life time punish
-
మృగాళ్లకు 'ఉరి'
వృద్ధాప్యానికి చేరువలో ఉన్న మహిళ అనే కనికరంకూడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయాయి.పశువుల్లా మీదపడి తమవాంఛ తీర్చుకున్నారు. ఆపై అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. అంతటితో ఆగకుండాబంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఈ మృగాళ్లపై న్యాయదేవత కన్నెర్ర జేసింది. ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష విధించింది.వన్‌సైడ్ లవ్‌తో వెంబడించి వేధించినా ససేమిరా అనడంతో సైకోలా మారి యువతిని దారుణంగా హత్యచేసినయువకుడికి మరణదండన విధించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరునెల్వేలి జిల్లా అంబై సమీపం కల్లిడైకురిచ్చికి చెందిన తమిళ్‌సెల్వి (50) పనిమాత్తురై ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నర్సుగా పనిచేసేది. నర్సు కుమారుడు రాజేష్‌కన్నన్ కోయంబత్తూరులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. భర్త చెల్లస్వామి మరణించాడు. ఈ స్థితిలో ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన రాత్రి నర్సు ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఆరుగురు అగంతకులు లోనికి ప్రవేశించారు. పెద్దగా అరిచేందుకు ప్రయత్నించగా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత పదునైన వైరుతో గొంతుబిగించి హతమార్చారు. ఇంట్లో ఉన్న 25 గ్రాముల బంగారు నగలు దొంగలించుకుని పారిపోయారు. ఇంటి తలుపులు ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా నర్సు రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కార్తిక్ (21), మహేంద్రన్ (24), వసంతకుమార్ (30), రాజేష్ (27), గణేశన్ (51), చిన్నదురై (27)ను అరెస్ట్ చేశారు. డీఎన్ఏ పరిశోధనలో వసంతకుమార్, రాజేష్ అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణయ్యింది. ఈ కేసుపై బుధవారం తీర్పు వెలువడనుందని తెలియడంతో కోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. గట్టి బందోబస్తు నడుమ ఆరుగురు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులు వసంతకుమార్, రాజేష్‌కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇంద్రాణి బుధవారం సాయంత్రం తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగైన నర్సు ఇంట్లోకి జొరబడినందుకు యావజ్జీవం, హత్యచేసినందుకు ఉరిశిక్ష, అత్యాచారానికి పాల్పడినందుకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించారు. మిగిలిన నలుగురు నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టారు. ప్రేమ పెళ్లి వద్దన్నందుకు.. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపం జ్యోతినగర్‌కు చెందిన తంగదురై (32) అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆమె నిరాకరించింది. వీడవకుండా ఆమె వెంటపడుతూ వేధించ సాగాడు. యువతి తల్లిదండ్రులు పొల్లాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తంగదురైని స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించగా ఇకపై ఆమె వెంటపడను అంటూ హామీ పత్రం రాసివ్వడంతో విడిచిపెట్టారు. ఇదిలా ఉండగా 2014 నవంబర్ 13వ తేదీన తంగదురై సదరు యువతి ఇంట్లోకి జొరబడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడిచేశాడు. ఆగ్రహించి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి