ఎర్రుపాలెం: గొల్కొండ రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారి పట్టాలపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం పట్టణానికి చెందిన దర్రు రామారావు(41) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వరకు వెళుతుండగా డోర్ దగ్గర కూర్చోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు కాళ్లు నుజ్జుకావడంతో రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు
Published Thu, May 12 2016 8:46 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM
Advertisement
Advertisement