
2015 మార్చి 24వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న యజమాని భార్య (26)పై అత్యాచార యత్నానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
కర్నూలు (లీగల్)/బనగానపల్లె రూరల్: ఇంటి యజమానికి నమ్మకస్తుడిగా ఉంటూ అతని భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి కర్నూలు ఏడవ అదనపు జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. బనగానపల్లె మండలం నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని టంగుటూరు గ్రామంలో శివనాగిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. తన ట్రాక్టర్‌కు బందెల పెద్దయ్య అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేసేవాడు. 2015 మార్చి 24వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న యజమాని భార్య (26)పై అత్యాచార యత్నానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
చదవండి: ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్..
బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లోనే బందెల పెద్దయ్యపై నందివర్గం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5,500 లు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎస్.చినబాబు సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.నరేంద్రనాథ్ రెడ్డి వాదనలు వినిపించారు.