వెండితెరకు యూట్యూబ్‌ టీమ్‌ | Youtube Team Coming With Big screen Movie | Sakshi
Sakshi News home page

వెండితెరకు యూట్యూబ్‌ టీమ్‌

Nov 20 2017 7:42 AM | Updated on Nov 20 2017 7:42 AM

Youtube Team Coming With Big screen Movie - Sakshi

తమిళసినిమా: సాధారణ చిత్రాలతో నేటి యువతను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. కారణం సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధితో పాటు, యువతలో మారుతున్న అభిరుచి, అంచనాలను రీచ్‌ అవ్వాలంటే కచ్చితంగా కొత్తదనం అవసరం అవుతోంది. ఇటీవల యూట్యూబ్‌లో సరికొత్త కాన్సెప్ట్స్‌తో యువత లఘు చిత్రాలతో విపరీతంగా అలరిస్తున్నారు.అలా ఎరుమ్‌ సాణి లాంటి షార్ట్‌ ఫిలింస్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న యూట్యూబ్‌ టీమ్‌ తాజాగా వెండితెరపై తమ సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆ టీమ్‌లో రమేశ్‌ వెంకట్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ ఓడవుమ్‌ ముడియాదు ఒళియవుమ్‌ ముడియాదు పేరుతో ఒక వినోదభరిత కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దీన్ని క్లాప్‌ బోర్డు పతాకంపై వి.సత్యమూర్తి నిర్మిస్తూ, కథానాయకుడిగా పరిచయం కానున్నారు.

విజయ్, హారిజ, ఆర్‌జే.విక్కీ, గోపీసుధాకర్, షారాఅగస్టియన్‌ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, కథానాయకుడు మాట్లాడుతూ తన టీమ్‌పై చాలా నమ్మకం ఉందన్నారు. ఓడవుమ్‌ ముడియాదు ఒళియవుమ్‌ ముడియాదు చిత్రంతో విజయం సాధిస్తామినే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రారంభించనున్నామని, సమ్మర్‌ స్పెషల్‌గా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. దీనికి కౌశిక్‌ రవి సంగీతాన్ని, జోశ్వా జే.ఫిరోజ్‌ ఛాయాగ్రహణం అందించనున్నారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement