నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన | Techie Got Promoted in April Now She Loss Job | Sakshi
Sakshi News home page

నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన

Published Tue, May 7 2024 8:29 PM | Last Updated on Tue, May 7 2024 8:52 PM

Techie Got Promoted in April Now She Loss Job

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.

దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.

రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.

పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.

టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement