హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కొత్త నియమాలు ఈ రోజు (జనవరి 17, 2025) అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కీలకమైన, మంచి వేతనాలను అందుకునే ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వారి ఉద్యోగ స్థితి ఆధారంగా అమెరికాలో ఉండటానికి అనుమతి లభిస్తుంది.
పదవీ విరమణ అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో తుది వలస విధాన సంస్కరణలలో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకీకరించడమే కాకుండా సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మాత్రమే మరిన్ని అవకాశాలందించే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు సమాచారం. దీని వల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ H-1B ఫైనల్ రూల్ , H-2 ఫైనల్ రూల్ ప్రకారం, H-1B నాన్-ఇమ్మిగ్రెంట్ , H-2 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ల నిబంధనలు మారతాయి. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించిన H-1B వీసా ప్రోగ్రామ్ మార్పులు భారతీయులకే ఎక్కువ.2023లో H-1B వీసా హోల్డర్లలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయ నిపుణులు ఉన్నందున, ఈ మార్పులు వారికే ఎక్కువప్రయోజనం చేకూరుస్తాయి.
యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) "H-1B తుది నియమం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా, ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడానికి మెరుగైన యజమానులను అనుమతించేందుకు H-1B ప్రోగ్రామ్‌ను ఆధునీకరిస్తుందని వెబ్‌సైట్‌లో అని పేర్కొంది.
హెచ్-1బీ వీసా కీలక మార్పులు
హెచ్-1బీ వీసా ప్రక్రియ మరింత సులభతరం అయ్యింది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను 'స్పెషాలిటీ ఆక్యుపేషన్' కింద నియమించుకోవడం కంపెనీలకు ఇక సులభతరం.
కంపెనీలు వారి నిర్దిష్ట శ్రామిక శక్తి అవసరాల ఆధారంగా H-1B కార్మికులను నియమించుకోవచ్చు,
F-1 విద్యార్థి వీసాల నుంచి హెచ్-1బీ వీసాలకు మారడం ఈజీ. ప్రాసెసింగ్ జాప్యం కూడా తగ్గుతుంది.యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.
జనవరి 17, 2025 నుండి కొత్త రూల్ ప్రకారం ఫారం I-129 తప్పనిసరి అవుతుంది. హెచ్-1బీ వీసా ప్రక్రియను సరళీకృతం చేసే దిశగానే దీన్ని తీసుకొచ్చింది.
అయితే మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించేందుకే ఈ మార్పులని విమర్శలు వినబడుతున్నాయి. హెచ్-1బీ వీసా మార్పులు అమెరికా ఉద్యోగులకు నష్టమని, అమెరికన్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని విమర్శించారు. మరోవైపు రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్పులను ఎంతవరకు అంగీకరిస్తారు? తిరిగి ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment