భార్య పక్కన ఉండగానే.. ప్రయాణికురాలితో | Indian Techie Molstatated Sleeping Woman Beside Him Sentenced Life | Sakshi
Sakshi News home page

భార్య పక్కన ఉండగానే.. ప్రయాణికురాలితో

Published Sat, Aug 18 2018 9:31 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

Indian Techie Molstatated Sleeping Woman Beside Him Sentenced Life - Sakshi

విమానంలో మహిళను వేధింపులకు గురిచేసిన ఐటీ ఉద్యోగి ప్రభు రమణమూర్తి

వాషింగ్టన్‌ : భార్య పక్కన ఉండగానే మరో ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ భారతీయ ఐటీ సంస్థ మేనేజర్‌కు అమెరికాలోని డెట్రాయిట్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధించనున్నట్లు సమాచారం. ఏడు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు.. రోచెస్టర్‌ హిల్స్‌ సిటీలో ఉంటున్న ప్రభు రమణమూర్తి రెండేళ్ల నుంచి అమెరికాలోని ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్‌ వెళ్లే స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కాడు. ఆ ప్రయాణంలో రమణమూర్తికి ఓవైపు భార్య... మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు.

ఈ విషయం గురించి బాధితురాలు ‘‘నిద్ర పోతున్న నాకు శరీరం మీద ఏదో పాకుతున్నట్లు అనిపించింది. లేచి చూసేసరికి రమణమూర్తి నా ప్రైవేట్‌ శరీర భాగాలను తడుముతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాను’’ అని తెలిపింది. ఈ వ్యవహారంపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు. మొదట రమణమూర్తి ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ  దబాయించాడు. లోతుగా విచారించేసరికి నేరం అంగీకరించాడు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ న్యాయస్థానం  ఇటీవల అతడిని దోషిగా తేల్చింది. ఈ ఏడాది డిసెంబరు 12న అతనికి జీవిత ఖైదు విధించే వీలున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement