
లాస్ వెగాస్ : అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద నర మేధానికి కారకుడైన స్టీఫెన్ క్రెయిగ్ పాడ్డాక్ (64) సోదరుడు బ్రూస్ పాడ్డాక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాస్ వెగాస్ మాండలే బే రిసార్ట్ లోని మ్యూజిక్ కాన్సర్ట్ పై బుల్లెట్ల వర్షం కురిపించి స్టీఫెన్ దాదాపు 59 మందిని కాల్చి చంపడంతో పాటు ఎంతో మందిని ప్రాణభయంతో పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే.
ఉన్మాది స్టీఫెన్ పాడ్డాక్ తమ్ముడు బ్రూస్ పాడ్డాక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ దొరికిపోయాడని పోలీసులు బుధవారం వెల్లడించారు. నిందితుడు బ్రూస్ పాడ్డాక్ ముఖ్యంగా టీనేజర్లను వ్యభిచారకూపంలోకి లాగేవాడని ఆరోపణలున్నాయి. గతంలోనూ అతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, బ్రూస్ కోసం చేపట్టిన తాజా అపరేషన్లో అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. 18 ఏళ్లలోపు యువతలను బ్రూస్ ట్రాప్ చేసేవాడని, అతడి ఇంట్లో దాదాపు 600 మంది టీనేజీ యువతుల నగ్న చిత్రాలు, పోర్నోగ్రఫీకి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 12 ఏళ్లలోపు బాలికలకు సైతం డబ్బు ఆశ చూపిస్తూ నగ్న ఫొటోలు తీసి ఆపై వేధింపులకు పాల్పడేవాడు. బ్రూస్ తరచుగా మకాం మారుస్తుండటంతో అతడి అరెస్ట్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
లాస్ వేగాస్ నరమేధానికి పాల్పడ్డ స్టీఫెన్ పాడ్డాక్ మరో తమ్ముడు ఎరిక్ పాడ్డాక్ మాత్రం ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడే వ్యక్తి కాదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మ్యూజిక్ కన్సార్ట్‌లో స్టీఫెన్ కాల్పులు జరిపిన అనంతరం ఈ ఘటనపై ఎరిక్ స్పందిస్తూ.. తన సోదరుడు ఇలాంటి చర్యలకు పాల్పడతాడని తెలియగానే షాక్‌కు గురయ్యానని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment