)’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా కలుసుకున్నారు. మన్మోహన్ సిఫారసుపై అప్పటి పాక్ అధినేత ముషార్రఫ్‌ను కులుసుకున్నారు. అప్పటికీ సరబ్జిత్కు ఉరిశిక్షను అమలు చేయకపోవడంతో ఉరిశిక్షను నిలిపివేయిస్తానంటూ ముషార్రఫ్ హామీ ఇచ్చారు. మాజీ క్రికెటర్ నవజోతి సింగ్ సిద్ధూను కూడా ఆమె కలుసుకున్నారు. తమ్ముడి కోసం పోరాటం జరపుతున్న ఇలాంటి అక్కను తానెన్నడూ చూడలేదని ఆ సందర్భంగా సిద్ధు వ్యాఖ్యానించారు. లాహోర్‌లోని కోట్ లోక్పత్ జైల్లో ఉన్న సరబ్జిత్ను కలుసుకునేందుకు 2011లో దల్బీర్ కౌర్‌కు అవకాశం దొరికింది. ఈ సందర్భంగా ఆమె తమ్ముడికి రాఖీ కట్టి ఎలాగైనా ‘నిన్ను విడిపించుకుంటానురా తుమ్ముడూ!’ అంటూ శపథం చేశారు. ఆ సందర్భంగా తమ్ముడి కళ్ల నుంచి పెళ్లుబికిన కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయానని ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇటు భారత్ నేతలు, అటు పాక్ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినా సరబ్జిత్ విడుదల కాలేదు. 2013, ఏప్రిల్ 26వ తేదీన సరబ్జిత్ను తోటి ఖైదీలు చంపేశారు. సరబ్జిత్ను విడుదల చేస్తే ఓ అమాయకుడిని అన్యాయంగా అరెస్టుచేసి శిక్ష విధించారనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందనే ఉద్దేశంతో పాక్ సైనిక శక్తులే సరబ్జిత్ హత్యకు కుట్రపన్నాయనే విమర్శలు వచ్చాయి. సరబ్‌కు సజీవంగా స్వాగతం చెబుతామని సొంతూరులో నిరీక్షిస్తున్న దల్బీర్ కౌర్ ఇంటికి తమ్ముడి శవం చేరింది. తమ్ముడికి ఘనంగా దహన సంస్కారాలు చేసిన దల్బీర్ కళ్లల్లో నీళ్లింకిపోయినా పోరాట స్ఫూర్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. -
5 ఏళ్ల బాలిక కాలు కొరికిన బస్సు కండెక్టర్
లుథియానా: ఐదేళ్ల బాలిక కాలును ఓ స్కూల్ బస్సు కండెక్టర్ కొరికిన దిగ్భ్రాంతికరమైన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో లుథియానాలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిమ్లాపురికి చెందిన సర్బజిత్ సింగ్ (27) అనే వ్యక్తి శాస్త్రీ నగరలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో కండెక్టర్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్ బస్సులో బాలికను ఇంటివద్ద దింపే క్రమంలో ఆ స్కూల్ బస్సు కండెక్టర్ బాలిక కాలును కొరికేశాడు. బీఆర్ఎస్ నగర్లో నివాసముంటున్న తన ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో బాలిక తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు స్కూల్ యాజమాన్యం కండెక్టర్పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అనంతరం స్కూల్ యాజమాన్యం పోలీసులకు కూడా కండెక్టర్పై ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. స్కూల్‌కు చేరుకున్న పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. బస్సు కండెక్టర్ సర్బజిత్ సింగ్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు ఎస్బీఎస్ పోలీసులు తెలిపారు. నిందితుడు కండెక్టర్‌ను స్థానిక కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు. అనంతరం అతడ్ని జుడిషియల్ కస్టడీకి తరలించినట్టు చెప్పారు. నిందితుడు సర్భజిత్ సింగ్ ఏడవ తరగతి వరకు చదువుకున్నాడనీ, పెళ్లి ఇంకా కాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనతో స్కూల్ యాజమాన్యం కండెక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, బాలిక కాలును బస్సు కండెక్టర్ ఎందుకు కొరికాడో ఇప్పటివరకూ తెలియలేదు. -
పోరాట దీప్తి.. దల్బీర్ కౌర్
చండీగఢ్: దల్బీర్ కౌర్...ఆమె పేరు వినగానే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రెండు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం, తమ్ముడి విముక్తి కోసం సాగించిన పదివేల కిలోమీటర్ల ప్రయాణం గుర్తొస్తాయి. వేలాది కొవ్వొత్తుల ప్రదర్శనలు, వందలాది ర్యాలీలు కళ్ల ముందు మెదలుతాయి. ఇరు దేశాల మధ్య 170 మంది రాజకీయ నేతలను కలుసుకున్న సందర్భాలు స్మృతికొస్తాయి. దల్బీర్ కౌర్ తన తమ్ముడి కోసం 23 ఏళ్లపాటు సాగించిన పోరాటంలో ఆమె ఏనాడు అలసిపోలేదు. ప్రతి రోజూ నిత్య పోరాట స్ఫూర్తితోనే నిద్ర లేచారు. ఆ తర్వాత ప్రతి క్షణం తన తమ్ముడిని కలుసుకోవాలని, విడదల కోసం కృషి చేయాలని ఆరాటపడ్డారు. తన తమ్ముడు ఏ జైలులో ఉన్నాడో తెలుసుకోవడంతోపాటు భారత్ పాస్‌పోర్ట్, పాక్ వీసా సాధించడం, జైల్లో తమ్ముడిని కలుసుకోవడం వరకు ఏనాడు నిరాశా నిస్పృహలకు గురికాలేదు. కడుపులో పుట్టిన కన్న బిడ్డకన్నా కడుపు పంచుకొని పుట్టిన తమ్ముడు సరబ్జిత్ కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. దల్బీర్ కౌర్‌ది అమృత్‌సర్‌కు సమీపంలోని భికివిండ్ అనే కుగ్రామం. తమ్ముడు సరబ్జిత్ పొరపాటున దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. తాము వెతుకుతున్న మరెవరో భారత గూఢచారి అనుకొని 1990, ఆగస్టు 28వ తేదీన సరబ్‌ను పాకిస్తాన్ సైనికులు అరెస్టు చేశారు. గూఢచర్యం అభియోగాలపై కేసును విచారించిన పాక్ కోర్టు 1991లో ఉరిశిక్ష విధించి జైల్లో నిర్బంధించింది. తమ్ముడి జాడ కోసం వెతుకుతున్న దల్బీర్ కౌర్‌కు ఈ విషయం తెల్సింది. అప్పటి నుంచి ఆమె తమ్ముడి విడుదల కోసం భారత అధికారుల మీద ఒత్తిడి తీసుకరావడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రధాన మంత్రుల వరకు ఆమె ఎవరిని వదిలి పెట్టలేదు. ఎవరు అనుమతి ఇచ్చినా లేకపోయినా గేట్లు దూసుకుపోయారు. 1991లో ఆమె అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు దాదాపు వంద సార్లు ఫోన్ చేశారు. ఈ బెడద తట్టుకోలేక పీవీ ఆమెను పిలిపించారు. ‘చింతా మత్ కరో హమ్ తుమారే భాయ్ కో లే ఆయెంగే (బాధ పడకు మీ తమ్ముడిని మేము తీసుకొస్తాం)’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా కలుసుకున్నారు. మన్మోహన్ సిఫారసుపై అప్పటి పాక్ అధినేత ముషార్రఫ్‌ను కులుసుకున్నారు. అప్పటికీ సరబ్జిత్కు ఉరిశిక్షను అమలు చేయకపోవడంతో ఉరిశిక్షను నిలిపివేయిస్తానంటూ ముషార్రఫ్ హామీ ఇచ్చారు. మాజీ క్రికెటర్ నవజోతి సింగ్ సిద్ధూను కూడా ఆమె కలుసుకున్నారు. తమ్ముడి కోసం పోరాటం జరపుతున్న ఇలాంటి అక్కను తానెన్నడూ చూడలేదని ఆ సందర్భంగా సిద్ధు వ్యాఖ్యానించారు. లాహోర్‌లోని కోట్ లోక్పత్ జైల్లో ఉన్న సరబ్జిత్ను కలుసుకునేందుకు 2011లో దల్బీర్ కౌర్‌కు అవకాశం దొరికింది. ఈ సందర్భంగా ఆమె తమ్ముడికి రాఖీ కట్టి ఎలాగైనా ‘నిన్ను విడిపించుకుంటానురా తుమ్ముడూ!’ అంటూ శపథం చేశారు. ఆ సందర్భంగా తమ్ముడి కళ్ల నుంచి పెళ్లుబికిన కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయానని ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇటు భారత్ నేతలు, అటు పాక్ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినా సరబ్జిత్ విడుదల కాలేదు. 2013, ఏప్రిల్ 26వ తేదీన సరబ్జిత్ను తోటి ఖైదీలు చంపేశారు. సరబ్జిత్ను విడుదల చేస్తే ఓ అమాయకుడిని అన్యాయంగా అరెస్టుచేసి శిక్ష విధించారనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందనే ఉద్దేశంతో పాక్ సైనిక శక్తులే సరబ్జిత్ హత్యకు కుట్రపన్నాయనే విమర్శలు వచ్చాయి. సరబ్‌కు సజీవంగా స్వాగతం చెబుతామని సొంతూరులో నిరీక్షిస్తున్న దల్బీర్ కౌర్ ఇంటికి తమ్ముడి శవం చేరింది. తమ్ముడికి ఘనంగా దహన సంస్కారాలు చేసిన దల్బీర్ కళ్లల్లో నీళ్లింకిపోయినా పోరాట స్ఫూర్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. (దల్బీర్ కౌర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిర్మించిన బాలివుడ్ చిత్రమే ‘సరబ్జిత్’. దల్బీర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించిన ఈ చిత్రం మే 20వ తేదీన విడుదలవుతోంది.) -
ఐస్ చెమర్చాయి!
ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కేవలం ‘అందాల తార’గా మాత్రమే మిగిలిపోకుండా మంచి నటి అని కూడా నిరూపించుకున్నారు. ఇద్దరు, జీన్స్, హమ్ దిల్ దే చుకే సనమ్, తాళ్, దేవదాస్, గురు, జోథా అక్బర్, రోబో.. ఇలా ఐష్ అద్భుత అభినయానికి ఆమె చేసిన చిత్రాలను ఎన్నింటినో చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ప్రస్తుతం సరబ్ జిత్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో ఐశ్వర్యా రాయ్ చేస్తున్న దల్బీర్ కౌర్ పాత్ర మరో ఎత్తు అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పంజాబీ రైతు సరబ్జిత్ సింగ్ పొరపాటున పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్లడం, గూఢచారి అనే అనుమానంతో పాక్ ప్రభుత్వం అతన్ని జైలులో పెట్టిన విషయం తెలిసిందే. తన తమ్ముడు నిర్దోషి అని నిరూపించి, ఎలాగైనా చెరసాల నుంచి విడిపించాలని తపన పడ్డారు సరబ్ జిత్ సోదరి దల్బీర్ కౌర్. కానీ, 23 ఏళ్లు జైలులో మగ్గి, చివరికి జైలులో తోటి ఖైదీలు దాడి చేయడంతో చనిపోయారు సరబ్జిత్. అతని సోదరి పాత్రనే ఐశ్వర్యా రాయ్ చేస్తున్నారు. తమ్ముడి విడుదల కోసం దల్బీర్ చేసిన పోరాటం, పడిన ఆవేదనలను రీల్‌పై ఐష్ ఆవిష్కరించనున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఐష్ ఉపన్యాసం ఇచ్చే సీన్ తీశారు. కన్నీటి పర్యంతమవుతూ ఐష్ ఆ ఉపన్యాసం ఇస్తారు. ఒకే టేక్‌లో ఈ సీన్ చేసేశారట. ఐష్ నటిస్తున్నప్పుడు అందరి కళ్లూ చెమర్చాయట. ఎవరికి వాళ్లు నిలబడి చప్పట్లతో ఐష్‌ని అభినందించారని సమాచారం. దీన్నిబట్టి ఈ అందాల తార ఎంత సహజంగా ఆ సీన్ పండించి ఉంటారో ఊహించుకోవచ్చు. -
వృద్ధురాలిగా..!
‘జజ్బా’లో కిడ్నాప్‌కు గురైన ఓ బాలిక తల్లిగా నటిస్తున్నారు ఐశ్వర్యారాయ్. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు చేయాలని అనుకుంటున్నారేమో. ఈ చిత్రం చేస్తుండగానే, మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారామె. ఇందులో ఐష్ 61 ఏళ్ల వృద్ధురాలిగా నటించనున్నారు. నిజజీవిత కథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మద్యం మత్తులో ఇండో- పాక్ సరిహద్దు దాటి పాక్ సైనికుల చేతిలో చిక్కుకుని, ఆ తర్వాత జైలులో తోటి ఖైదీల చేతిలో హతమైన సరబ్జీత్ సింగ్ గుర్తున్నాడు కదా! ఆయన జీవితం ఆధారంగానే ఈ సినిమా రానుంది. ఇందులో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్ పాత్రలోనే ఐశ్వర్వ నటించనున్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న ఐష్ ఆరు పదుల వయసులో ఉన్న వృద్ధురాలిగా ఒదిగిపోవడానికి ఎంతైనా కష్టపడాలను కుంటున్నారట. ఇంకా సరబ్జిత్ సింగ్ పాత్రకు ఎవర్నీ ఎంపిక చేయలేదు. -
'సరబ్ జిత్'లో అమితాబ్ నటించడం లేదు: సుభాష్ ఘయ్
పాకిస్థానీ జైల్లో మరణించి భారతీయ ఖైదీ సరబ్జిత్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో బిగ్ బీ అమితాబ్ నటించడం లేదని ఆ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయి వెల్లడించారు. ఆ చిత్రంలో పాకిస్థానీ న్యాయవాది పాత్ర పోషించాలని అమితాబ్‌ని కలసి కోరానని ఆయన తెలిపారు. అయితే ఆయన సినిమాల్లో నటిస్తు మహా బీజిగా ఉన్నానని చెప్పారని పేర్కొన్నారు. అదికాక ఓ చిత్రంలో న్యాయవాద పాత్ర పోషించేందుకు ఇప్పటికే ఒప్పకున్నట్లు కూడా ఆయన వివరించారని మంగళవారం ముంబైలో తెలిపారు. ఆ మహానటుడితో కలసి పనిచేయాలని తన ఆశపడుతున్నట్లు చెప్పారు. ఆ పాత్ర కోసం మరోకరిని ఎంపిక చేసేందుకు నటుడి అన్వేషణ ప్రారంభించినట్లు వివరించారు. సరబ్జిత్ చిత్రానికి ఈశ్వర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. అలాగే అనురాగ్ సిన్హా, సోనాక్షి సిన్హాలు నటిస్తున్నారని సుభాష్ ఘాయి వెల్లడించారు. పాకిస్థానీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు భారతీయుడు సరబ్ జిత్ పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దాంతో ఆ దేశ దళాలు సరబ్ జిత్త్ ను అరెస్ట్ చేశారు. పాక్ లో పేలిన బాంబు ఘటనకు సరబ్ తో సంబంధం ఉందని ఆ దేశం ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో శిక్ష అనుభవిస్తూ... తోటి ఖైదీల దాడిలో గాయపడి మరణించిన సంగతి తెలిసిందే.