MacBook Air
-
గుడ్ న్యూస్: ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1పై భారీ ఆఫర్
Macbook Air M1 Price Drop India, సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో ఆపిల్ ల్యాప్‌టాప్ కావాలనుకేవారికి ఆపిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆపిల్ మ్యాక్‌బుక్ లవర్స్‌కు బంపర్ ఆఫర్ అందిస్తోంది కంపెనీ. మ్యాక్‌బుక్ ఏయిర్ ఎం1 ధర భారీగా తగ్గించింది. దీంతో ఇండియాలోని కస్టమర్ల కోసం దీని ధరరూ.65,900కి దిగి వచ్చింది. దీని అసలు ధర 99,900 రూపాయలు. తాజా తగ్గింపు ఆఫర్‌తో దీన్ని రూ. రూ.65,900 సొంతం చేసుకోవచ్చు. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 కొనుగోలు ఆఫర్లను గమనిస్తే.. హెచ్డీఎఫ్సీ కార్డు లావాదేవీలపై 6 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా లభ్యం. అలాగే పవర్ బ్యాంక్, కార్ ఛార్జర్, ఇయర్ఫోన్లు లాంటివి వద్దు అనుకుంటే మరో రూ. 3,000 తగ్గింపు ఉంటుంది. దీనితో పాటు, కస్టమర్లు తమ పాత మ్యాక్‌బుక్ లేదా మరేదైనా ల్యాప్‌టాప్‌ను మార్చుకుని రూ. 16,000 వరకు తగ్గింపు పొందవచ్చు. రూ.7,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. ఇలా మొత్తంగా ధర రూ.65,900 కు చేరింది. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 ఫీచర్లు 13.3-అంగుళాల డిస్ప్లే 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వెడ్జ్- షేప్ డిజైన్ రెండు USB టైప్-C పోర్ట్‌లు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ 8జీబీ ర్యామ్, 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం కాగా ప్రస్తుతం రూ.1,19,900 వద్ద MacBook Air M2 అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీని ధర ఎక్కువనుకునే కొనుగోలు దారులు తగ్గింపు ధరలో లభిస్తున్న MacBook Air M1పై ఓ లుక్కేయవచ్చు. -
పవర్ఫుల్ ఎం2 చిప్‌తో సరికొత్త రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్ (ఫోటోలు)
-
రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ వచ్చేసింది: ప్రత్యేకతలేంటి?
న్యూఢిల్లీ: యాపిల్ రీడిజైన్ చేసిన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఎం1 చిప్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎం 2 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తాజాగా ఆవిష్కరించింది. యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2022లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ లాంచ్ చేశారు. కోవిడ్ తరువాత ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న తొలి డెవలపర్ల సమావేశంలో ఐవోస్ 16కి సంబంధించి కొత్త అపడేట్ సహా కొన్ని భారీ ప్రకటనలను కూడా చేసింది. ఇండియన్ మార్కెట్లో ధరలు 10 జీపీయూ కోర్ ఎం2 మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 1,49,000 నుండి ప్రారంభం 8 జీపీయూ కోర్ ఎం2 మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 1,19,900 నుండి మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ ఫీచర్లు 13.6 అంగుళాల డిస్ప్లే (థిన్నర్ బెజెల్స్) 2560x1664 నేటివ్ పిక్సెల్స్ రిజల్యూషన్ బేస్ వేరియంట్‌తో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్టోరేజీని 2టీవీ వరకు విస్తరించుకునే అవకాశం 11.3 మిమీ, బరువు 2.7 పౌండ్లు (1.22 కిలోలు) సిల్వర్, స్పేస్ గ్రే, స్టార్‌లైట్, మిడ్నైట్ బ్లాక్ . గోల్డ్ కలర్లలో లభ్యం. ఇందులోని ఎం2 చిప్ గత జనరేషన్ ఇంటెల్ ఆధారిత మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 5 రెట్లు వేగం, అలాగే 2020 ఎంఐ మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 40 శాతం వేగంగా పనిచేస్తుంది. ఇది డ్యూయల్ USC-C పోర్ట్‌లతో కూడా వస్తుంది, రెండూ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. 20 గంటల బ్యాటరీ లైఫ్, 1080p హెచ్డీ కెమెరా, MagSafe ఛార్జింగ్, టచ్ ఐడీ, మేజిక్ కీబోర్డ్ , ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్ లాంటివి ఇతర ఫీచర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్: బంపర్ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం గ్రాండ్ గాడ్జెట్ సేల్ ను ప్రారంభించింది. ప్రమోషనల్ లో భాగంగా వివిధ రకాల గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సేల్ జూన్ 14తో ముగుస్తోంది. స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, ల్యాప్ టాప్ లు, వేరియబుల్స్, బ్యూటికి సంబంధిత గాడ్జెట్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో భాగంగా శాంసంగ్ గెలాక్సీ జే మ్యాక్స్, లెనోవో ఫ్యాబ్ 2 సిరీసెస్, ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్(కోర్ ఐ5 5వ తరం) ల్యాప్ టాప్, హెచ్ పీ ఏపీయూ క్వాడ్ కోర్ ఏ8 ల్యాప్ టాప్, ఆపిల్ వాచ్ సిరీస్ 1 అండ్ 2, ఆసుస్ జెన్ వాచ్ 2, ఫిట్ బిట్ ఛార్జ్ హెచ్ఆర్, జేబీఎల్ ఫ్లిప్ 2, ఫిల్లిప్స్ వైర్ లెస్ పోర్టబుల్ స్పీకర్ వంటి గాడ్జెట్లపై కంపెనీ ధరలను తగ్గించింది. లెనోవో ఫ్యాబ్ సిరీసెస్ 2పై ప్రారంభ డిస్కౌంట్ 6 శాతం నుంచి 13 శాతం మధ్యలో ఉంది. డిస్కౌంట్ తో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది ఫ్లిప్ కార్ట్. లెనోవో ఫ్యాబ్ 2(32జీబీ) వేరియంట్ రూ.9,999కే అందుబాటులో ఉండగా.. ఈ ఫోన్ పై రూ.9000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అంతేకాక ఫ్యాబ్ 2 ప్లస్ (32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ను రూ.13,999కే కొనుగోలుచేయవచ్చు. ఈ ఫోన్ పై కూడా 13వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ జే మ్యాక్స్(8జీబీ వేరియంట్) పై 14 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 13,900 రూపాయలకు లాంచ్ కాగ, ప్రస్తుతం 11,900కే అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్కౌంట్ తో పాటు మూడు నెలలు, ఆరు నెలలు ఎలాంటి ధరలు లేని ఈఎంఐలను కొనుగోలుదారులకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ డిస్కౌంట్ ధరలో 55,990 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లకు 5 శాతం డిస్కౌంట్ ఉంది. అదనంగా మరో రూ.2000 వరకు అదనపు డిస్కౌంట్లను ల్యాప్ టాప్ లపై అందిస్తోంది. అంతేకాక యాక్సిస్ బ్యాండ్ బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు 5 శాతం డిస్కౌంట్ ను ఇస్తోంది. మిగతా గ్యాడ్జెట్లపై కూడా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ తొమ్మిదిరోజుల పాటు ఫ్యాషన్ సేల్ ను కూడా నిర్వహిస్తోంది. దీంట్లో 50 బ్రాండ్స్ పై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్యాషన్ సేల్ జూన్ 18కి ముగియనుంది.