Discount Price
-
ప్లేస్ ఏదైనా, క్లాస్ ఏదైనా.. విస్తారా బంపర్ ఆఫర్ ఉందిగా!
సాక్షి, ముంబై: టాటా యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో 4 రోజుల ఫెస్టివ్ సేల్‌ను ప్రకటించింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ అనే మూడు క్యాబిన్ తరగతులకు ఈ సేల్ ఛార్జీలపై తగ్గింపులను అందిస్తుంది. అక్టోబర్ 17, 2022 నుంచి అక్టోబర్ 20, 2022 వరకు జరిగే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లపై అక్టోబర్ 23, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దేశీయంగా అన్ని చార్జీలు కలుకుపుని 1499లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. వన్-వేలో అన్నీ కలిపిన దేశీయ ఛార్జీలు ఎకానమీకి రూ. 1,499, ప్రీమియం ఎకానమీకి రూ. 2,999, బిజినెస్ క్లాస్‌కు రూ. 8,999 (సౌకర్యపు రుసుములు వర్తిస్తాయి) నుండి ప్రారంభమవుతాయి. ఇక అంతర్జాతీయ రూట్లలో, అన్నీ కలిపిన రిటర్న్ ఛార్జీలు ఎకానమీకి రూ. 14,149, ప్రీమియం ఎకానమీకి రూ. 18,499, బిజినెస్ క్లాస్‌కు రూ. 42,499 నుండి ప్రారంభం. ఇటీవలి కాలంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని, ఈ పండుగ సందర్భంగా తమ కస్టమర్లకు సంతోష కరమైన క్షణాలను ఎంజాయ్ చేసి, ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా చేయడమే తమ లక్క్ష్యమని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రజావత్ తెలిపారు. అత్యుత్తమ సేవలను అందించే ఎయిర్‌లైన్ విస్తారా కస్టమర్ల ఇష్టమైన ఎంపికగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. Let your travel plans take flight with the Festive Sale! Enjoy discounted fares across different cabin classes on our international network. Book until 20-Oct-22 for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/Zs8ASBibng — Vistara (@airvistara) October 18, 2022 Travelling home for the festive season? Enjoy discounted fares across different cabin classes on our domestic network. Book now for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/oMhYkA5WQU — Vistara (@airvistara) October 17, 2022 -
గుడ్ న్యూస్: ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1పై భారీ ఆఫర్
Macbook Air M1 Price Drop India, సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో ఆపిల్ ల్యాప్‌టాప్ కావాలనుకేవారికి ఆపిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆపిల్ మ్యాక్‌బుక్ లవర్స్‌కు బంపర్ ఆఫర్ అందిస్తోంది కంపెనీ. మ్యాక్‌బుక్ ఏయిర్ ఎం1 ధర భారీగా తగ్గించింది. దీంతో ఇండియాలోని కస్టమర్ల కోసం దీని ధరరూ.65,900కి దిగి వచ్చింది. దీని అసలు ధర 99,900 రూపాయలు. తాజా తగ్గింపు ఆఫర్‌తో దీన్ని రూ. రూ.65,900 సొంతం చేసుకోవచ్చు. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 కొనుగోలు ఆఫర్లను గమనిస్తే.. హెచ్డీఎఫ్సీ కార్డు లావాదేవీలపై 6 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా లభ్యం. అలాగే పవర్ బ్యాంక్, కార్ ఛార్జర్, ఇయర్ఫోన్లు లాంటివి వద్దు అనుకుంటే మరో రూ. 3,000 తగ్గింపు ఉంటుంది. దీనితో పాటు, కస్టమర్లు తమ పాత మ్యాక్‌బుక్ లేదా మరేదైనా ల్యాప్‌టాప్‌ను మార్చుకుని రూ. 16,000 వరకు తగ్గింపు పొందవచ్చు. రూ.7,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. ఇలా మొత్తంగా ధర రూ.65,900 కు చేరింది. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 ఫీచర్లు 13.3-అంగుళాల డిస్ప్లే 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వెడ్జ్- షేప్ డిజైన్ రెండు USB టైప్-C పోర్ట్‌లు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ 8జీబీ ర్యామ్, 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం కాగా ప్రస్తుతం రూ.1,19,900 వద్ద MacBook Air M2 అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీని ధర ఎక్కువనుకునే కొనుగోలు దారులు తగ్గింపు ధరలో లభిస్తున్న MacBook Air M1పై ఓ లుక్కేయవచ్చు. -
లిస్టింగ్‌లు: మూడు హిట్.., ఒకటి ఫట్
ముంబై: నాలుగు ఐపీఓల్లో మూడు ప్రీమియం ధరతో.., ఒకటి డిస్కౌంట్ ధరతో లిస్ట్ అయ్యాయి. మొదటిరోజు దేవయాని ఇంటర్నేషనల్, ఎక్సారో టైల్స్, క్రిష్ణా డయాగ్నస్టిక్స్ షేర్లు వరుసగా 37%, పదిశాతం, నాలుగు శాతం లాభాలన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. విండ్లాస్ బయోటెక్ షేరు మాత్రం 11.58 శాతం నష్టంతో ముగిసింది. బీఎస్ఈలో దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు 69.15 లక్షల షేర్లు చేతులు మారగా, మార్కెట్ క్యాప్ రూ.14,833 కోట్ల వద్ద స్థిరపడింది. -
ఈ బైక్‌పై ఏకంగా రూ.28 వేల తగ్గింపు
ముంబై: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ తన ఆర్వీ 400 మోడల్ ధరపై రూ.28,201 తగ్గించింది. ధర కోత తర్వాత ఎక్స్–షోరూమ్ బైక్ ధర రూ.90,799గా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇటీవల ఫేమ్-2 పథకాన్ని సవరించింది. ఇందులో భాగంగానే ఈ మోడల్ ధరల్ని తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. రివోల్ట్ ఈ–బైక్‌లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఇది 3.24 కిలోవాట్ లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఒకసారి పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. గతవారంలో కేంద్రం సవరించిన ఫేమ్–2 నిబంధనల ప్రకారం... ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 1కిలోవాట్/అవర్‌కు రూ.10 వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీ రూ.15 వేలకు పెరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో టాటా మోటార్స్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనంపై రూ.11,250లను తగ్గించింది. అలాగే ఒకినావా ఆటోటెక్ ఈవీ పోర్ట్‌ఫోలియో ధరలు కనిష్టంగా రూ. 7,209, గరిష్టంగా రూ. 17,892లు చొప్పున తగ్గాయి. -
ఫ్లిప్‌కార్ట్ సేల్ : బడ్జెట్ ధరలో జియోనీ ఫోన్
సాక్షి, ముంబై: జియోనీ లేటెస్ట్ మొబైల్ తగ్గింపు ధరలో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్దివాలీ సేల్‌లో జియోని ఎఫ్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు 3వేల రపాయల దాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు 6.26 ఇంచ్ డిస్ప్లే 1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13 +2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 32 ఎంపీ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ : అసలు ధర రూ. 9490 ఆఫర్ ధర రూ.6,999 -
ఆన్లైన్లో ఔషధాలు... ఇవి తెలుసుకోవాల్సిందే!
డాక్టర్ రాసిన మందుల చీటిని ఫోన్ కెమెరా నుంచి క్లిక్ మనిపించి, దాన్ని మొబైల్ యాప్ నుంచి అప్లోడ్ చేసి, చిటికెలో ఆర్డర్ చేసేయడం... ఆ తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు ఇంటికే ఔషధాలు వచ్చేయడం నేడు పట్టణాల్లో చూస్తున్నాం. చిన్న పట్టణాల నుంచి మెట్రోల వరకు ఈ ఫార్మసీ వ్యాపారం విస్తరిస్తోంది. దీనివల్ల మందుల ధరలపై ఎక్కువ తగ్గింపు లభించడంతోపాటు, డాక్టర్ సూచించిన మందుల్లో ఏదో ఒక రకం లేకపోవడమన్న సమస్య కూడా దాదాపుగా ఉండడం లేదు. దేశంలో ఔషధ మార్కెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీ మార్కెట్‌కు సంబంధించి లాభ, నష్టాలపై అవగాహన కోసమే ఈ కథనం... ఈ–ఫార్మసీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడం.. సంప్రదాయ ఔషధ దుకాణాలు సేవల గురించి ఆలోచించే విధంగా దారితీసింది. ఈ పోటీ కారణంగా ఆర్డర్ చేస్తే ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నాయి సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు. కస్టమర్లను కాపాడుకునేందుకు వారికి అవసరమైన ఔషధాలు తమ వద్ద లేకపోయినా కానీ, ఆర్డర్ చేసి మరీ తెప్పిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు లు రావడానికి దోహదం చేసింది కచ్చితంగా ఈ ఫార్మసీలేనని చెప్పుకోవాలి. ఇక వైద్యులు తప్పనిసరిగా ఔషధం బ్రాండెడ్ పేరును కాకుండా, జనరిక్ పేరునే సూచించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వినియోగదారులకు ఏ కంపెనీ ఉత్పత్తి కొనుగోలు చేసుకోవాలనే విషయంలో స్వేచ్ఛను కల్పించనుంది. ధరలు ఈ ఫార్మసీలు సాధారణంగా ఔషధ ధరలపై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఆయా ఉత్పత్తులను బట్టి డిస్కౌంట్ వేర్వేరుగా ఉంటుంది. పోషక ఉత్పత్తులపై చాలా వరకు ఆన్లైన్ ఫార్మసీలు తక్కువే డిస్కౌంట్ ఇస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులపై (వైద్యులు రాసినవి) ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీంతో ఈ ఫార్మసీల నుంచి కొనుగోలు చేసే వారికి కొంత ఆదా అవడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ ప్రభావంతో సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు కూడా దిగొచ్చి, ఎంఆర్పీపై తగ్గింపు ఇస్తున్నాయి. అయినప్పటికీ ఆన్లైన్ ఫార్మసీల్లోనే డిస్కౌంట్ ఎక్కువ లభిస్తోంది. ఔషధ ధరలపై తగ్గింపులు, ఆర్డర్ చేసే విషయంలో ఆన్లైన్ ఫార్మసీలకే ఎక్కువ మార్కులు పడతాయి. కాకపోతే డెలివరీకి తీసుకునే సమయంలోనే సవాలు నెలకొని ఉంది. ఈ ఫార్మసీ స్టార్టప్ సంస్థలు దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, రవాణా పరమైన సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. ఓ ఔషధం వెంటనే తీసుకోవాల్సి ఉంటే సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయడమే పరిష్కారం. ఇటువంటి వారు ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేసి, అవి వచ్చే వరకు వేచి ఉండడం సాధ్యపడదు. కాకపోతే క్రమం తప్పకుండా కొన్ని రకాల జీవనశైలి సమస్యలకు మందులు వాడే వారు మాత్రం తమకు కావాల్సిన మందులను ముందుగానే ఆన్లైన్ ఫార్మసీల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో అయితే ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు. కాకపోతే కనీస ఆర్డర్ విలువకు తక్కువ కొనుగోలు చేస్తే, డెలివరీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. భిన్న రకాలు... ఈ ఫార్మసీల్లో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది ఆన్లైన్లో మాత్రమే ఫార్మసీలను విక్రయించే నమూనా. సంబంధిత ఫార్మసీ స్టోర్ పోర్టల్ లేదా యాప్‌లో లాగిన్ అయి, కావాల్సిన మందులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఔషధాలను ఇంటికి డెలివరీ చేస్తారు. నెట్‌మెడ్స్, మెడ్‌లైఫ్, 1ఎంజీ, ఎంకెమిస్ట్, ఫార్మ్ఈజీ ఇవన్నీ కూడా ఈ కోవలోనివే. ఇక రెండో నమూనాలో అటు సంప్రదాయ ఫార్మసీ స్టోర్లతో పాటు, ఆన్‌లైన్‌లోనూ ఔషధ విక్రయాలను నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. తద్వారా రెండు మార్గాల్లోనూ కస్టమర్లను సంపాదించుకోవడం లక్ష్యం. మెడ్‌ప్లస్ ఈ తరహాలోనే పనిచేస్తోంది. మెడ్‌ప్లస్ సంస్థ 20 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్లపై తగ్గింపు ఇస్తోంది. మెడ్‌ప్లస్ స్టోర్‌కు వెళ్లి రూ.1,000లోపు ఆర్డర్ చేస్తే 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంటే, అదే ఆన్లైన్లో ఆర్డర్‌పై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తుండడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే డిస్కౌంట్ ఆఫర్ చేయడంతోపాటు, ఇంటికి డెలివరీ చేయడం లేదా సమీపంలోని మెడ్‌ప్లస్ స్టోర్‌కు స్వయంగా వెళ్లి తీసుకునే ఆప్షన్లను కూడా ఇస్తోంది. కస్టమర్లు తమ సౌకర్యం కొద్దీ నచ్చినది ఎంచుకోవచ్చు. ఇక మూడో రకం.. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని కస్టమర్ నివాసం/కార్యాలయం సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు ఆ ఆర్డర్‌ను బదిలీ చేసేవీ ఉన్నాయి. వీఫార్మాసిస్ట్ ఇలానే చేస్తోంది. కావాల్సిన ఔషధాన్ని ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుంటూ.. ఆ తర్వాత అదే ఆర్డర్‌ను కస్టమర్ లొకేషన్ సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత సంబంధిత స్టోర్ ప్రతినిధి కస్టమర్ నివాసానికి ఔషధాలను డెలివరీ చేస్తారు. డెలివరీ సమయంలోనే పేమెంట్ కూడా చేసేయవచ్చు. చట్టం ఏం చెబుతోంది... ఆన్లైన్ ఫార్మసీలు తమ వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తుండడంతో సంప్రదాయ ఔషధ వర్తకులు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరి ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లోనే ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణకు సంబంధించి ఓ నమూనా విధానాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధానంలో ఆన్లైన్లో ఫార్మసీ నిర్వహించాలంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరూ ఆన్లైన్లో ఔషధాలను ప్రదర్శించడం, పంపిణీ, విక్రయాలు చేయడం నిషిద్ధం. అలాగే, నార్కోటిక్, సైకోట్రాపిక్ ఔషధాలపై నిషేధానికి సంబంధించిన నిబంధనలూ వీటికి వర్తిస్తాయి. రోగుల సమాచారం గోప్యంగా ఉంచడం, ఈ తరహా సమాచారం ఎవరికీ లీక్ అవకుండా, పంచుకోకుండా ఉండాలి. ఇక ఆన్లైన్ ఫార్మసీలను సవాలు చేస్తూ గతేడాది మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా.. ఈ ఫార్మసీ ప్రాజెక్టును అమల్లోకి తీసుకురానున్నట్టు ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రం బదులిచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానం అమల్లోకి వస్తే... లోపాలను నివారించడంతోపాటు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫార్మసీల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉంటుందని ఈ రంగానికి చెందిన పరిశీలకులు భావిస్తున్నారు. -
భారీగా తగ్గిన నోకియా స్మార్ట్‌ఫోన్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : నోకియా తన స్మార్ట్ ఫోన్ ధరలను భారీగా తగ్గించింది. గత ఏడాది లాంచ్ చేసిన నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా తగ్గింపు ధరల్లో అందుబాటులో వుంచింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను (నోకియా ఆన్లైన్ స్టోర్‌లో) రూ.6,999గా ఉంచింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ప్రస్తుత ధర : రూ.6999 లాంచింగ్ ధర రూ.16,999 4జీబీర్యామ్; 64 జీబీ స్టోరేజ్ ప్రస్తుత ధర రూ. 9,999 నోకియా 6.1 ఫీచర్లు 5.5 అంగుళాల డిస్ప్లే 1080x1920పిక్సెల్స్ రిజల్యూషన్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 16ఎంపీ రియర్‌కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
20వేల ఎంఏహెచ్ పవర్ బ్యాంకు రూ.1399లకే
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న క్రమంలో పవర్‌బ్యాంకుల ఆవశ్యకత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బడ్జెట్‌ధరల్లో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న ఇంటెక్స్ స్మార్ట్ యూజర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. 20వేల ఎంఏహెచ్ సామర్ధ్యం ఉన్న పవర్‌బ్యాంకును తగ్గింపుధరలో అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి పలు డివైస్‌లకు చార్జింగ్పెట్టుకునే అవకాశం ఉన్న ఇంటెక్స్ ఐటీ-పీబీఏ 20వేల లిథియం పాలిమర్ పవర్ బ్యాంకు (వైట్)ను కేవలం రూ.1399 లకే అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర. రూ. 3550 లు. పత్ర్యేకంగా అమెజాన్ ద్వారా ఒక్కరోజుకే ఈ సేల్ నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు (ఫిబ్రవరి 11)కే పరిమితమని, అదీ స్టాక్ ఉన్నంత వరకేనని ఇంటెక్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. With massive 20,000 mAh battery, charge multiple devices on the go with Intex IT-PBA 20K Poly. Buy for ₹1399 only during 'Deal of the Day' @AmazonIN. Offer valid only for today and till stock lasts. Buy now : https://t.co/w83gcaMDxv pic.twitter.com/CxTTt8Z6PR — Intex Technologies (@IntexBrand) February 11, 2019 -
హానర్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్
హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. తాజా స్మార్ట్‌పోన్లపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నాలుగు రోజులు హానర్ డే సేల్ రేపటినుంచి (మంగళవారం సెప్టెంబర్18నుంచి) శుక్రవారం వరకూ కొనసాగనుంది. వీటిల్లో హానర్ 9 లైట్, హానర్ 10, హానర్ 9ఎన్ హానర్ 9ఐ ఉన్నాయి. అలాగే హానర్ 9 ఎన్ లో కొత్త కలర్ ఆప్షన్స్‌లో లావెండర్ పర్పుల్ , రాబిన్ ఎగ్ బ్లూ లో తీసుకొస్తున్నట్టు కూడా కంపెనీ ప్రకటించింది. హానర్ 10 పై రూ. 5 తగ్గింపు. అలాగే హానర్ 9 ఐ పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. హానర్ 9 లైట్ 4జీబీ / 64జీబీ నిల్వ వేరియంట్ రూ. 14,999 దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 3,000. హానర్ 10 6జీబీ ర్యామ్ /128జీబీ నిల్వ వేరియంట్ 5,000 రూపాయలు తగ్గింపు తరువాత రూజ 27,999 లభ్యంకానుంది. దీని అసలు ధర రూ. 32.999. నాలుగు కెమెరా సెటప్ కలిగిన హానర్ మొట్టమొదటి స్మార్ట్‌పోన్ హానర్ 9ఐ రూ. 16,999 కు అందుబాటులో ఉంటుంది. అసలు దర ధర రూ .17,999 వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో హానర్ 9 ఐ (3జీబీ /32జీబీ నిల్వ వేరియంట్) రూ. 11,999 లకు, 4జీబీ / 64జీబీ నిల్వ వేరియంట్ రూ. 13,999 లకు లభ్యం. -
బర్త్‌డే కానుక : పెట్రోల్‌పై రూ.5 తగ్గింపు
ముంబై : ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల్లో ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల 9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల ముందు వందల మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. ఈ రోజు మహారాష్ట్రలో పెట్రోల్ ధర 84.26 రూపాయలుగా ఉంది. ఈ తగ్గింపు వల్ల పెట్రోల్ బంక్ యాజమానులపై పడే భారాన్ని ఎంఎన్ఎస్ చెల్లించనుంది. దీనిపై ద్విచక్ర వాహనదారులు హర్షం చేస్తున్నారు. ఓ వాహనదారుడు మాట్లాడుతూ.. రాజ్ ఠాక్రేలాగే మోదీ కూడా పెట్రోలు ధరలు తగ్గిస్తారని ఆశిస్తున్నామన్నారు. తాను ట్యాంక్ ఫూల్ చేయించడం ఇదే తొలిసారి అని తెలిపారు. -
‘స్వగృహా’లకు కొత్త ధరలు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక హంగులతో రూపుదిద్దుకుని అమ్ముడుపోకుండా మిగిలిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు కొత్త ధరలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 23న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బండ్లగూడలో 316 ఫ్లాట్లు, పోచారంలో 435 ఫ్లాట్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడలో ప్రస్తుత ధర చదరపు అడుగుకు రూ.2,950, పోచారంలో రూ.2,800 ఉంది. దీంతో ఈ ఇళ్లు కొనేందుకు ఎవరూ ముందుకురాక ఖాళీగా పడి ఉన్నాయి. ఇప్పుడు వీటి ధరలను సవరించి వెంటనే అమ్ముడుపోయేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాయితీ ధరకు ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మొద్దు బండ్లగూడ, పోచారంలలో దాదాపు రెండు వేలు చొప్పున స్వగృహ ఇళ్లు తుది పనులు జరుపుకోకుండా ఉన్నాయి. వీటిని రాయితీ ధరలకు ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అన్ని హంగులద్దుకుని 751 ఫ్లాట్లు (రెండు చోట్ల కలిపి) సిద్ధంగా ఉన్నాయి. అదనపు హంగులతో ఉన్న ఇళ్లను రాయితీ ధరలకు అమ్మితే భారీగా నష్టం వస్తుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో వాటిని రాయితీ ధరలకు అమ్మొద్దని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. కానీ ప్రస్తుత ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో తగ్గించాలని సూచించింది. రాష్ట్రం విడిపోయే సమయంలో కొందరు నేతలు, ఉన్నతాధికారుల అవినీతి దాహంతో ఒక్కసారిగా వాటి ధరలు పెరిగాయి. అప్పటి వరకు చదరపు అడుగు ధర రూ.2,220 గా ఉండేది. కానీ అన్ని రకాల అంశాల ఎస్కలేషన్‌కు వీలు కలిగించే జీవో 35ను ఉన్నట్టుండి స్వగృహకు వర్తింపజేశారు. అప్పటి వరకు ఈ ఉత్తర్వు నుంచి స్వగృహకు మినహాయింపు ఉంది. ఎస్కలేషన్ పేరుతో దాదాపు రూ.100 కోట్లు మాయం చేశారు. ఆ భారాన్ని రికవరీ చేసే పేరుతో ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో వాటి అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ పెంపునకు పూర్వం ఉన్న ధరలను మళ్లీ ఖరారు చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్న ఇళ్లు అమ్ముడుపోగా మిగతా వాటిని రాయితీతో ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయిస్తారు.