భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌ను జైలులో హత్యచేసిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సర్ఫరాజ్‌ను కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని హత్యచేసిన అమీర్ మృతిపై సరబ్‌జిత్ కుమార్తె స్వపన్‌దీప్ కౌర్ స్పందించారు.
‘ఒక రకంగా సంతృప్తికి కలిగినా.. ఇది న్యాయం కాదు అని భావిస్తున్నా. నా తండ్రి ఎలా హత్య చేయబడ్డారో నిర్ధారణ చేసుకోవడానికి విచారణ జరగాలని కోరుకోన్నాం. నా తండ్రి హత్యలో ముగ్గురు లేదంటే నలుగు వ్యక్తుల ప్రమేయం ఉంది. అయితే ఒక్క అమీర్‌ను హతమార్చి పాక్ ప్రభుత్వం తన తండ్రి హత్యకు జరిగిన కుట్రను కప్పిపుచ్చాలని చూస్తోంది. సరబ్‌జిత్, అమీర్ హత్యల వెనక పాక్ ప్రభుత్వ హస్తం ఉంది’ అని స్వపన్‌దీప్ కౌర్ తెలిపారు.
అమీర్ సర్ఫరాజ్ హత్యపై సరబ్‌జిత్ సింగ్ బయోపిక్‌లో ప్రధాన ప్రాతలో నటించిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా స్పందించారు. ‘కర్మ అంటే ఇదే.. అమీర్ సర్ఫరాజ్‌ను అంతం చేసిన గుర్తు తెలియని వ్యక్తులకు ధన్యవాదాలు. ఇప్పడు సరబ్‌జిత్ సింగ్ హత్య విషయంలో కొంత న్యాయం జరిగినట్ల అనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడిన సరబ్‌జిత్ సింగ్ సోదరి దల్బీర్ సింగ్, స్వపన్‌దీప్ కౌర్, పూనమ్‌లకు నా ప్రేమను తెలియజేస్తున్నా’ అని రన్‌దీప్ హుడా ఎక్స్(ట్వీటర్) వేదికగా తెలిపారు.
KARMA
— Randeep Hooda (@RandeepHooda) April 14, 2024
Thank you ‘Unknown Men’ 🙏💪
Remembering my Sister Dalbir Kaur and sending love to Swapandeep and Poonam , today some justice to Martyr Sarabjit Singh has been served 🙏 https://t.co/CSn9WmevDv
సరబ్‌జిత్ సింగ్ 1991 పొరపాటుగా సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేవశించారు. 1990లో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌తో జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది పాకిస్థానీయలు మరణించారు. ఆ కేసులో గూఢచర్యం ఆరోపణలతో సరబ్‌జిత్‌ను పాకిస్థాన్ అరెస్ట్ చేసి.. ఆయనకు మరణ శిక్ష విధించింది. లాహోర్‌లోని కోట లఖపత్ జైలులో సబర్‌జిత్ సింగ్ శిక్షఅనుభివిస్తున్న సమయంలో సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు ఆయనపై దాడి చేశారు. మెదడుకు తీవ్రగాయాలతో సరబ్‌జిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జైల్లో సరబ్‌జిత్ సింగ్‌పై దాడి చేసినందుకు అమీర్ సహా పలువురుపై కేసు నమోదైంది. అయితే.. సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవటంతో 2018లో పాకిస్తాన్ కోర్టు అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment