నటుడు, అతడి ప్రియురాలు మృతి | Actor Gregory Tyree Boyce and Girlfriend Natalie Adepoju Found Dead | Sakshi
Sakshi News home page

నటుడు, అతడి ప్రియురాలు మృతి

Published Tue, May 19 2020 9:01 PM | Last Updated on Tue, May 19 2020 9:07 PM

Actor Gregory Tyree Boyce and Girlfriend Natalie Adepoju Found Dead - Sakshi

లాస్‌వెగాస్‌: హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. నటుడు గ్రెగొరీ టైరీ బోయ్స్(30), అతడి ప్రియురాలు నటాలీ అడెపోజు(27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. లాస్‌వెగాపస్‌లోని గ్రెగొరీ టైరీ బోయ్స్ నివాసంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైనా కారణం ఉందా అనేది తెలియరాలేదు. వీరిద్దరి మృతదేహాలు పక్కపక్కనే ఉన్నాయి. ఘటనా స్థలంలో పౌడర్‌ లాంటి తెల్లటి పదార్థం దొరికిటనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఇది క్రిమినల్ సంఘటన కాదని పోలీసులు పేర్కొన్నారు. టాక్సికాలజీ నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. వీరిద్దరూ ఏడాది కాలంగా కలిసివుంటున్నారని సమాచారం. బోయిస్‌కు పదేళ్ల కుమార్తె, అడెపోజుకు కొడుకు ఉన్నాడు.  

2008లో వచ్చిన ట్విలైట్‌ సినిమాలో గ్రెగొరీ టైరీ బోయ్స్ తొలిసారిగా నటించాడు. ఈ సినిమాలో టైలర్ క్రౌలీ పాత్రలో అతడు కనిపించాడు. బోయిస్ మృతి పట్ల అతడి కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు? అంటూ బోయిస్‌ తల్లి లిసా వేన్ తల్లడిల్లారు. బోయిస్, అడెపోజు వెస్ట్ కోస్ట్ రాపర్స్ పేరిట చికెన్ వింగ్స్ వ్యాపారాన్ని ప్రారంభించే పనిలో ఉన్నారని ఆమె వెల్లడించారు. బోయిస్ మృతి పట్ల ట్విలైట్‌ అభిమానులు సంతాపం తెల్పుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement