
లాస్‌వెగాస్: హోటల్‌లో జరుగుతున్న సంగీత విభావరిలోకి చొచ్చుకువచ్చి కాల్పులు జరిపిన దుండగుడు ఆత్మాహుతికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తాను దాక్కున్న హోటల్ రూమ్‌ను భద్రతా సిబ్బంది పగులగొట్టే ముందు షూటర్ తనను తాను హతమార్చుకుని ఉండవచ్చని భావిస్తున్నామని లాస్‌వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబార్డో చెప్పారు.
కాన్సర్ట్‌కు హాజరైన వారిపై దుండగుడు కాల్పులు జరిపిన 32వ ఫ్లోర్‌లోకి వెళ్లిన అధికారులకు 10 రైఫిళ్లు కనిపించాయని ఆయన తెలిపారు. దుండగుడి కాల్పులతో 50 మంది మరణించగా దాదాపు 400 మందికి పైగా గాయపడ్డారు. తీవ్ర కలకలం రేపిన ఈ దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.