ఒక్క..చాన్స్!!
♦ షార్‌టఫిల్మ్స్ మేకింగ్‌లో రాణిస్తున్న యువత
♦ సొంతంగా చిట్టి చిత్రాల రూపకల్పన
♦ యూట్యూబ్‌లో అప్‌లోడింగ్ సినిమాలకు దీటుగా నిర్మాణం
♦ సినీ ప్రముఖులను ఆకట్టుకునే ప్రయత్నం వెండితెర అవకాశాలే లక్ష్యం
వాళ్లంతా యువతరం.. వెండితెరలో అవకాశం కోసం ‘ఒక్క ఛాన్‌స.. ఒకేఒక్క ఛాన్‌స’ అంటూ అన్నపూర్ణ స్టూడియో.. పద్మాలయ స్టూడియో గేటు వద్ద కాపాలా కాయడం లేదు. ఏ దర్శ కుడి వద్దకో.. నిర్మాత వద్దకో వెళ్లి బతిమిలాడుకోవడం లేదు. భిన్నమైన ఆలోచ నలతో శరవేగంగా విస్తరిస్తున్న సామాజిక మాధ్యమాల్లో తమ సృజనను చాటు తున్నారు. చిన్న చిన్న డాక్యుమెంటరీ చిత్రాలతో వెండితెర అవకాశాలు వెతుక్కుంటూ రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఖర్చుకు సైతం వెనుకాడకుండా తమ భావనలకు అద్దం పట్టేలా చిట్టి చిత్రాలను రూపొందిస్తున్నారు. సృజనాత్మకతకు అద్దం పడుతూ నేటి..మేటి చిత్రాలు తీస్తున్న ఈ నవతరంపై ఆదివారం ప్రత్యేకం -శంషాబాద్
ఒకరికొకరు చేయికలిపితే కొండంత లక్ష్యమైనా చిన్నదై పో తుంది. అదే తలంపుతో చిత్రాల్లో కనిపించాలనే తపనతో శం షాబాద్‌లోని కొందరు యువకులు కలిసి చిన్న చిత్రాలు (షార్ట్ ఫిల్మ్స్) తీసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. కాస్త ఆర్థిక వనరులున్న వారు నిర్మాతగా మారితే.. సృజనాత్మకత కలిగిన వారు దర్శకులుగా మారి కెమెరాల్లోకి ఎక్కిస్తున్నారు. నటలో తమ సత్తా చాటుకునేందుకు నటీనటులు కూడా ఉ న్నారు. ఇలా ఆయా రంగాల్లో వారివారి అభిరుచులకు అను గుణంగా ఓ బృందంగా ఏర్పడి సినిమాలు తీస్తూ ఔరా అని పిస్తున్నారు.
శంషాబాద్ పట్టణానికి చెందిన కల్యాణ్‌శ్రీ వర్మ దర్శకుడిగా ఇప్పటికే యూట్యూబ్‌లో ఐదు చిత్రాలకు పైగా చేశాడు. అతని తోడుగా స్థానికంగా ఉండే శివదత్త సాయి సాయి ఐసిరి పేరిట నిర్మాతగా మారి ఆర్థిక వనరులు సమ కూరుస్తూ యూట్యూబ్ సినిమాల నిర్మాణం చేపడుతున్నారు. వీరితో పాటు సాయికిరణ్ దేశాయి, విక్రమ్ తలసీల, అభినవసాగర్ తదితరులు తమ నటనాకౌశలంతో ఇప్పటికే పలు చిత్రాల్లో మెప్పించారు. ప్రేమ భావనతో కూ డిన చిత్రా లే కాకుండా సామాజిక మార్పులకు సంబంధిం చిన చిత్రా లు సైతం రూపొందించారు. ఇటీ వల సాయి ఐసిరి ప్రొడ క్షన్‌పై శివదత్త సాయి నిర్మాతగా ‘ క్యామాన్’ పేరిట తీసిన చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్‌లో కూడా ప్రదర్శించి పలువురు సినీ ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నారు.
స్థానిక లొకేషన్లు.. అద్దె కెమెరాలు..
వీరు తమ స్నేహితుల ఇళ్లు.. స్థానికంగా ఉన్న చక్కటి లొకే షన్లను ఎంచుకొని షార్ట్‌ఫిల్మ్‌లను పూర్తి చేస్తున్నారు. కెమెరా విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రతిరోజు మూడు, నాలుగు వేల రూపాయల అద్దెకు సైతం వెనుకా డకుండా మంచి కెమెరాలను వినియోగిస్తున్నారు.స్టూడియోల్లో డబ్బిం గ్, గ్రాఫిక్ వర్క్స్ కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాల నిడివి చిన్నదైనా పెద్దవాటికి ఏమాత్రం తీసి పోకుండా తీస్తున్న షార్ట్‌ఫిల్మ్స్ మేకింగ్ ఇప్పుడు యువత రానికి క్రేజీగా మారుతోంది.
అంతిమ లక్ష్యం వెండితెరే..
షార్ట్ ఫిల్మ్స్‌తో హోరెత్తిస్తున్న యువత చివరి లక్ష్యం వెండితెర కు పరిచయం కావడమే. చిన్న చిత్రాలతో వెండితెరకు పరి చయమైన వారిని ఆదర్శంగా తీసుకుని ఇలా యూట్యూబ్ వేదికగా తమ సృజనాత్మకతను బయపెడుతున్నారు.
సృజనాత్మకతకు వేదిక..
వెండి తెరపై దర్శకుడిగా మారాలన్న తపనకు ఈ షార్ట్‌ఫిల్మ్స్ ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ వేదికగా మాలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయగలుగుతున్నాం. యూట్యూబ్‌లో మేం చేసిన సినిమా లను చూసి చాలామంది ప్రశంసించ డంతో ఉత్సాహం రెట్టింపవుతోం ది. అభిరుచి కలిగిన రంగం లో భవిష్యత్తును వెతుక్కోడానికి ఇదో వేదిక. - కల్యాణ్‌శ్రీ వర్మ, షార్ట్‌ఫిల్మ్ దర్శకుడు
యువతకు ప్రోత్సాహం..
నటనా రంగంలో యువతలో ఉన్న ఉత్సాహానికి నా వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఎంతో కొంత ఆర్థిక వనరులు అవసరం. అందుకే సారి ఐసిరి ప్రొడక్షన్‌పై పలు షార్ట్‌ఫిల్మ్స్ నిర్మాణం చేపట్టాను. అనేకమంది యువత తమ సృజనాత్మకతను బయటపెట్టుకుంటున్నారు. - శివదత్తసాయి, నిర్మాత, సాయి ఐసిరీ ప్రొడక్షన్