
ముంబై: నాలుగు ఐపీఓల్లో మూడు ప్రీమియం ధరతో.., ఒకటి డిస్కౌంట్ ధరతో లిస్ట్ అయ్యాయి. మొదటిరోజు దేవయాని ఇంటర్నేషనల్, ఎక్సారో టైల్స్, క్రిష్ణా డయాగ్నస్టిక్స్ షేర్లు వరుసగా 37%, పదిశాతం, నాలుగు శాతం లాభాలన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. విండ్లాస్ బయోటెక్ షేరు మాత్రం 11.58 శాతం నష్టంతో ముగిసింది. బీఎస్‌ఈలో దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు 69.15 లక్షల షేర్లు చేతులు మారగా, మార్కెట్ క్యాప్ రూ.14,833 కోట్ల వద్ద స్థిరపడింది.