
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక లాస్ వేగస్ షూట్ అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత సంతతి కుర్రాడు పింజల అనిరుధ్ కల్యాణ్ రజత పతకంతో మెరిశాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన అనిరుధ్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది.
లాస్ వేగస్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన అనిరుధ్ రికర్వ్ కబ్ కేటగిరీ లో పోటీపడి రెండో స్థానంలో నిలిచాడు. అనిరుధ్ మొత్తం 547 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గాడు. ఇదే టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ 898 పాయింట్లతో పదో ర్యాంక్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment