passinger
-
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల జోరు.. భారత చరిత్రలోనే ఇదే అత్యధికం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 - 23లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు హోల్‌సేల్‌లో రికార్డు స్థాయిలో 38,90,114 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత చరిత్రలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాల జోరు ఇందుకు దోహదం చేసింది. 2018 - 19లో విక్రయం అయిన 33,77,436 యూనిట్లే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 26.73 శాతం వృద్ధి అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ వన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. 2021–22లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 30,69,523 యూనిట్లు. యుటిలిటీ వాహనాలు.. గత ఆర్థిక సంవత్సరంలో 34.55 శాతం వృద్ధితో 20,03,718 యూనిట్ల యుటిలిటీ వాహనాలు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 14,89,219 యూనిట్లు. పీవీ విభాగంలో యుటిలిటీ వెహికిల్స్ వాటా ఏకంగా 51.5 శాతానికి ఎగబాకింది. వాణిజ్య వాహనాలు 7,16,566 నుంచి 9,62,468 యూనిట్లకు చేరాయి. 2018 - 19 తర్వాత ఇదే అధికం. ద్విచక్ర వాహనాలు 17 శాతం అధికమై 1,35,70,008 యూనిట్లు నవెదయ్యాయి. సానుకూలంగా పరిశ్రమ.. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా విక్రయాలు 20.36 శాతం పెరిగి 2,12,04,162 యూనిట్లకు చేరుకున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల విభాగంలో సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్ తెలిపింది. ప్రారంభ స్థాయి మినీ కార్ల విక్రయాలు 57 శాతం పడిపోయాయి. 2016 - 17లో ఈ విభాగంలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. 2018 - 19తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ స్కటర్లు 27 శాతం, మోటార్‌సైకిళ్లు 38 శాతం తగ్గాయి. ‘అన్ని విభాగాల్లో మొత్తం డివండ్ క్రమంగా పెరుగుతోంది. సరైన దిశలోనే పరిశ్రమ కదులుతోంది. 2023–24 సంవత్సరానికి సానుకూలంగా ఉంటుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
Toll Gate: ‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు..
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): ఫాస్టాగ్ పనిచేయడం లేదంటూ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్గేట్ వద్ద ఆదివారం వెలుగు చూసింది. టోల్గేట్ వద్ద ఇటీవల ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా ఫాస్టాగ్ పనిచేయడం లేదని నిర్వాహకులు వాహనదారుల నుంచి నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు. ఆదివారం ఓ వాహనదారుడు డబ్బులు చెల్లించి కొంత దూరం వెళ్లిన తర్వాత అతడి ఫాస్టాగ్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. వెంటనే వెనక్కువచ్చి నిర్వాహకులను నిలదీశాడు. వారు సరైన సమాధానం చెప్పకుండా టోల్‌ప్రీ నంబర్‌కు ఫోన్చేసుకోండి. లేదంటే కౌంటర్లో వెళ్లి అడగండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఇంతలో మరో ఫాస్టాగ్ ఉన్న కారు వచ్చింది. సిబ్బంది అతడి నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. కాసేపటికే అతడి ఫోన్‌కు కూడా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెస్సేజ్ వచ్చింది. అయినా సిబ్బంది సరిగా స్పందించలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాంకేతిక లోపంతో కొంతమందికి ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెస్సేజ్ వస్తోందని సిబ్బంది తెలిపారు. చదవండి: Petrol, diesel price today: కొనసాగుతున్న పెట్రో సెగ -
కాక్‌పిట్ తలుపులు పగలగొడతా
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రయాణికులు దూషించడంతోపాటు వారిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఢిల్లీ–ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏఐ865 అనే విమానం పలు సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విమానంలోని ఓ ప్రయాణికుడు పైలట్లను బయటకు రావాలని లేకపోతే కాక్‌పిట్ తలుపులు పగులగొట్టి లోపలికొస్తానని బెదిరించాడని సమాచారం. అలాగే ఒక మహిళా ప్రయాణికురాలు సిబ్బందిలోని ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రధాన ద్వారం తెరవాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. -
భార్య పక్కన ఉండగానే.. ప్రయాణికురాలితో
వాషింగ్టన్ : భార్య పక్కన ఉండగానే మరో ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ భారతీయ ఐటీ సంస్థ మేనేజర్‌కు అమెరికాలోని డెట్రాయిట్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించనున్నట్లు సమాచారం. ఏడు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు.. రోచెస్టర్ హిల్స్ సిటీలో ఉంటున్న ప్రభు రమణమూర్తి రెండేళ్ల నుంచి అమెరికాలోని ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్వేగాస్లో డెట్రాయిట్ వెళ్లే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. ఆ ప్రయాణంలో రమణమూర్తికి ఓవైపు భార్య... మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కాసేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి బాధితురాలు ‘‘నిద్ర పోతున్న నాకు శరీరం మీద ఏదో పాకుతున్నట్లు అనిపించింది. లేచి చూసేసరికి రమణమూర్తి నా ప్రైవేట్ శరీర భాగాలను తడుముతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాను’’ అని తెలిపింది. ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. మొదట రమణమూర్తి ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ దబాయించాడు. లోతుగా విచారించేసరికి నేరం అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్ న్యాయస్థానం ఇటీవల అతడిని దోషిగా తేల్చింది. ఈ ఏడాది డిసెంబరు 12న అతనికి జీవిత ఖైదు విధించే వీలున్నట్లు సమాచారం. -
డ్రైవర్ల మధ్య వివాదం.. ప్రయాణికుడికి శాపం
ఆర్టీసీ డ్రైవర్‌పైకి రాయి విసరబోయి ప్రయాణికుడి పైకి తీవ్ర గాయాలైన కారుడ్రైవర్ కన్నీరుమున్నీరవుతున్న భార్యాపిల్లలు గోపాలపట్నం (విశాఖ పశ్చిమ) : బస్ డ్రైవర్‌కు ఓ ఆటో డ్రైవర్‌కు వివాదం తలెత్తింది. ఇలా వాగ్వాదం ముదిరాక కొద్ది దూరం వెళ్లి ఆటో డ్రైవరు కాపు కాసి మరీ బస్ డ్రైవర్‌పై రాయి విసిరేశాడు. ఆ రాయి బస్‌లో ఉన్న ఓ ప్రయాణికుడికి తగిలి ఏకంగా కన్నే పోయింది. దీంతో ఆ కుటుంబం దుఃఖంతో కుమిలిపోతోంది. పేదరికంతో నలిగిపోతున్న ఆ వ్యక్తికి ఇపుడు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. న్యాయం చేయాలంటూ భార్యాపిల్లలూ పోలీసులను వేడుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. నాయుడుతోట దుర్గానగర్‌కు చెందిన షేక్ సురాజుద్దీన్ (36) కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 25 సాయంత్రం నగరంలోని పోస్టాఫీస్ నుంచి కొత్తవలస Ððవెళ్తున్న ఆర్టీసీ బస్ (6కె)లో ఆయన ప్రయాణిస్తున్నాడు. పెందుర్తి జంక్షన్ వద్ద ఓ ఆటో డ్రైవర్‌కు బస్‌డ్రైవర్‌కు మధ్య ట్రాఫిక్ విషయమై వివాదం చోటు చేసుకుంది. ఆటోడ్రైవరు రెచ్చిపోయి ఆటోతో సరిపల్లి వైపు దూసుకెళ్లాడు. ఓ చోట ఆగి బస్డ్రైవర్పైకి పెద్ద రాయి రువ్వాడు. అది దూసుకొచ్చి బస్‌లో ఉన్న షేక్సురాజుద్దీన్ తలకి, కంటిభాగానికీ తగిలింది. తీవ్ర రక్తస్రావంతో కొట్టిమిట్టాడిన అతడ్ని డ్రైవర్, కండక్టరు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ప్రాణాపాయం లేదని చిన్నకేసుగా పోలీసులు భావించినా, తర్వాత దారుణం జరిగిందని తేలింది. ఏకంగా కన్నే పోయిందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో సురాజుద్దీన్ భార్య, పిల్లలూ కన్నీరుమున్నీరయ్యారు. అగమ్యగోచరం ఆ కుటుంబం సిరాజుద్దీన్‌ది దీనావస్ధలో ఉన్న కుటుంబం. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు. ప్రైవేట్ కారు డ్రైవరుగా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని లాక్కెళ్తున్నాడు. ఇంతలో ఇలా ఊహించని ప్రమాద రూపంలో కన్ను పోవడంతో ఇపుడు ఒక కన్నే మిగిలింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో బస్ యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రాథేయపడుతున్నాడు. ఎవరా ఆటోడ్రైవర్? బస్డ్రైవర్ని లక్ష్యంగా చేసుకుని రాయి రువ్వి పరారైన ఆటో డ్రైవర్ ఎవరో పోలీసులకు తెలియలేదు. ఆటో డ్రైవరు ఎక్కడి స్టాండ్ వాడు..ఏ గ్రామానికి చెందిన వాడో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. ఆటోడ్రైవర్ని బస్ డ్రైవరు గుర్తించే పరిస్థితి ఉన్న తరుణంలో ఆటో డ్రైవర్ల వివరాలు సేకరిస్తున్నారు. బస్‌డ్రైవర్, ఆటోడ్రైవర్ మధ్య చోటుచేసుకున్న వివరాలు తెలియాల్సి ఉంది. -
రైళ్ల కోసం ప్రయాణికుల పడిగాపులు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్‌కు వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం రావాల్సిన పలు రైళ్లు రాత్రి వరకు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేన్లో పడిగాపులు కాశారు. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని కాజీపేట నుంచి వివిధ రైళ్ల ద్వారా వెళ్లేందుకు ప్రయాణికులు శుక్రవారం పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే రైళ్లు నిర్ణీత సమయం కంటే గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు నిరీక్షించారు. రైళ్ల రాక కోసం పలుమార్లు విచారణ కౌంటర్ వద్దకు వెళ్లి వస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యంగా వచ్చిన రైళ్లు ఇవే.. తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్ గంటన్నర, సికింద్రాబాద్ నుంచి సిర్పూర్కాగజ్నగర్కు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు, గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గంట, పట్నా నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే పట్నా ఎక్స్‌ప్రెస్ గంట, న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గంట, సిర్పూర్కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే సిర్పూర్కాగజ్నగర్ ఎక్స్‌ప్రెస్ అరగంట ఆలస్యంతో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్నాయి. -
రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు
ఎర్రుపాలెం: గొల్కొండ రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారి పట్టాలపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం పట్టణానికి చెందిన దర్రు రామారావు(41) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వరకు వెళుతుండగా డోర్ దగ్గర కూర్చోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు కాళ్లు నుజ్జుకావడంతో రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ దాడి
ఆదిలాబాద్: బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. అకారణంగా కానిస్టేబుల్ తనపై దాడి చేసిందని బాధితురాలు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వివరాలు.. కప్పర్ల గ్రామానికి చెందిన గంగూతాయి(18) అనే యువతి తలమడుగు మండలం ధరమ్‌పూర్ గ్రామం నుంచి అదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సులో బాగా రద్దీ ఉండటంతో.. ఫుట్‌బోర్డులో నిలబడింది. అదే సమయంలో బస్సులో తోపులాట జరగడంతో పక్కనే ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను అనూష ఢీకొంది. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళా కానిస్టేబుల్.. 'కళ్లు కనిపించడం లేదా మీద పడతావెందుకు' అని ఆమెను దుర్భాషలాడింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అలా జరిగిందని గంగుతాయి చెప్పింది. 'మాటకు మాట బదులు చేప్తావా' అంటూ యువతిపై దాడిచేసి ఆమెను కొట్టింది. దీంతో యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపడుతున్నారు.