
సాక్షి, ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. బిగ్ సేవింగ్స్ పథకం కింద జెట్ ఎయిర్‌వేస్ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో టికెట్లపై తగ్గింపును అందిస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్, లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని కంపెనీ తెలిపింది.
దేశీయ మార్గంలో టికెపై 400 రూపాయలదాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ విమాన టికెట్లపై 600 రూపాయల దాకా తగ్గింపురేట్లను వర్తింప చేస్తోంది. వన్ వే టికెట్లపై 200 రూపాయల దాకా, రిటర్న్ జర్నీపై రూ.600 దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దేశీయ మార్గంలో కూడా ఇదే ఆఫర్‌ను అందిస్తోంది. ప్రీమియర్, ఎకానమీ క్లాసు టికెట్లపై ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయాణానికి కనీసం పదిహేను రోజులముందుగా బుక్ చేసుకున్న, ఇండియన్ రూపీ కరెన్సీ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment