గ్లామర్, డీ–గ్లామర్... ఏ పాత్రని అయినా సునాయాసంగా చేసేస్తారు శ్రుతీహాసన్. అయితే ఇప్పటివరకూ సినిమా మొత్తం పూర్తిగా తన చుట్టూ తిరిగేలా ఉన్న కథల్లో ఈ బ్యూటీ కనిపించలేదు. అంటే... పూర్తి స్థాయి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ శ్రుతీహాసన్ చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఏకంగా కథానాయిక ్రపాధాన్యంగా సాగే రెండు చిత్రాల్లో ఆమె కనిపించే చాన్స్ ఉంది. ఒకటి ‘చెన్నై స్టోరీ’. ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
అయితే ఈ సినిమా నుంచి శ్రుతి తప్పుకున్నారనే వార్త కూడా ఉంది. ఆ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ విషయానికొస్తే... శ్రుతీహాసన్ హీరోయిన్‌గా యూవీ క్రియేషన్స్ బేనర్ ఈ సినిమానిప్లాన్ చేస్తోందట. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని, పూర్తి స్థాయి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని సమాచారం. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి... వార్తల్లో ఉన్న ప్రకారం యూవీలో సినిమాకి శ్రుతీహాసన్ సై అన్నారా? అనేది నిర్మాణ సంస్థ కానీ శ్రుతి కానీ చెబితేనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment