ఇన్ఫినిటమ్‌ అంటేనే ఒక వైబ్రేషన్...యూత్ కలల డెస్టినేషన్ | Hyderabad: Infinitum Pictures Launch | Sakshi
Sakshi News home page

ఇన్ఫినిటమ్‌ అంటేనే ఒక వైబ్రేషన్...యూత్ కలల డెస్టినేషన్

Aug 6 2023 11:15 AM | Updated on Aug 6 2023 4:56 PM

Hyderabad: Infinitum Pictures Launch - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫినిటమ్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. యువత కలల సాధనకు వారధిగా నిలుస్తోంది. అరుదైన యుత్ ఐకాన్స్ కు ఇన్ఫినిటమ్‌ అడ్డగా నిలుస్తోంది. ఇన్ఫినిటమ్ ఈవెంట్ అదరహో అనే స్థాయిలో సాగింది. స్పూర్తిని నింపేలా ఈవెంట్ సంథింగ్ స్పెషల్‌గా నిలిచింది. యువతలో స్పూర్తిని నింపే ఎంతో మంది ఒకే వేదిక మీదకు ఇన్ఫినిటమ్ తీసుకొచ్చింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సాధించిన విజయం అద్భుతం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టింది.

ఇందుకు సంబంధించిన భాగస్వామ్య సంస్థలను పరిచయం చేసింది. తమ లక్ష్యం ఏంటో ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. సెలబ్రెటీస్ సందడి.. ప్రముఖుల బ్లెస్సింగ్ నడుమ పండుగ వాతావరణంలో ఈవెంట్ సినీ ఎంట్రీ గ్రాండ్ లాంచ్‌ చేసింది. ఇన్ఫినిటమ్ ఈవెంట్‌కు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలి వచ్చారు.  ఏషియన్ గ్రూప్ జాహ్నవి నారంగ్, ఎమ్మెల్యే రఘనందన్ రావు ఇన్ఫినిటమ్‌కి విషెస్ చెప్పారు. ఏషియన్ మూవీతో టై అప్ అయిన ఇన్ఫినిటమ్ జయ క్రిష్ణ ముకుంద మురారీ తొలి మూవీ టైటిల్ ను ఆవిష్కరించారు.

ఇక ఈవెంట్ కలర్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ గా గ్రాండ్ ఫీస్ట్ గా నిలిచింది. ఎంతో మంది యువ కళాకరులను ఈ వేదిక ద్వారా పరిచయం చేసింది. ఇన్ఫినిటమ్ కోర్సులను ఈవెంట్ లో ఆవిష్కరించారు. యూఎస్ లో ఇన్ఫినిటమ్ ఆపరేషన్స్ ను ఇదే ముహూర్తంగా అధికారికంగా లాంఛ్ చేసారు. ట్రిపుల్ ఆర్ మూవీ ఫేం రాహుల్ సిప్లిగంజ్, బేబీ ఫేం వైష్ణవి చైతన్యను సత్కరించారు.  ఇన్ఫినిటమ్ పిక్చర్స్ సభికుల హర్షధ్వానాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేసారు. 2023 ఇన్ఫినిటమ్ వైటీ క్యాలెండర్ ను ప్రకటించారు. స్టూడెంట్ వెబ్ సిరీస్‌ లిరికల్ సాంగ్ రిలిజ్ చేశారు. ఇదే సమయంలో ఇన్ఫినిటమ్ ఏషియన్ భాగస్వామ్యంతో కొనసాగనున్న ప్రణాళికలు..ప్రకటనలను ఈవెంట్ లో ప్రకటించి ఆసక్తిని పెంచారు.

యువ కళాకారుల అభిరుచులకు ఇన్ఫినిటమ్‌ మార్గదర్శకత్వం వహిస్తోంది. వారి అభిరుచులకు అనుగుణంగా ఎదిగేందుకు వేదికగా నిలుస్తోంది. వారు సక్సెస్ అవ్వటంలో రోల్ మోడల్ గా ఖ్యాతి దక్కించు కుంది. ఇలాంటి ప్రతిభ.. సమర్ధతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఇన్ఫినిటమ్‌ను గెస్టులు మనస్పూర్తిగా అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో సక్సెస్ లకు చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement