
రెజ్లర్ సుశీల్‌కు గాయం
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు లాస్‌వెగాస్‌లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్. ‘ప్రాక్టీస్ సమయంలో నా కుడి భుజానికి గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చా రు. ప్రస్తుతానికైతే ఈ గాయం ఎప్పుడు నయమవుతుందో చెప్పలేను.
దీంతో ఈనెల 6,7న జరిగే సెలక్ష న్ ట్రయల్స్‌కు అందుబాటులో ఉండలేకపోతున్నా ను. ఈ కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ ఆడనట్టే. ఈ టోర్నీ అనంతరం వచ్చే ఏడాది మరో ఆరు క్వాలిఫయింగ్ టోర్నీలు ఉంటాయి. వీటిలో పాల్గొని సత్తా చూపాలనుకుంటున్నాను’ అని లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సుశీల్ చెప్పాడు.