Vistara Announces Season Sale On Domestic And International Flights Fares - Sakshi
Sakshi News home page

Vistara ఫెస్టివ్‌ డిస్కౌంట్‌ సేల్‌: ప్లేస్‌ ఏదైనా, క్లాస్‌ ఏదైనా

Published Tue, Oct 18 2022 10:57 AM | Last Updated on Tue, Oct 18 2022 12:50 PM

Vistara announces Season SALE domestic and international flights - Sakshi

సాక్షి, ముంబై: టాటా యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో 4 రోజుల ఫెస్టివ్ సేల్‌ను ప్రకటించింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ అనే మూడు క్యాబిన్ తరగతులకు ఈ సేల్ ఛార్జీలపై తగ్గింపులను అందిస్తుంది.

అక్టోబర్ 17, 2022 నుంచి అక్టోబర్ 20, 2022 వరకు జరిగే ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్లపై  అక్టోబర్ 23, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దేశీయంగా అన్ని చార్జీలు కలుకుపుని 1499లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. వన్-వేలో అన్నీ కలిపిన దేశీయ ఛార్జీలు ఎకానమీకి రూ. 1,499, ప్రీమియం ఎకానమీకి రూ. 2,999, బిజినెస్ క్లాస్‌కు రూ. 8,999 (సౌకర్యపు రుసుములు వర్తిస్తాయి) నుండి ప్రారంభమవుతాయి. ఇక అంతర్జాతీయ రూట్‌లలో, అన్నీ కలిపిన రిటర్న్ ఛార్జీలు ఎకానమీకి రూ. 14,149, ప్రీమియం ఎకానమీకి రూ. 18,499, బిజినెస్ క్లాస్‌కు రూ. 42,499 నుండి ప్రారంభం.  

ఇటీవలి కాలంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని, ఈ పండుగ సందర్భంగా తమ కస్టమర్లకు సంతోష కరమైన క్షణాలను ఎంజాయ్‌ చేసి, ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా చేయడమే తమ  లక్క్ష్యమని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రజావత్ తెలిపారు. అత్యుత్తమ సేవలను అందించే ఎయిర్‌లైన్‌ విస్తారా  కస్టమర్ల ఇష్టమైన ఎంపికగా కొనసాగుతుందనే  విశ్వాసాన్ని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement