న్యూయార్క్: అత్యాచారం కేసులో చేయని నేరానికి నేరస్తుడిగా 16 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తికి ఉపశమనం లభించింది. 1982లో ప్రముఖ రచయిత అలిస్ సెబోల్డ్‌పై అత్యాచారం జరిగింది. అయితే ఆమె సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ఉన్నప్పుడు ఆంథోని బ్రాడ్‌వాటర్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ‘లక్కీ’ అనే పుస్తకంలో రాసింది. అయితే తాగాజా 1982 సమయంలో ఈ కేసు సంబంధించిన విచారణలో తీవ్రమైన లోపాలు చోటు చేసుకున్నాయని ఆంథోని బ్రాడ్‌వాటర్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది.
ఒనోండగా కౌంటీ జిల్లా అటార్నీ విలియం ఫిట్జ్‌పాట్రిక్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోర్డాన్ కఫీ ఈ కేసుపై విచారణ చేపట్టి.. నేరారోపణతో జైలు శిక్ష అనుభవిస్తున్న బ్రాడ్‌వాటర్ అప్పటి కోర్టు ప్రాసిక్యూషన్‌లో అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ సమయంలో 61 ఏళ్ల ఆంథోని బ్రాడ్‌వాటర్ కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం బ్రాడ్‌వాటర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను గత రెండు రోజులుగా ఆనందంగా ఉపశమనంతో ఉన్నానని తెలిపారు. ఈ కేసును తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.
1981లో తనపై అత్యాచారం జరిగిందని, కొన్ని నెలలకు అత్యాచారం జగిగిన వీధిలో ఓ నల్లజాతి వ్యక్తి అయిన బ్రాడ్‌వాటర్ కనిపించడంతో.. అతనే తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపిస్తూ అలిస్ సెబోల్డ్ తన పుస్తకం ‘లక్కీ’లో రాసింది. తర్వాత బ్రాడ్‌వాటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 16 ఏళ్ల పాటు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించిన బ్రాడ్‌వాటర్‌పై నేరారోపణలు రుజువు కాలేదు. ఆయనపై ఉన్న అత్యాచారం కేసును కోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment