శాన్‌ఫ్రాన్సిస్కో: ఫోన్ ఆధారిత క్యాబ్ సర్వీస్ ఉబర్ సాఫ్ట్‌వేర్‌లో ఓ బగ్ బయటపడింది. ఇది ఎవరి ఖాతాలోకైనా అనధికారికంగా ప్రవేశించేందుకు హ్యాకర్లకు మార్గం కల్పించేలా ఉంది. దీన్ని కనుగొని తెలియజేసినందుకుగాను భారత సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఆనంద్ ప్రకాశ్‌కు ఉబెర్ రూ. 4.6 లక్షలను బహూకరించింది. ఏపీఐ రిక్వెస్ట్ ద్వారా ఉబర్ క్యాబ్స్, ఉబర్ ఫుడ్ ఖాతాల్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ బగ్ గురించి ఆనంద్ ఉబర్‌కు తెలియజేయగానే బగ్ బౌంటీ ప్రోగ్రాంను ఉబర్ అప్‌డేట్ చేసింది.
జీవితాంతం ఉబర్ క్యాబ్‌లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించే బగ్‌ను గతంలో గుర్తించి ఆకాశ్ తొలగించాడు. 2014లో సెక్యురిటీ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు 2016లో సైబర్ సెక్యురిటీ స్టార్టప్ ‘ఆప్ సెక్యుర్’ను స్థాపించాడు. ఫోర్బ్స్ 30 ఏళ్ల లోపు ఆసియా జాబితాలోనూ అతడు స్థానం దక్కించుకున్నాడు. ఎటువంటి ఖాతా లేకపోయినా ఫేస్‌బుక్‌లో లాగిన్ అయ్యే లొసుగును గుర్తించడంతో 2015లో ఫేస్‌బుక్ సంస్థ అతడికి 15 వేల డాలర్లు నజరానాగా ఇచ్చింది. తమిళనాడులోని వెలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించిన ఆకాశ్.. సైబర్ సెక్యురిటీలోని లోపాలను గుర్తించి ప్రశంసలతో బహుమానాలు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment