పరారైన భారతీయ ఖైదీని అరెస్ట్ చేసిన పాక్ | Escaped Indian prisoner re-arrested in Pakistan | Sakshi
Sakshi News home page

పరారైన భారతీయ ఖైదీని అరెస్ట్ చేసిన పాక్

Published Tue, Dec 17 2013 1:26 PM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

Escaped Indian prisoner re-arrested in Pakistan

పాకిస్థానీ జైలు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో పరారైన భారతీయ ఖైదీ కిషోర్ భగవాన్ బాయిని తిరిగి అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. కరాచీలోని పిబీఐ కాలనీలో కిషోర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు స్థానిక జియో న్యూస్ వెల్లడించింది. చేపల వేటలో భారతీయ మత్స్యకారుడు పాకిస్థానీ ప్రాదేశిక జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించారు. ఈ నేపథ్యంలో కొంత మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కరాచీలోని లోది జైలు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రత సిబ్బంది కళ్లు కప్పి కిషోర్ భగవాన్ పరారైయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement