Apple Macbook Air M1 Price Drop India: Check Latest Discount Price and Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Macbook Price Drop: ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం1పై భారీ ఆఫర్‌

Published Thu, Jul 21 2022 11:19 AM | Last Updated on Thu, Jul 21 2022 1:30 PM

MacBook Air M1 available at a discounted price Check details - Sakshi

Macbook Air M1 Price Drop India, సాక్షి, ముంబై: బడ్జెట్‌ ధరలో ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ కావాలనుకేవారికి ఆపిల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముఖ్యంగా ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ లవర్స్‌కు బంపర్‌ ఆఫర్‌ అందిస్తోంది కంపెనీ. మ్యాక్‌బుక్‌ ఏయిర్‌ ఎం1 ధర భారీగా తగ్గించింది. దీంతో ఇండియాలోని కస్టమర్ల కోసం దీని ధరరూ.65,900కి దిగి వచ్చింది. దీని అసలు ధర 99,900 రూపాయలు. తాజా తగ్గింపు ఆఫర్‌తో దీన్ని రూ. రూ.65,900  సొంతం  చేసుకోవచ్చు.
 
మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం1 కొనుగోలు ఆఫర్లను గమనిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ  కార్డు లావాదేవీలపై 6 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆఫర్‌ కూడా లభ్యం. అలాగే  పవర్ బ్యాంక్, కార్‌ ఛార్జర్, ఇయర్‌ఫోన్‌లు లాంటివి వద్దు అనుకుంటే మరో రూ. 3,000 తగ్గింపు ఉంటుంది. దీనితో పాటు, కస్టమర్‌లు తమ పాత మ్యాక్‌బుక్ లేదా మరేదైనా ల్యాప్‌టాప్‌ను మార్చుకుని రూ. 16,000 వరకు తగ్గింపు పొందవచ్చు.  రూ.7,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. ఇలా మొత్తంగా  ధర రూ.65,900 కు  చేరింది.

మ్యాక్‌బుక్‌  ఎయిర్‌ ఎం1  ఫీచర్లు
13.3-అంగుళాల డిస్‌ప్లే
400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌
వెడ్జ్- షేప్‌ డిజైన్ 
రెండు USB టైప్-C పోర్ట్‌లు
 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌
 8జీబీ ర్యామ్‌,  512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం

కాగా ప్రస్తుతం రూ.1,19,900 వద్ద MacBook Air M2 అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీని ధర ఎక్కువనుకునే కొనుగోలు దారులు తగ్గింపు ధరలో లభిస్తున్న  MacBook Air M1పై ఓ లుక్కేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement