రికార్డ్ షేక్స్!
రొమాంటిక్ సన్నివేశాలు, కిక్కెక్కించే కథనంతో విడుదలైన ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వేడెక్కిస్తోంది. రిలీజైన నాటి నుంచి రికార్డులు బద్దలూ కొడుతూ బాక్సాఫీస్ పంట పండిస్తోంది. ఇదే పేరుతో ఈఎల్ జేమ్స్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఓ కాలేజీ గ్రాడ్యుయేట్, యంగ్ బిజినెస్‌మ్యాన్‌ల మధ్య సాగే రిలేషన్‌షిప్‌ను శృంగారభరితంగా బిగ్‌స్క్రీన్‌పై ఆవిష్కరించాడు శామ్ టేలర్ జాన్సన్.
డకోటా జాన్సన్, జామి డారెన్ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకు మొత్తం కలిపి 502 మిలియన్ యూఎస్ డాలర్లు వసూలు చేసిందట. ఇందులో డొమెస్టిక్ 150 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా 352 మిలియన్ డాలర్లు కలెక్షన్లు రాబట్టిందట. ఇందుకు ప్రధాన కారణం తారలిద్దరి మధ్యా సూపర్‌గా వర్కవుట్ అయిన కెమెస్ట్రీ. ఎవరికెకరూ తీసిపోనంతగా రొమాంటిక్ సన్నీవేశాల్లో జీవించేశారన్నది సినీ జనుల టాక్. కామెడీ సినిమా ‘టెడ్’ రెండో స్థానంలో కొనసాగుతుంది.