చంపాడు. అడ్డువచ్చిన ఆమె తల్లి, సోదరుడిని కత్తితో గాయపరిచాడు. హత్య, హత్యాయత్నం సెక్షన్ల కింద పొల్లాచ్చి పోలీసులు తంగదురైని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై కోయంబత్తూరు కోర్టు బుధవారం తీర్పుచెప్పింది. నిందితుడు తంగదురై ప్రాణాలు పోయే వరకు జైల్లోనే ఉండేలా యావజ్జీవ శిక్ష విధించింది. తల్లి, సోదరుడిపై దాడికి పాల్పడిన నేరానికి తలా ఏడేళ్ల జైలు, హద్దుమీరి ఇంట్లోకి ప్రవేశించినందుకు 10 ఏళ్ల జైలు, రూ.41వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పూర్ణజయ అనంద్ తీర్పు చెప్పారు. -
మనోహరన్‌కు రెండు ఉరి, యావజ్జీవ శిక్షలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడును కుదిపేసిన చిన్నారిపై హత్యాచారం, చిన్నారి తమ్ముడి దారుణ హత్య కేసులో సుప్రీంకోర్టు గురువారం సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది. నిందితుడు మనోహరన్‌కు మద్రాసు హైకోర్టు విధించిన రెండు ఉరిశిక్షలు, రెండు యావజ్జీవశిక్షలను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. వివరాలు.కోయంబత్తూరు రంగేగౌడర్వీధికి చెందిన రంజిత్ వస్త్రవ్యాపారి. ఇతని ముస్కరన్ (10) అనే కుమార్తె, రితిక్ (7) అనే కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ ఐదు, మూడవ తరగతి చదువుతున్నారు. 2010 అక్టోబర్ 29న అద్దెవ్యానులో వ్యాన్‌డ్రైవర్ మోహన్‌రాజ్ అలియాస్ మోహనకృష్ణన్ తన స్నేహితులైన మనోహరన్ సహకారంతో కిడ్నాప్‌చేసి పొల్లాచ్చి కొండప్రాంతానికి తీసుకెళ్లారు. చిన్నారి ముస్కరన్పై మోహన్‌రాజ్ అత్యాచారం చేశాడు. ఆ తరువాత స్నేహితులిద్దరూ కలిసి ఆ ఇద్దరు చిన్నారులను అక్కడి బీఏబీ వాగులోకి తోసివేసి హత్యచేశారు. ఈ జంట హత్యకేసులపై కోవై పోలీసులు కేసు నమోదు చేసి మోహన్‌రాజ్, మనోహరన్లను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితులిద్దరినీ అదే ఏడాది నవంబర్ 9న వ్యాన్‌లో తీసుకెళుతుండగా పెత్తనూరు సమీపంలో ఒక పోలీసుల చేతుల్లోని తుపాకీలను లాక్కుని పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపగా మోహన్‌రాజ్ హతమయ్యాడు. మనోహరన్ జరిపిన తుపాకీ కాల్పుల్లో ఎస్ఐలు ముత్తుమాలై, జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో మనోహరన్‌కు రెండు ఉరిశిక్షలు విధిస్తూ కోవై మహిళాకోర్టు 2012 అక్టోబరు 28న తీర్పు చెప్పింది. ఈ తీర్పును మద్రాసు హైకోర్టు 2014 మార్చి 24న నిర్ధారించింది. ఈ తీర్పుపై మనోహరన్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ఉరిశిక్షపై అదే ఏడాది స్టే ఇచ్చింది. ఈ స్టేపై తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ అప్పీలు పిటిషన్‌పై విచారణలు పూర్తిచేసిన సుప్రీంకోర్టు తీర్పు చెప్పకుండా గత నెల 11న వాయిదావేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసు గురువారం మరలా విచారణకు రాగా నిందితుడు మనోహరన్‌కు మద్రాసు హైకోర్టు విధించిన రెండు ఉరిశిక్షలు, మూడు యావజ్జీవ శిక్షలను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు తనకు పడిన ఉరిశిక్షపై రాష్ట్రపతికి కారుణ్య విజ్ఞప్తి లేఖను సమర్పించుకోవచ్చు. ఆ వినతిని రాష్ట్రపతి నిరాకరించిన పక్షంలో ఉరిశిక్ష అమల్లోకి వస్తుంది. -
చిన్నారిని చంపిన మహిళకు జీవిత ఖైదు
చందానగర్: ఏడాదిన్నర పసిపాపను హత్య చేసి నీటి తొట్టిలో వేసిన నిందితురాలికి ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే చందానగర్ వేమన వీకర్ సెక్షన్లో నివాసముండే బాల్‌రాజ్ రేణుక దంపతులకు ఏడాదిన్నర కూతురు జ్యోతిష ఉండేది. వారి ఇంటి పక్కనే రేణుక ఆడపడుచు రాజ్యలక్ష్మి (24) నివాసముంది. రాజ్యలక్ష్మికి 8 నెలల గర్భం ఉండగానే పాపపుట్టి చనిపోయింది. దీంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న జ్యోతిషను చూసి ఆమె ఈర్శను పెంచుకుంది. పథకం ప్రకారం 30 జూన్ 2015న మధ్యాహ్నం 12 గంటల సమయంలో జ్యోతిష తల్లి రేణుక స్నానం చేయడానికి బాత్ రూమ్‌కు వెళ్లింది. ఆ సమయంలో చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ ఉండడం చూసిన రాజ్యలక్ష్మి చిన్నారిని హత్య చేసి నీటి తొట్టిలో పడేసింది. తల్లి రేణుక స్నానం చేసి బయటకు వచ్చి చూసేసరికి చిన్నారి నీటి తొట్టిలో శవమై కనిపించింది. దీంతో రేణుక రాజ్యలక్ష్మిపై అనుమానంతో చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేసిన పోలీసులు సాక్ష్యదారాలను కోర్టును సమర్పించారు. దీంతో ఎల్బీనగర్ కోర్టు శుక్రవారం నిందితురాలు రాజ్యలక్ష్మికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. -
‘అనంత’ ఫ్యాక్షన్ ముగిసినట్లేనా..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’ ఫ్యాక్షన్‌తో రెండు తరాలు అంతమైనా ‘రక్తచరిత్ర’ మాత్రం ఆగలేదు. పరిటాల శ్రీరాములు హత్యతో ఆరంభమైన ఈ ఫ్యాక్షన్ 2011 జనవరి 3న జరిగిన మద్దెల చెరువు సూర్యనారాయణరెడ్డి(సూరీ) హత్యతోముగిసిందని ‘అనంత’ వాసులు భావించారు. కానీ సూరి హత్య జరిగిన రెండునెలల లోపే సూరి అనుచరుడు తగరకుంట కొండారెడ్డి హత్య జరిగింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ ‘అనంత’ ఫ్యాక్షన్ జడలు విప్పుకున్నట్లయింది. దీంతో పరిటాల ప్రత్యర్థులంతా అప్పట్లో వణికిపోయారు. ఆపై ‘అనంత’లో అక్కడక్కడా రాజకీయ హత్యలు జరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో సూరి హత్య కేసుకు సంబంధించి మంగళవారం తీర్పు వెలువడటంతో ఇక్కడి ఫ్యాక్షన్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. అసలు ఈ ఫ్యాక్షన్ ఎలా మొదలైంది? ఇప్పటికైనా ముగిసినట్లేనా? లేదంటే భవిష్యత్తులో మరిన్ని హత్యలు జరుగుతాయా? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ‘అనంత’ ఫ్యాక్షన్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆరంభం ఇలా... కొన్నేళ్ల కిందటి నుండి 1968 దాకా పరిటాల శ్రీరాములు, మద్దెలచెర్వు నారాయణరెడ్డి ఇద్దరూ స్నేహితులు. అయితే 1968లో జరిగిన ఓ సంఘటన ఇరు కుటుంబాల మధ్య చిచ్చును రేపింది. శుత్రుత్వాన్ని రగిల్చింది. అప్పట్లో పరిటాల శ్రీరాములు పీపుల్స్‌వార్‌లో చేరారు. దీంతో నారాయణ రెడ్డికి, పరిటాల కుటుంబానికి అభిప్రాయ భేదాలతో పాటు ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఈక్రమంలో 1975లో పరిటాల శ్రీరాములును ప్రత్యర్థులు నరికి చంపారు. ఇదే ‘అనంత’ ఫ్యాక్షన్‌లో తొలి హత్య. ఈ హత్యతో వారి రెండు కుటుంబాల ఆధిపత్యపోరు జిల్లా అంతటికి సోకింది. శ్రీరాములు హత్య తర్వాత నాలుగేళ్ల పాటు అంతర్గత విభేదాలు అణిగిఉన్నాయి. ఆ తర్వాత 1979లో శ్రీరాములు పెద్ద కుమారుడు పరిటాల హరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా 1983లో మాజీ ఎమ్మెల్యే మద్దెలచెర్వు నారాయణరెడ్డిని అనంతపురంలోని అన్నపూర్ణ లాడ్జి వద్ద పరిటాల శ్రీరాములు వర్గీయులు చంపేశారు. నారాయణరెడ్డిని వెంటాడి, వేటాడి కిరాతకంగా నరికి చంపిన సంఘటన నేటికీ జిల్లా వాసులు మరవలేదు. ఒక తరం అంతం... మలి తరం ఆరంభం పరిటాల శ్రీరాములు, పరిటాల హరి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి హత్యలతో ఒక తరం పెద్దలు బలయ్యారు. అప్పటికి నారాయణరెడ్డి కుమారులు సూర్యనారాయణరెడ్డి, రఘునాథరెడ్డిలు చిన్నపిల్లలు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి సమీప బంధువైన సానే చెన్నారెడ్డి అండగా నిలిచారు. 1989లో పెనుకొండ నియోజకవర్గం నుంచి సానే చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పరిటాల రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటల్లో కొండపల్లి సీతారామయ్య వర్గంలో దళసభ్యులుగా ఉన్న పోతుల సురేష్‌కు రవి పరిచయమయ్యారు. వీరితో చమన్ కలిశారు. పరిటాల రవి, పోతలు సురేశ్, చమన్ల త్రయం వీరి వైరీ వర్గీయులను హతమార్చేందుకు పథకం రచన చేశారు. దీంతో జిల్లాలో తిరిగి ఫ్యాక్షన్ జడలు విప్పుకుంది. ఈ క్రమంలో పెనుగొండ ఎమ్మెల్యే సానె చెన్నారెడ్డిని 1991 మే 7న ఆయన స్వగృహంలోనే కాల్చి చంపారు. దీంతో నరమేథం ఆరంభమైంది. చెన్నారెడ్డి వర్గీయులను వారు తుదముట్టించారు. ఈ క్రమంలోనే పరిటాల రవి వర్గం టీవీ బాంబు కుట్రపన్నింది. 1993 అక్టోబరు 24న, మద్దెలచెర్వు సూరి ఇంట్లో టీవీ బాంబును పెట్టి పేల్చివేసింది. ఈ ఘటనలో మద్దెలచెర్వు సూరి తల్లి సాకమ్మ, సోదరుడు రఘునాథరెడ్డి, సోదరి పద్మావతి, చంద్రశేఖర్(7), నారాయణప్పలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సానె చెన్నారెడ్డి కుమారులు ఓబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి కూడా శత్రువుల చేతిలో హతమయ్యారు. ఆర్వోసీతో ఊచకోత పీపుల్స్‌వార్ నుండి బయటకు వచ్చిన పోతుల సురేష్ రీఆర్గనైజింగ్ కమిటీ(ఆర్వోసీ)ను ప్రారంభించారు. ఆర్వోసీ అండతో పరిటాల రవి తన శత్రువర్గాన్ని ఊచకోత కోశారు. క్రమంలో సూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపై 1997 నవంబర్ 19న హైదరాబాదులో పరిటాల రవిని హత మార్చేందుకు కారు బాంబు ప్రయోగించారు. ఈ ఘటనలో పరిటాల రవి తృటిలో తప్పించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మద్దెలచెర్వు సూరి 13 ఏళ్లు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత 2005 జనవరి 24న జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట పరిటాల రవిని ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఆ తర్వాత రవి సతీమణి పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2005 నుండి ఎలాంటి గొడవలు లేకుండా జిల్లా ప్రశాంతంగా ఉంది. 2009 డిసెంబరు 29న జైలు నుండి విడుదలైన సూరీ కూడా తాను ఫ్యాక్షన్ చేసే స్థితిలో లేనని, ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నానని పదేపదే వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్వోసీ నేత పోతుల సురేశ్ 2010 అక్టోబరు 17న కోర్టుకు లొంగిపోయారు. 2011 జనవరి 3న మద్దెల చెర్వు సూరీని హైదరాబాద్‌లో కాల్చి చంపారు. పరిటాల రవి, సూరి హత్యలతో రెండో తరం అంతమైంది. ఇలా పరిటాల శ్రీరాములు నుంచి మద్దెల చెరువు సూరీ హత్య వరకూ ఈ రెండు కుటుంబాల మధ్య రేగిన ఫ్యాక్షన్ చిచ్చులో 973మంది బలైన ట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇలా రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ పోరులో వందలమంది ప్రాణాలు కోల్పోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమేమో!! సూత్రధారులతో పాటుపాత్ర ధారులనూశిక్షించాలంటున్న భానుమతి సూరి హత్య తర్వాత భాను కిరణ్ కొన్ని నెలలు కన్పించకుండా వెళ్లిపోయారు. భానునే సూరిని హత్య చేశారని అప్పట్లో పోలీసులు, సూరి అనుచరులు భావించారు. అయితే పరిటాల రవి పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్, విజయవాడకు చెందిన టీడీపీ నేత వల్లభనేని వంశీలే తన భర్త హత్యకు కారకులని సూరీ సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. ఆపై మంగళవారం తన భర్త హత్య కేసు తుదితీర్పు అనంతరం కూడా పరిటాల కుటుంబంపై భానుమతి ఆరోపణలు చేశారు. భానుకు యావజ్జీవశిక్ష విధించడంపై తాను అసంతృప్తిగా ఉన్నానని, ఉరిశిక్ష విధించాలని అన్నారు. అలాగే పాత్ర దారులతో పాటు కుట్రదారులకు కూడా శిక్ష పడాలన్నారు. అంటే పరిటాల కుటుంబీకుల పాత్ర కూడా ఉందని, వారికి శిక్షపడాలని చెప్పకనే చెప్పారు. దీంతో సూరీ హత్యతో పరిటాల కుటుంబీకుల పాత్ర ఉందనే భానుమతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికైనా ‘అనంత’ ఫ్యాక్షన్‌కు ముగింపు పలకాలని, ఇప్పటి వరకూ సాగిన దారుణకాండ చాలని, అంతా ప్రశాంత జీవితాన్ని కోరుకోవాలని జిల్లా వాసులు కాంక్షిస్తున్నారు. -
భార్య పక్కన ఉండగానే.. ప్రయాణికురాలితో
వాషింగ్టన్ : భార్య పక్కన ఉండగానే మరో ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ భారతీయ ఐటీ సంస్థ మేనేజర్‌కు అమెరికాలోని డెట్రాయిట్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించనున్నట్లు సమాచారం. ఏడు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు.. రోచెస్టర్ హిల్స్ సిటీలో ఉంటున్న ప్రభు రమణమూర్తి రెండేళ్ల నుంచి అమెరికాలోని ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్వేగాస్లో డెట్రాయిట్ వెళ్లే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. ఆ ప్రయాణంలో రమణమూర్తికి ఓవైపు భార్య... మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి బాధితురాలు ‘‘నిద్ర పోతున్న నాకు శరీరం మీద ఏదో పాకుతున్నట్లు అనిపించింది. లేచి చూసేసరికి రమణమూర్తి నా ప్రైవేట్ శరీర భాగాలను తడుముతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాను’’ అని తెలిపింది. ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. మొదట రమణమూర్తి ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ దబాయించాడు. లోతుగా విచారించేసరికి నేరం అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్ న్యాయస్థానం ఇటీవల అతడిని దోషిగా తేల్చింది. ఈ ఏడాది డిసెంబరు 12న అతనికి జీవిత ఖైదు విధించే వీలున్నట్లు సమాచారం. -
అనంతపురం కోర్టు సంచలన తీర్పు
గుంతకల్లు: అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ జిల్లా కోర్టు ఏడీజే సుమలత తీర్పును శుక్రవారం వెలువరించారు. వివరాలు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి ఓ బాలికను నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన 2013 సెప్టెంబర్‌లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు మస్తాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, శుక్రవారం తుది విచారణ ముగిసిన అనంతరం మస్తాన్‌ను దోషిగా గుర్తించిన న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఏడీజే సుమలత బాధితురాలికి రూ. 3.5లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
అనంతపురం కోర్టు సంచలన తీర్పు