బ్రిట్నీ స్పియర్స్ రోజుకు ఆరు సార్లు.. | Britney Spears eats six times a day | Sakshi
Sakshi News home page

బ్రిట్నీ స్పియర్స్ రోజుకు ఆరు సార్లు..

Published Wed, Sep 25 2013 10:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

బ్రిట్నీ స్పియర్స్ రోజుకు ఆరు సార్లు..

బ్రిట్నీ స్పియర్స్ రోజుకు ఆరు సార్లు..

అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ మంచి భోజన ప్రియురాలు. ఈ మధ్య ఇష్టమైన వంటకాలన్నీ తెగ లాగించేసి కాస్త బరువు పెరిగింది. ఈ అందాల భామకు ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. నాజుగ్గా ఉండేందు కోసం భోజనం కాస్త తగ్గించి సన్నబడాలని ప్రయత్నిస్తోంది కానీ ఆచరణలో విఫలమవుతోంది. ఆమే ఈ విషయాన్ని వెల్లడించింది.

'ఈ రోజు ఆరుసార్లు తిన్నాను. ఆహారం విషయంలో జాగ్రత్తలేమీ తీసుకోను. ఎందుకంటే  భోజనమంటే నాకు చాలా ఇష్టం. తగ్గించడం చాలా కష్టం. మీరు కూడా ఇష్టమైనవన్నీ తినేయండి' అంటూ 31 ఏళ్ల పాప్ సింగర్ సెలవిచ్చింది. వచ్చే డిసెంబర్లో లాస్ వేగాస్లో జరిగే ఓ ప్రోగ్రామ్ కోసం ఆమె సన్నద్ధమవుతోంది. దాదాపు ప్రతిరోజూ ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుంది. అందాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంపై బ్రిట్నీ దృష్టిసారిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement