
టీ.నగర్: పర్యాటకుల స్వర్గధామంగా లాస్ వేగాస్ విరాజిల్లుతున్నట్లు శార్ధాగ్లోబల్ మార్కెటింగ్ పీఆర్– డైరెక్టర్ పల్లబి రాజ్‌కోన్వర్ తెలిపారు. చెన్నైలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న లాస్‌వేగాస్‌లో పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు, వివాహాలు అధికంగా జరుగుతుంటాయని, అంతేకాకుండా లయొనెల్ రిజీ, సెలిన్ డియోన్, రోడ్ స్టీవర్ట్, ఎల్టన్ జాన్, కార్లోస్ శాంటానా వంటి ఐకానిక్ పెర్ఫామర్స్ ఇక్కడ ఉన్నట్లు తెలిపారు. అలాగే, బ్రిట్ని స్పియర్స్, జెన్నిఫర్ లోపెజ్, బాయ్స్ 11 మెన్, మెరయా కేరి ఇక్కడే ఉంటున్నారని తెలిపారు.
అలాగే, ఇక్కడ కంట్రీ మ్యూజిక్ రెసిడెన్సీగా ఉన్న రెబా, బ్రూక్స్, డున్‌లను సంగీతాభిమానులు దర్శించవచ్చన్నారు. లాస్ వేగాస్ కన్వెన్షన్ అండ్ విజిటర్స్ అథారిటీ (ఎల్‌వీసీవిఏ) సదరన్ నెవడాను టూరిజం, కన్వెన్షన్ డెస్టినేషన్‌గా ప్రపంచ వ్యాప్తంగా కలిగివుందని, అలాగే, లాస్‌వేగాస్ కన్వెన్షన్ సెంటర్, క్యాష్‌మెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఫోన్, ఆండ్రాయిడ్‌లలో వేగాస్ వీఆర్ వర్చువల్ రియాలిటీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని www.vrtv. vegas వెబ్‌సైట్ ద్వారా ఇక్కడి అందాలను వీక్షించి అనుభూతి చెందవచ్చని, మరిన్ని వివరాలకు www. visitlasvegas.com సందర్శించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment