ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌ | UV Creations launches celluloid multi-cinema complex | Sakshi

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

Aug 29 2019 3:31 AM | Updated on Aug 29 2019 11:30 AM

UV Creations launches celluloid multi-cinema complex - Sakshi

దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే తొలిసారిగా.. ప్రపంచంలో మూడో భారీ స్క్రీన్‌ని ప్రేక్షకులు చూడబోతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌ ‘వీ’ సెల్యూలాయిడ్‌ మల్టీ సినీ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘సాహో’ సినిమాతో ఈ మల్టీప్లెక్స్‌ ఆరంభం కానుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో మూడు సినిమా థియేటర్లను ఈ కాంప్లెక్స్‌లో నిర్మించారు.

ఇందులో ఒక థియేటర్‌లో మాత్రం భారతదేశంలోనే ఎక్కడా లేనంత స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ప్రపంచస్థాయిలో తీసుకుంటే ఇది మూడో భారీ స్క్రీన్‌ అని ప్రచారం జరుగుతోంది. ఆసియా ఖండంలో కూడా ఇదే మొదటి స్క్రీన్‌ అని సమాచారం. 106 అడుగులు వెడల్పు, 94 అడుగులు నిలువు స్క్రీన్‌ ఏర్పాటుతో పాటు  670 సీట్లు కెపాసిటీతో త్రీడీ సౌండ్‌ సిస్టమ్‌తో అత్యంత అ«ధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. మిగిలిన రెండు థియేటర్లు 180 సీట్లు కెపాసిటీతో నిర్మించారు. సుమారు 7 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ గ్రూప్‌ థియేటర్స్‌ను నిర్మించారు. ఈ మల్టీ సినీ కాంప్లెక్స్‌ ప్రభాస్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement