వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది.
ఇండియా బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప(32 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్‌క్రీత్ సింగ్(33), నమన్ ఓజా(25) పరుగులతో రాణించారు. కాగా కెప్టెన్ యువరాజ్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు.
బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 14 పరుగులిచ్చిన యువీ.. బ్యాటింగ్‌లోనూ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలోక్రిస్ స్కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా.. రవి బపోరా రెండు వికెట్లు సాధించాడు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఇయాన్ బెల్(59), సమిత్ పటేల్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్ సింగ్ రెండు, కులకర్ణి, ఆర్పీ సింగ్ తలా వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment