వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర లాస్ వేగస్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో విమానాల్లోని మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46, సింగిల్ ఇంజిన్ సెస్నా 172లు ఢీకొన్నాయని తెలిపారు.
'ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్ వేపై సెస్నా 172ను ఢీకొట్టింది. దాంతో పైపర్ పీఏ 46 రన్ వే 30కి తూర్పు వైపు పడిపోయింది. సెస్నా సమీపంలోని నీటి కుంటలో పడింది.' అని ఎఫ్‌ఏఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో విమానంలో ఇద్దరు ఉండగా.. మొత్తం మంది మరణించినట్లు సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది.
ఇదీ చదవండి: America Indiana City: ఇండియానా షాపింగ్ మాల్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం
Comments
Please login to add a commentAdd a comment