దొంగను పట్టుకుందామని..
Published Fri, Jan 15 2016 7:51 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
భోపాల్: దొంగను ఎలాగైనా పట్టుకోవాలనే ఆవేశంతో ఓ తల్లీ కూతుళ్లు కదులుతున్న రైలు నుంచి దూకేసిన వైనం కలకలం రేపింది. భోపాల్, భైరాంఘర్ రైల్వే స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చత్తీస్గఢ్ కుచెందిన అశ్వా తివారి, అంజన బిలాస్ పూర్ నుంచి ఇండోర్ వెళ్లేందుకు నర్మద ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. అదనుకోసం కాపు కాసిన దొంగ సమయం చూసి తల్లి ఆశా పర్సు లాక్కుపోయాడు. దీంతో తల్లీ కూతుళ్లిద్దరూ వాడిని దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఆ దొంగ రైల్లోంచి దూకేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కూడా రైల్లోంచి కిందకు దూకేయడంతో తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇంత చేసినా పర్సు దొంగ మాత్రం తప్పించుకు పారిపోయాడు.
కాగా బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితునికోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement