Indian Techie
-
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ టెక్కీ దుర్మరణం
ఫ్లోరిడా: అమెరికాలో సోమవారం (మే 15) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని తాంపాలో పాదచారుల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న మరియప్పన్ సుబ్రమణియన్ (32)ను ఓ కారు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మరియప్పన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఆయన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో టెస్ట్ లీడ్‌గా పనిచేస్తున్నారు. మరియప్పన్‌కు భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. వీరు భారత్‌లో ఉంటున్నారు. కాగా మరియప్పన్ ఈ మధ్యనే జాక్సన్విల్లే నుంచి తాంపాకు వచ్చారు. మరియప్పన్ కుటుంబానికి సహాయం అందించేందుకు ‘గో ఫండ్ మీ’ అనే పేజీ ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టారు. అలాగే తాంపా, జాక్సన్విల్లే ప్రాంతాల్లోని కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు మరియప్పన్ మృత దేహాన్ని భారత్‌లోని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి -
మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు..
ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. లేఆఫ్స్ పేరుతో వరుసపెట్టి ఉద్యోగులను పీకేస్తున్నాయి. అన్ని కంపెనీల్లో ఈ సంవత్సరం 1.2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్‌పే! ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇండియన్ టెక్కీ వందన్ కౌశిక్ కూడా ఒకరు. మైక్రోసాఫ్ట్ కంపెనీ సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ అయిన ఆయన కంపెనీలో ఎనిమిదేళ్లు పనిచేశారు. తాజా లేఆఫ్స్‌లో భాగంగా కౌశిక్‌తో పాటు తన టీం అంతటినీ కంపెనీ పీకేసింది. కౌశిక్ తన లేఆఫ్ అనుభవాన్ని లింక్డ్ఇన్లో పంచుకున్నారు. కంపెనీలో తాను ఏయే బాధ్యతలు నిర్వహించిందీ.. తన టీం తనకు ఎలా సహకరించిందీ వివరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదీ చదవండి: రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే! కోవిడ్ అనంతరం టెక్ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో ఖర్చుల కట్టడిపై కంపెనీలు దృష్టి పెట్టాయి. అందులో భాగంగా ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. రానున్న కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించింది. -
రెండు దశాబ్దాల ప్రయాణం.. ఇండియన్ టెకీ భావోద్వేగం
సాక్షి, ముంబై: టెక్దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించింది. కంపెనీ ఇయర్ ఎండ్ రివ్యూలో భాగంగా మొత్తం ఉద్యోగులలో 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. పలు ఐటీ, టెక్ కంపెనీల్లో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న పలువురు తమ అనుభవాలు, కథనాలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు కంపెనీకి సేవలందించిన ఇండియన్ టెకీ లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది. (అమెజాన్ ఉద్యోగంకోసం ఇల్లు,కార్లు అమ్మేశా, మీరు ఈ తప్పులు చేయకండి!) మైక్రోసాఫ్ట్‌లో 21 సంవత్సరాలకు పైగా పనిచేసిన తర్వాత సంస్థలో ఉద్యోగాన్ని పోగొట్టుకోవడంపై ప్రశాంత్ కమాని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ తర్వాత మైక్రోసాఫ్ట్ మొదటి ఉద్యోగం. భయం, ఆందోళనతో ఉద్వేగభరితంగా విదేశానికి పయనం కావడం ఇప్పటికీ గుర్తుంది. కానీ తన జీవితం ఇలా మారిందా అని ఇంకా ఆశ్చర్య పోతున్నాను అని ఆయన అన్నారు. 21 సంవత్సరాల్లో ఎన్నో పాత్రల్లో, కంపెనీల్లో పని చేశాను. ఈ జర్నీ చాలా సంతృప్తికరంగా సాగింది. మైక్రోసాఫ్ట్‌లో పని చేయడం నిజంగా గిఫ్ట్‌గానే భావిస్తా అంటూ కమానీ పేర్కొన్నారు. (షావోమి 12 ప్రొపై భారీ తగ్గింపు, ఎక్కడంటే!) మైక్రోసాప్ట్లో ఉద్యోగం చేస్తున్నప్పటి ఆ అపారమైన అనుభవాన్ని కేవలం సంవత్సరాలతో కొలవలేను. చాలా ప్రతిభావంతులైన, తెలివైన వారి మధ్య పని చేయడం అదృష్టం. వారి నుండి చాలా నేర్చుకున్నాను వారికి కృతజ్ఞుడనంటూ ఆయన రాసుకొచ్చారు. తన జీవితాన్ని అత్యంత అర్ధవంతమైన మార్గాల్లో ప్రభావితం చేసినందుకు మైక్రోసాఫ్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మరీ ముఖ్యంగా అన్ని సమయాల్లో తనకు అండగా నిల బడిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను చాలా సందర్బాల్లో కుటుంబంకోసం లేకపోయినా, వారు మాత్రం తన కోసం ఎల్లపుడూ నిలబడ్డారనీ, ఇపుడు ఈ కఠిన సమయంలో కూడా తనకెంతో సపోర్ట్‌గా ఉన్నారంటూ ఉద్వేగాన్ని ప్రకటించారు. చివరగా తన అనుభవానికి సూట్ అయ్యే ఉద్యోగం ఇవ్వాలనుకునేవారు తనను సంప్రదించాలని కోరారు. ఈ నోట్ ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల్లో భావోద్వేగాన్ని నింపుతోంది. కాగా కమానీ 1999లో సాఫ్ట్వేర్ డిజైన్ ఇంజనీర్‌గా మైక్రోసాఫ్ట్‌లో కెరీర్‌ను ప్రారంభించి 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన 2015లో కంపెనీ నుంచి వైదొలిగారు. మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్‌గా మళ్లీ చేరడానికి ముందు అమెజాన్‌లో రెండేళ్లు పనిచేశారట. అయితే మైక్రోసాప్ట్ తాజా లేఆఫ్స్‌లో కమానీ ఉద్యోగాన్ని కోల్పోయారు. -
Paroma Chatterjee: బిజినెస్ లీడర్ లాభాల చెయ్యి
ఆర్ధిక లావాదేవీలను, వ్యవహారాలను టెక్నాలజీతో నడిపించే రంగాన్ని ‘ఫైనాన్స్ టెక్నాలజీ’ (ఫిన్‌టెక్) అంటారు. టెక్నాలజీ ఒక్కటే తెలిస్తే కాదు, ఫైనాన్స్ కూడా తెలిసుండాలి. కొంచెం కష్టమైన, ప్రావీణ్యం అవసరమైన పరిజ్ఞానాలివి. అయితే పరోమా చటర్జీకి ఇవి తప్ప వేరే ఏవీ ఆసక్తికరమైనవి కావని అనిపిస్తుంది. గత పదిహేనేళ్లుగా లెండింగ్ కార్ట్, ఫ్లిప్‌కార్ట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వంటి పెద్ద సంస్థల ‘ఫిన్‌టెక్’ విభాగాలలో అసమాన వృత్తి నైపుణ్యం కనబరుస్తూ వచ్చారు. ఇప్పుడిక ‘రివల్యూట్’ అనే 400 కోట్ల పౌండ్ల బ్రిటన్ కంపెనీ.. భారత్‌లో అదే పేరుతో తను ప్రారంభించబోతున్న కంపెనీకి వెళుతున్నారు! పరోమాను భారత్‌లోని తమ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించినట్లు ‘రివల్యూట్’ సంస్థ గురువారం ప్రకటించింది. మహిళలకు డబ్బు వ్యవహారాలు తెలియవని, టెక్నాలజీ పరిజ్ఞానం అంతంత మాత్రమేనని కింది స్థాయిలో ఎవరెంత అనుకున్నా, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో ఆ రెండు విభాగాలను నడిపిస్తున్నది దాదాపుగా మహిళలే. రివల్యూట్ను ఇప్పుడు పరోమా చటర్జీ నడిపించబోతున్నారు. ఆ కంపెనీ మనీ ట్రాన్స్ఫర్, ఎక్ఛేంజి, స్టాక్ ట్రేడింగ్, లోన్లు, వెల్త్ ట్రేడింగ్ సేవలను అందిస్తుంటుంది. అందుకు అవసరమైన టెక్నాలజీని వృద్ధి చేస్తుంటుంది. వచ్చే పద్దెనిమిది నెలల్లో తమ కంపెనీని భారత్‌లో విస్తృత పరిచేందుకు రివల్యూట్ ఏరికోరి పరోమాను ఎంపిక చేసుకుంది. అంటే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి వాటిని పరోమా పక్కకు తోసేయాలి. ఛాలెంజింగ్ జాబ్! పరోమా లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదివొచ్చారు. ఆ తర్వాత ఆమె తక్కువస్థాయి ఉద్యోగాలేమీ చేయలేదు. ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్‌లో కూడా చేశారు. రివల్యూట్ ఆఫర్ రావడానికి ముందు వరకు ఆమె లెండింగ్ కార్ట్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్. దేశంలోని వ్యాపారవేత్తలకు వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చే విభాగానికి అధికారి ఆమె. తర్వాత వయా.కామ్ అనే ‘బిజినెస్ టు బిజినెస్ టు కన్యూమర్’ (బి2బి2సి) ఇంటర్నెట్ ట్రావెల్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా పదిదేశాలలోని లక్షకు పైగా గల ఏజెంట్ల వ్యవస్థను నిర్వహించారు. ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకాల విభాగానికి ఇన్చార్జిగా చేశారు. ∙∙ పరోమా చటర్జీ ఇప్పుడు సీఈవోగా వెళ్తున్న రివల్యూట్ ఆరేళ్ల వయసు గల అంకుర సంస్థ. సిలికాన్ వ్యాలీలోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు టీవీసి, డీఎస్టీ గ్లోబర్, రిబిట్ క్యాపిటల్, లేక్స్టార్, జీపీ బుల్హౌండ్ల పెట్టుబడులు రివల్యూట్లో ఉన్నాయి. వాళ్లకు అసలుతో పాటు లాభాలూ అందించడం ఇప్పుడు రివల్యూట్ ఇండియా సీఈవో గా పరోమా బాధ్యత కూడా! ఇండియాలో తన విస్తరణకు సుమారు 200 కోట్ల రూపాయలను రివల్యూట్ వెచ్చించబోతోంది. వచ్చే ఏడాది ఇక్కడ ప్రారంభించబోతున్న కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా బెంగళూరును ఎంపిక చేసుకోవచ్చని ఆ రంగంలో ఉన్న ఇక్కడివారి అంచనా. పరోమా ఇంతవరకు పని చేసిన కంపెనీలనీ ప్రధానంగా బెంగళూరులోనివే. ఆమె చదువు కూడా ఒక నగరానికే పరిమితం అవలేదు. స్కూలు విద్య బెంగళూరులో; ఇంటర్, డిగ్రీ కోల్‌కతాలో, పీజీ ఐ.ఐ.ఎం. లక్నోలో. -
మైక్రోసాఫ్ట్‌పైనే రివెంజా...టెకీకి భారీ షాక్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగికి కాలిఫోర్నియా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. తనను ఉద్యోగంనుంచి తొలగించారన్న ఆక్రోశంతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగి దీపాంశు ఖేర్ ప్రతీకారం తీర్చు కోవాలనుకున్నాడు. సుమారు 1200 యూజర్ అకౌంట్లను డిలీట్ చేసి పారేసి సైబర్ నేరానికి పాల్పడ్డాడు. దీనిపై విచారించిన అమెరికా కోర్టు దీపాంశుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. అలాగే మరో మూడేళ్లు అతనిపై నిరంతర పర్యవేక్షణతోపాటు, 5,67,084 డాలర్ల (సుమారు నాలుగుకోట్ల రూపాయలు) జరిమానా కూడా విధించింది. (మైక్రోసాఫ్ట్ బిగ్ ప్లాన్స్ : భారీ కొనుగోలుకు సన్నాహాలు) ఉద్యోగంలో ఉద్వాసనకు గురైన తర్వాత దీపాంశు ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో కక్షపూరితగా కంపెనీ సర్వర్‌ను హ్యాక్ చేసి మరీ 1200 ఖాతాలను తొలగించాడు. సర్వర్‌లోని 1500 యూజర్ అకౌంట్లలో 1200 అకౌంట్లను డిలీట్ చేశాడు. ఆ తర్వాత కామ్‌గా ఢిల్లీకి వచ్చేశాడు. ఈ చర్య మైక్రోసాఫ్ట్ కంపెనీనీ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ అకౌంట్లకు సంబంధించిన ఈమెయిల్స్, కాంటాక్టులు, కీలక జాబితాలు, సమావేశాల తేదీలు, డాక్యుమెంట్లు, డైరీలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్సుల వివరాలన్నీ గల్లంతు కావడంతో కంపెనీ బాగా నష్టపోయింది. కంపెనీని ఏకంగా రెండు రోజుల పాటు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. (గుడ్ న్యూస్ చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ) చివరికి అతగాడు చట్టానికి దొరకక తప్పలేదు. దీనిపై విచారణ జరుగుతోందని గమనించని దీపాంశు గత జనవరి 11న మళ్లీ అమెరికాకు వెళ్లాడు. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నపోలీసులు అతనికి విమానాశ్రయంలోనే చెక్‌పెట్టారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఉద్దేశపూరకంగా విధ్వంసక నేరం చేసి ఖేర్ ఎంతో తెలివిగా తప్పించు కోవాలను కున్నాడని, కంపెనీ మీద ప్రతీకారంతో, పథకం ప్రకారమే సైబర్ నేరానికి పాల్పడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి మేరిలిన్ హఫ్ వ్యాఖ్యానించారు. ఖేర్ చేసిన కుట్రపూరితమైన చర్య ఫలితంగా కంపెనీ తీవ్రంగా నష్టపోయిందని అమెరికా అటార్నీ రాండీ గ్రాస్మన్ పేర్కొన్నారు. (వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర) కోర్టు పత్రాల ప్రకారం, ఖేర్‌ను 2017 నుండి మే 2018 వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ కార్ల్స్ బాడ్ నియమించింది. అయితే ఖేర్ పనిపై సంతృప్తి చెందని కంపెనీ కన్సల్టింగ్ సంస్థకు తన అసంతృప్తిని తెలియజేసింది. దీంతో జనవరి 2018 లో, కన్సల్టింగ్ సంస్థ ఖేర్‌ను సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి తొలగించింది. చివరికి మే 4, 2018న ఖేర్‌ను ఉద్యోగంనుంచి తొలగించింది. -
భారతీయ టెకీలకు ట్రంప్ మరోసారి షాక్!
వాషింగ్టన్: వైట్‌హౌస్ వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ టెక్కీలకు మళ్లీ షాక్ ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు, హెచ్–1బీతో పాటుగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఆధారిత వీసాలపై నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగించారు. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి వీటిపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యంలో గత ఏడాది జూన్‌లో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అన్ని రకాల వీసాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లో నిషేధం గడువు ముగుస్తుందనగా గురువారం పొడిగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్–1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ వలసదారుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ టెకీలకు తీవ్ర ఎదురు దెబ్బ తగలనుంది. డాలర్ డ్రీమ్స్ కలల్ని నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్లాలంటే భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన వారు మరో మూడు నెలలవరకు ఎదురు చూడాల్సిందే. అమెరికా కంపెనీలకు 10 వేల కోట్ల నష్టం ! ట్రంప్ వీసా విధానంపై అమెరికాలోనూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌లో ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో 500 టెక్ కంపెనీలకు 10వేల కోట్ల డాలర్లు నష్టం కలిగినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సారి నిషేధం పొడిగింపు వల్ల పెద్దగా నష్టం జరగదని, బైడెన్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశాక వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో 6.7శాతం ఉన్నందుకే నిషేధాన్ని పొడిగించానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. -
హెచ్–1బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. హెచ్–1బీ వీసాల్లో ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని అమెరికా కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది చివరి వరకు హెచ్–1బీ వీసాలను రద్దు చేస్తూ అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్1–బీ వీసా విధానంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వీసా విధానంలో మార్పులు తీసుకురావడంలో ట్రంప్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించలేదని కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రభుత్వం వీసా విధానంలో మార్పులపైన చర్చించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్న న్యాయమూర్తి విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలు విదేశీ పనివారి నియామకంలో ఉన్న పరిమితుల్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. డిసెంబర్ 7 నుంచి ఈ నిర్ణయాలేవీ అమలు చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. బైడెన్ ప్రమాణ కమిటీలో ఇండియన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి వేసిన కమిటీలో ప్రవాస భారతీయుడు మజూ వర్ఘీస్కి చోటు లభించింది. ఈ కమిటీలో తనను ఎంపిక చేయడంపై మజూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘జో బైడెన్, కమలా హ్యారిస్‌ల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటుగా ఆ సంబరాల్లో జరిగే ఇతర కార్యక్రమాల ప్రణాళిక, నిర్వహణ కమిటీలో చోటు లభించడం నాకు గర్వకారణం‘‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బైడెన్, కమలా ఎన్నికల ప్రచారంలో కూడా మజూ కీలక సలహాదారుగా వ్యవహరించారు. -
కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్
కాలిఫోర్నియా: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారతీయ టెకీకి భారీ షాకిచ్చింది. కరోనా వైరస్ పై తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. తన ప్రకటనల సమీక్ష ప్రక్రియను దాటవేయడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి మోసపూరిత ప్రకటనలు, తప్పుడు సమాచారాన్ని అందించేలా సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నందుకు ఫేస్బుక్ బసంత్ గజ్జర్ పై దావా వేసింది. ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, మోసపూరిత ప్రకటనలతో అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బసంత్ గజ్జర్ సంస్థ లీడ్‌క్లోక్ పై ఈ దావా వేసింది.కోవిడ్-19కి సంబంధించి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంతో పాటు, అనేక ఇతర సాంకేతిక సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. కరోనాకు సంబంధించి నకిలీ వార్తలు, తప్పుడు ప్రకటనలకు సంబంధిచి యాడ్-క్లోకింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించినట్లు వెల్లడించింది. కరోనా వైరస్, క్రిప్టోకరెన్సీ, డైట్ పిల్ప్ తదితర నకిలీ వార్తలతో ఫేస్ బుక్ నిబంధనలను ఉల్లఘించాడని పేర్కొంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లోని ఆటోమేటెడ్ అడ్వర్టైజింగ్ రివ్యూ ప్రాసెస్ నుంచి తప్పించుకునేలా యాడ్-క్లోకింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించినట్లు ఆరోపించింది.థాయ్‌లాండ్‌లో ఉన్నగజ్జర్ లీడ్‌క్లోక్ ద్వారా క్లోకింగ్ సాఫ్ట్వేర్ సాయంతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మోసపూరిత ప్రకటనలను నడుపుతున్నాడని ఫేస్బుక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ లిటిగేషన్ డైరెక్టర్ జెస్సికా రొమెరో ఒక ప్రకటనలో తెలిపారు. (కరోనా భయమా? మీకో బుల్లి పెట్టె : రూ.500 లే) అలాగే గూగుల్, ఓత్, వర్డ్ ప్రెస్, షాపీఫై లాంటి ఇతర సాంకేతిక సంస్థలను లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ఈ క్లోక్డ్ వెబ్సైట్లలో కొన్ని ప్రముఖుల చిత్రాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియా దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. లీడ్‌క్లోక్ కస్టమర్లను గుర్తించడంతోపాటు, వారిపై అదనపు అమలు చర్యలు తీసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలిపింది. తాజా పరిణామంతో గోప్యతకు సంబంధించి, ఫేక్ న్యూస్ నివారణకు ఇతర సెక్యూరిటీ చర్యల్ని చేపట్టినట్టు వెల్లడించింది. కాగా క్లోకింగ్ అనేది హానికరమైన టెక్నిక్. దీనిద్వారా ఆయా సైట్లలోకి చొరబడి, వెబ్సైట్ స్వభావానికి విరుద్ధంగా, నకిలీ వార్తలు, ప్రకటనలు ఇస్తుంది. అంతేకాదు సంబంధిత సంస్థల సమీక్ష వ్యవస్థలను బలహీనపరుస్తుంది. మోసపూరిత ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహిస్తుంది. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టిన భారతీయుడు
శాన్ఫ్రాన్సిస్కో: ఫోన్ ఆధారిత క్యాబ్ సర్వీస్ ఉబర్ సాఫ్ట్‌వేర్‌లో ఓ బగ్ బయటపడింది. ఇది ఎవరి ఖాతాలోకైనా అనధికారికంగా ప్రవేశించేందుకు హ్యాకర్లకు మార్గం కల్పించేలా ఉంది. దీన్ని కనుగొని తెలియజేసినందుకుగాను భారత సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఆనంద్ ప్రకాశ్‌కు ఉబెర్ రూ. 4.6 లక్షలను బహూకరించింది. ఏపీఐ రిక్వెస్ట్ ద్వారా ఉబర్ క్యాబ్స్, ఉబర్ ఫుడ్ ఖాతాల్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ బగ్ గురించి ఆనంద్ ఉబర్‌కు తెలియజేయగానే బగ్ బౌంటీ ప్రోగ్రాంను ఉబర్ అప్డేట్ చేసింది. జీవితాంతం ఉబర్ క్యాబ్‌లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించే బగ్‌ను గతంలో గుర్తించి ఆకాశ్ తొలగించాడు. 2014లో సెక్యురిటీ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు 2016లో సైబర్ సెక్యురిటీ స్టార్టప్ ‘ఆప్ సెక్యుర్’ను స్థాపించాడు. ఫోర్బ్స్ 30 ఏళ్ల లోపు ఆసియా జాబితాలోనూ అతడు స్థానం దక్కించుకున్నాడు. ఎటువంటి ఖాతా లేకపోయినా ఫేస్బుక్లో లాగిన్ అయ్యే లొసుగును గుర్తించడంతో 2015లో ఫేస్బుక్ సంస్థ అతడికి 15 వేల డాలర్లు నజరానాగా ఇచ్చింది. తమిళనాడులోని వెలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించిన ఆకాశ్.. సైబర్ సెక్యురిటీలోని లోపాలను గుర్తించి ప్రశంసలతో బహుమానాలు అందుకున్నాడు. -
భార్య పక్కన ఉండగానే.. ప్రయాణికురాలితో
వాషింగ్టన్ : భార్య పక్కన ఉండగానే మరో ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ భారతీయ ఐటీ సంస్థ మేనేజర్‌కు అమెరికాలోని డెట్రాయిట్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించనున్నట్లు సమాచారం. ఏడు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు.. రోచెస్టర్ హిల్స్ సిటీలో ఉంటున్న ప్రభు రమణమూర్తి రెండేళ్ల నుంచి అమెరికాలోని ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్వేగాస్లో డెట్రాయిట్ వెళ్లే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. ఆ ప్రయాణంలో రమణమూర్తికి ఓవైపు భార్య... మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి బాధితురాలు ‘‘నిద్ర పోతున్న నాకు శరీరం మీద ఏదో పాకుతున్నట్లు అనిపించింది. లేచి చూసేసరికి రమణమూర్తి నా ప్రైవేట్ శరీర భాగాలను తడుముతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాను’’ అని తెలిపింది. ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. మొదట రమణమూర్తి ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ దబాయించాడు. లోతుగా విచారించేసరికి నేరం అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్ న్యాయస్థానం ఇటీవల అతడిని దోషిగా తేల్చింది. ఈ ఏడాది డిసెంబరు 12న అతనికి జీవిత ఖైదు విధించే వీలున్నట్లు సమాచారం. -
శ్రీనివాస్ కూచిభొట్లను నేనే చంపాను!
అమెరికాలోని కాన్సన్ నగరంలో ప్రవాస తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చిచంపేసిన కేసులో నిందితుడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఆడం పురింటన్‌కు మే 4న శిక్ష ఖరారు కానుంది. పథకం ప్రకారం చేసిన ఈ హత్యకు గాను అతనికి పెరోల్ లేకుండా 50 ఏళ్ల వరకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ దేశమంతటా విదేశీయులపై విద్వేషం వ్యక్తమైన నేపథ్యంలో కాన్సస్ నగరంలో శ్రీనివాస్ కూచిభొట్ల, అతని స్నేహితుడు అలోక్ మాదసానిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థి వీసా మీద అమెరికాకు వెళ్లిన శ్రీనివాస్, అలోక్ అనంతరం అక్కడి జీపీఎస్ తయారీ కంపెనీ గార్మిన్‌లో ఇంజినీర్లుగా పనిచేసేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 27న ఉద్యోగాన్ని ముగించుకొని స్నేహితులిద్దరు కాన్సస్‌లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లోకి మద్యం సేవించేందుకు వెళ్లారు. అక్కడ వారిని చూసిన నిందితుడు పూరింటన్ జాతివిద్వేషంతో దూషణలకు దిగాడు. ‘నా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతన్ని బార్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సిబ్బంది చెప్పారు. ఇలా బయటకు వెళ్లిన పూరింటన్ అనంతరం తుపాకీ తీసుకొని వచ్చి శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్‌పై కాల్పులు జరిపాడు. ఈ సమయంలో జోక్యం చేసుకొని.. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సాటి శ్వేతజాతీయుడు ఇయాన్ గ్రిలాట్‌పై ఆ కిరాతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు విడువగా అలోక్, ఇయాన్ గాయాలపాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో తాజాగా నిందితుడు నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమల స్పందించారు. ఈ కేసులో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్న నేపథ్యంలో విద్వేషం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందించాలని, మనమంతా పరస్పరం ప్రేమించుకోవాలిగానీ ద్వేషించుకోకూడదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
'టెక్కీలకు ట్రైనింగ్ పెద్ద కష్టమేమి కాదు'
టెక్నాలజీ రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల్లో చాలామంది కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం కష్టమేనంటూ క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఇండస్ట్రీ నిపుణుడు, మాజీ ఇన్ఫోసిస్ డైరెక్టర్ టీవీ మోహన్ దాస్ పాయ్ స్పందించారు. శ్రీనివాస్ కందుల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశీయ వర్క్‌ఫోర్స్ మీద తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతుండటంతో ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగాలు కోల్పోతుందన్నారు. దీనివల్ల చాలామంది ఇంజనీర్లు నిరుద్యోగులుగా మారుతున్నారని గుర్తుచేశారు.. 60-65 శాతం మంది దేశీయ ఐటీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం కష్టమేనని అనడం పూర్తిగా తప్పుడు ప్రకటనగా పేర్కొంటూ శ్రీనివాస్ కందుల వ్యాఖ్యలను పాయ్ ఖండించారు. దేశీయ ఐటీ ఉద్యోగుల సగటు వయస్సు 27 సంవత్సరాలు, అదే అమెరికా, జర్మనీలో అయితే ఈ ఉద్యోగుల సగటు వయసు 40కి పైనే ఉంటుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు వీరికి ట్రైనింగ్ ఇస్తుండటంతో భారత్ ఐటీ పరంగా చాలా విజయం సాధిస్తోందని చెప్పారు. క్లౌడ్ లేదా బిగ్ డేటా లేదా మరే ఇతర వాటిపైనన్న భారతీయులకు ట్రైనింగ్ ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదని పాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫ్యాకల్టీ సిలబస్‌లో మార్పులు చేయాల్సినవసం ఉందన్నారు. గ్లోబల్ యూనివర్సిటీలో సిలంబస్లను చాలా త్వరగా మార్చుతుంటారని, ప్రభుత్వం రావాలి, చెప్పాలి అనేది వారికి ఉండదని వివరించారు. -
బాల్కనీలోంచి జారిపడి టెక్కీ మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్‌కు చెందిన 29 ఏళ్ల ఐటి ఉద్యోగి పంకజ్ సా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం తెల్లవారుఝామున ఇండియాలో ఉన్న తన భార్యతో ఫోన్లో మాట్లాడుతూ అపార్ట్మెంటు మూడవ అంతస్తు బాల్కనీలోంచి జారి కిందపడ్డాడు. దీంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. అత్యవసర వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిసేపటికే తలకు తీవ్రమైన గాయం, మరికొన్ని అంతర్గత గాయాలతో మరణించాడని సిడ్నీ పోలీసులు తెలిపారు. తునాతునకలైన అతని ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సా పనిచేస్తున్న నార్త్ సిడ్నీలోని ఐటి సంస్థ మేనేజర్ కరేన్ వాలర్ అందించిన వివరాల ప్రకారం మృతుడు ఈ మధ్యనే వివాహం చేసుకుని ఆస్ట్రేలియాకు వచ్చినట్టు తెలుస్తోంది. మహీంద్రలో సిస్టం అనలసిస్ట్ గా పని చేస్తున్న పంకజ్ సా ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అతని మరణ వార్తతో పంకజ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.