సింగపూర్ హోటల్లో 'ఆ ఇద్దరి' మృతదేహలు | Indian national found dead in a Singapore hotel | Sakshi
Sakshi News home page

సింగపూర్ హోటల్లో 'ఆ ఇద్దరి' మృతదేహలు

Published Tue, Feb 3 2015 9:06 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

సింగపూర్ హోటల్లో 'ఆ ఇద్దరి' మృతదేహలు - Sakshi

సింగపూర్ హోటల్లో 'ఆ ఇద్దరి' మృతదేహలు

సింగపూర్: ఇద్దరు భార్యభర్తలు కాదు.. పోని ఒకే దేశం వాళ్లు కూడా కాదు..  ఏమైందో ఏమో కానీ ఓ 31 ఏళ్ల ఎన్నారై యువకుడు ... 29 ఏళ్ల ఇండోనేసియా యువతి హోటల్ గదిలో విగత జీవులగా పడి ఉన్నారు. ఆ విషయం హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన సింగపూర్లోని గెలాంగ్ లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అవివాహితుడైన ఎన్నారై చిన్నస్వామి భాస్కర్ స్థానిక నిర్మాణ సంస్థలో గత అయిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు.  అలాగే మృతురాలు రులీ విద్యావతి వంటమనిషిగా పని చేస్తోందని వెల్లడించారు.

ఆమెకు వివాహమైందని ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారని తెలిపారు. మృతదేహలకు పోస్ట్మార్టం పూర్తి అయిందని భాస్కర్ మృతదేహన్ని స్వదేశం పంపేందుకు సింగపూర్లోని భారత రాయబార కార్యాలయం సన్నాహలు చేస్తోందన్నారు. అలాగే విద్యావతి మృతదేహాన్ని సోలోలోని ఆమె నివాసానికి పంపేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. విచారణ కూడా పూర్తి అయిందన్నారు. ఇద్దరిది సహజ మరణాలు కావని సింగపూర్ పోలీసులు స్పష్టం చేశారు. వారాంతపు సెలవులు నేపథ్యంలో సింగపూర్లోని గెలాంగ్ ప్రాంతమంతా విదేశీయులతో కిటకిటలాడుతోందన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement