premium prices
-
‘గ్యాప్’ పంటలకు ధరహాసం
సాక్షి, అమరావతి: మంచి వ్యవసాయ పద్ధతులు (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్–గ్యాప్) సర్టిఫికేషన్ రైతులకు రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పండించిన పంటలకు మార్కెట్లో ప్రీమియం ధర లభిస్తోంది. పంట ఉత్పత్తుల్ని నచ్చినచోట నచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు లభించడంతో రైతుల ఆనందం అవధులు దాటుతోంది. నాణ్యమైన ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని నియంత్రిస్తూ నాణ్యమైన ఉత్పాదకతను పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా కృషి చేస్తోంది. ఇందుకోసం పొలం బడులు, తోట బడులæను నిర్వహిస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని రైతుల ముంగిటకు చేరుస్తోంది. ఫలితంగా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా అవుతుండగా.. దిగుబడులు 9 నుంచి 20 శాతం పెరిగి రైతులకు గణనీయమైన ఆదాయాన్ని ఇస్తోంది. పంట ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్వాలిటీ కౌన్సిల్ గుర్తింపుతో గ్యాప్ సర్టిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా దేశంలోనే తొలి అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్ పొందేందుకు సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా, వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా, తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వారిని ఇంటర్నెల్ ఇన్‌స్పెక్టర్స్‌గా ప్రభుత్వం నియమించింది. సర్టిఫికేషన్ జారీ కోసం అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు, సిబ్బందికి రైతులు పాటించాల్సిన ప్రమాణాలపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో శిక్షణ ఇచ్చారు. క్వింటాల్‌కు రూ.7,500 లభించింది రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశా. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి తగిన మోతాదులో ఎరువులు వినియోగించాను. ఒకే ఒక్కసారి పురుగు మందులు పిచికారీ చేశాను. ఎకరాకు రూ.19,400 పెట్టుబడి అయ్యింది. రెండెకరాలకు 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్యాప్ సర్టిఫికేషన్‌తో వేరుశనగ క్వింటాల్‌కు రూ.7,500 చొప్పున ధర లభించింది. పెట్టుబడి పోగా రూ.66 వేల నికర ఆదాయం వచ్చింది. – బి.రామ్మోహన్, ఎం.వేముల, అన్నమయ్య జిల్లా నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మీదేవి నాలుగేళ్లుగా పొలంబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన పంటల్ని పండిస్తోంది. ఖరీఫ్–2023 సీజన్లో రెండెకరాల్లో కొర్రలు సాగు చేసింది. ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటించింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున మాత్రమే దిగుబడులొచ్చాయి. కానీ.. ఈమె గ్యాప్ సర్టిఫికేషన్ పొందటం వల్ల క్వింటాల్ కొర్రలకు రూ.7 వేలకు పైగా ధర లభించిందని సంతోషంతో చెబుతోంది. ఇప్పటికే 1,673 మంది రైతులకు లబ్ధి ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాలో గ్యాప్ క్లస్టర్స్ ఎంపిక చేశారు. ఆయా క్లస్టర్లలో 990 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ వంటి వ్యవసాయ.. 2,534 ఎకరాల్లో మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల వంటి ఉద్యాన పంటలను గుర్తించారు. 1,673 మంది రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఇండిగ్యాప్ సరి్టఫికేషన్కు అనుసరించాల్సిన విధి విధానాలు, ఆహార ప్రమాణాలపై కృషి గ్యాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చారు. నాణ్యత పర్యవేక్షణకు సాంకేతిక బృందం ద్వారా దశల వారీగా తనిఖీలు, అంతర్గత ఆడిట్ నిర్వహించారు. సేకరించిన నమూనాలను పరీక్షించి పురుగు మందుల అవశేషాల గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్టుగా నిర్ధారించిన పంట ఉత్పత్తులకు ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేశారు. సర్టిఫికేషన్ పొందిన రైతులు వారి పంట ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే మిన్నగా ప్రీమియం ధరకు విక్రయించుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించగలిగారు. గ్యాప్ సర్టిఫికేషన్‌తో వ్యాపారులూ పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోతకొచ్చిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరల కంటే అధిక ధరలకు రైతులు అమ్ముకోగలిగారు. కొర్రలకు మద్దతు ధర రూ.2,500 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్ కొర్రల్ని ధర రూ.7 వేలకు అమ్ముకోగలిగారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.2,203 కాగా.. రైతులు రూ.4 వేలకు పైగా పొందగలిగారు. వేరుశనగ మద్దతు ధర రూ.5,850 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్‌తో రూ.8,300కు పైగా ధర లభించింది. రాగుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,846 ఉండగా.. సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్‌కు రూ.5 వేలకు పైగా ధర పొందగలిగారు. -
46 శాతం డిస్కౌంట్‌తో ప్రీమియం మొబైల్.. ఇలా చేస్తే మీ సొంతం!
Xiaomi 12 Pro: మార్కెట్లో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ల జాబితాలో 'షావోమి 12 ప్రొ' (Xiaomi 12 Pro) ఒకటి. ఈ మొబైల్ ఇప్పుడు ఏకంగా 46 శాతం డిస్కౌంట్‌తో సరసమైన ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ మొబైల్‌ని అందుబాటు ధరకు ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేవింగ్స్ డేస్ సేల్స్‌లో భాగంగా షావోమి 12 ప్రొ మొబైల్ 46 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సేల్స్‌లో కేవలం ఈ మొబైల్ ఫోన్ మీద మాత్రమే కాకుండా.. ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మీద కూడా ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ అసలు ధర రూ. 79999. అయితే డిస్కౌంట్ పొందిన తరువాత ఇది రూ. 42,499కే లభిస్తుంది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. అన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ 5జీ నెట్వర్క్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.72 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే, అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) షావోమి 12 ప్రొ కొనాలనుకునే వారు HDFC క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా మంచి కండిషన్లో ఉన్న మొబైల్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. దాదాపు రూ. 80వేల మొబైల్ సగం ధరకే కొనుగోలు చేయడానికి తప్పకుండా ఈ కండిషన్స్ పాటించాలి. -
లిస్టింగ్‌లు: మూడు హిట్.., ఒకటి ఫట్
ముంబై: నాలుగు ఐపీఓల్లో మూడు ప్రీమియం ధరతో.., ఒకటి డిస్కౌంట్ ధరతో లిస్ట్ అయ్యాయి. మొదటిరోజు దేవయాని ఇంటర్నేషనల్, ఎక్సారో టైల్స్, క్రిష్ణా డయాగ్నస్టిక్స్ షేర్లు వరుసగా 37%, పదిశాతం, నాలుగు శాతం లాభాలన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. విండ్లాస్ బయోటెక్ షేరు మాత్రం 11.58 శాతం నష్టంతో ముగిసింది. బీఎస్ఈలో దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు 69.15 లక్షల షేర్లు చేతులు మారగా, మార్కెట్ క్యాప్ రూ.14,833 కోట్ల వద్ద స్థిరపడింది. -
ఖర్చు చేస్తే ఆదా అవుతుంది
కాస్త జాగ్రత్త పడితే వాహన బీమాలోనూ ఆదా గత మూడేళ్లుగా ప్రీమియం ధరలు చూస్తే.. కారు బీమా ప్రీమియంలు 20 శాతం వరకు, ద్విచక్ర వాహనాలకైతే 15 శాతం వరకూ పెరిగాయి. అందుకే బీమా ప్రీమియం నుంచి కొంతైన ఉపశమనం పొందాలంటే కాసింత అప్రమత్తంగా... తెలివిగా వ్యవహరించాలి. * మనం బీమా కట్టేదే వాహనానికి ఏదైనా జరిగితే క్లెయిమ్ చేయడానికే. ఇందులో మరో మాట లేదు. కాకపోతే క్లెయిమ్ చేసే ముందు కొంత ముందు చూపు అవసరం. అదేంటంటే.. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే సంబంధిత బీమా సంస్థ మరుసటి ఏడాది ప్రీమియంలో ఎంత మొత్తాన్ని తగ్గిస్తుందనేది ముందుగా తెలుసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే.. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) కంటే తక్కువగా ఉందనుకోండి. మీరు క్లెయిమ్ చేయకపోవటమే మంచిది కదా!!. అదీ మ్యాటర్. * మీ కారు కనక ఐదేళ్లకు మించిందనుకోండి... నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ అనే యాడ్ కవర్‌ను తీసుకోవటం మరింత మంచిది. దీంతో క్లెయిమ్ చేసినా కూడా మీ నో క్లెయిమ్ బోనస్ మీకు తిరిగొస్తుంది. అదెలాగంటే.. మీ పాలసీపై 40 శాతం వరకు ఎన్సీబీ ఉందనుకుందాం. కానీ, మీరు క్లెయిమ్ చేశారనుకోండి. దీంతో వాస్తవానికి మీ ఎన్సీబీ మొత్తం పోవాలి. కానీ, మీ దగ్గర నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ఉండటంతో మీ దగ్గరున్న 40 శాతం ఎన్సీబీలోంచి 10 శాతం పోయి మీ దగ్గర 30 శాతం ఎన్సీబీ అలాగే ఉండిపోతుంది. ఒకవేళ మీ దగ్గర నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ఉంది... పెపైచ్చు క్లెయిమ్ కూడా చేయలేదనుకుందాం. ఇప్పుడేమవుతుందంటే.. మీ దగ్గరున్న ప్రొటెక్టర్ కారణంగా మీ ఎన్సీబీలో మరో 10 శాతం అదనంగా కలుస్తుంది. అంటే అప్పుడు మీ ఎన్సీబీ 50 శాతానికి చేరుతుందన్నమాట. * ఒక్క ముక్కలో చెప్పాలంటే మన దగ్గర ఎంత ఎన్సీబీ ఉంటే ప్రీమియం అంత తగ్గుతుందన్నమాట. అయితే ఎంత తగ్గుతుందనేది మాత్రం ఏడాదిలో ఎన్నిసార్లు వాహనాన్ని క్లెయిమ్ చేశామనేదాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చిన్న చిన్న రిపేర్లు, డ్యామేజీల వంటివి సాధ్యమైనంత వరకు క్లెయిమ్ చేయకపోవటమే మంచిది. జేబులోంచి కొంత ఖర్చు చేస్తేనే బెటర్. కారు డ్యామేజీ అయితే ముందుగా మీరు చేయాల్సిన పనేంటంటే.. కారు రిపేరుకు ఎంత ఖర్చువతుందో అంచనా వేయాలి. స్థానికంగా ఉండే రిపేరింగ్ సెంటర్లలో చేయించొచ్చేమో చూడండి. దీంతో దాదాపు 20 శాతం వరకు రిపేరింగ్ ఖర్చులు తక్కువయ్యే అవకాశముంది. రూ. 5 వేల బిల్లు అయితే మీరు బేరసారాలు ఆడి కొంతలో కొంతైన తగ్గించుకునే అవకాశముంటుంది. * చాలా వెబ్సైట్ల ద్వారా ఏ బీమా సంస్థ ఎంత ప్రీమియం ఉందో తెలుసుకునే వీలుంది. ఆయా బీమా సంస్థల క్లెయిమ్‌ల ఆధారంగా కంపెనీ కంపెనీకి మధ్య ప్రీమియంలో తేడాలుంటాయి మరి. అందుకే ముందుగా తెలుసుకోవటం మంచిది. ఏడాది బీమా పాలసీలు కాకుండా లాంగ్ టర్మ్ పాలసీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలకు రెండు మూడేళ్ల పాలసీతో పాటూ 24ఇంటు7 రోడ్ అసిస్టెన్స్ సేవలందిస్తున్నాయి కొన్ని కంపెనీలు. సింగిల్ ప్రీమియంలతో పోల్చుకుంటే వీటి ఖర్చు తక్కువగా ఉంటుంది. పెపైచ్చు 20-35 శాతం వరకూ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. మరోవైపు ప్రతి ఏటా పాలసీని రెన్యూవల్ చేయించాలనే టెన్షనూ ఉండదు. * మీరు వాహనాన్ని విక్రయిస్తున్నప్పుడు మీ బీమా కంపెనీ నుంచి ఎన్సీబీ సర్టిఫికెట్‌ను తీసుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. దీనిద్వారా మీకు అప్పటిదాకా ఎంత ఎన్సీబీ జతపడింతో తెలుస్తుంది. వాహనాలకు యాంటీ థెఫ్ట్ డివైజ్‌ను పెట్టుకోవటం, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల కూడా కొంత మేర డిస్కౌంట్ పొందే అవ కాశం ఉంది. - విజయ్‌కుమార్ చీఫ్ మోటార్ టెక్నికల్ ఆఫీసర్, బజాజ్ అలయెంజ్ -
భౌగోళిక గుర్తింపుతో ప్రీమియం ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జియోగ్రాఫికల్ ఇండికేషన్స్(భౌగోళిక గుర్తింపు-జీఐ). ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే. డార్జిలింగ్ టీ, పోచంపల్లి ఇకత్, మైసూర్ సిల్క్, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, బికనీర్ భుజియా, గుంటూరు సన్నమ్ చిల్లి, హైదరాబాద్ హలీమ్.. భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందట. అందుకే వీటిని విక్రయించేందుకు ప్రముఖ ఆన్లైన్ సంస్థలూ ముందుకొస్తున్నాయి. ‘విలువైన’ గుర్తింపు..: భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు మార్కెట్లో తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. రాజస్తాన్‌లోని బికనీర్‌లో తయారైన భుజియాకు గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్లో 10% ప్రీమియం లభిస్తోందట. బికనీర్ భుజియా తయారీలో సుమారు 25 లక్షల మంది ఆధారపడ్డారు. కుటీర పరిశ్రమగా ఉన్న బికనీర్ భుజియాకు పెప్సితోపాటు దేశీ కంపెనీల నుంచి పోటీ తలెత్తింది. చివరకు 2010 సెప్టెంబర్‌లో భారత పేటెంటు కార్యాలయం జీఐ ధ్రువీకరణ ఇచ్చింది. బికనీర్ భుజియా పేరును ఆ ప్రాంత తయారీదారులుకాక మరెవరూ వాడుకోవడానికి వీల్లేదు. ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్(రిజిస్ట్రేషన్, ప్రొటెక్షన్)చట్టం-1999 రక్షణ కల్పిస్తోంది. జీఐ ధ్రువీకరణ ఉన్న ఏ ఉత్పత్తికైనా రక్షణ ఉంది. తిరుపతి లడ్డూ లాంటి లడ్డూ అని విక్రయిస్తున్న చెన్నై వ్యాపారిపై కేసు నమోదైంది కూడా. 5 వేల ఉత్పత్తులు..: దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉన్న ఉత్పత్తులు సుమారు 1,000కి పైగా ఉంటాయి. ఇందులో భౌగోళిక గుర్తింపు నమోదు కోసం 450 (ఇతర దేశాల్లో 100 కలుపుకుని) దరఖాస్తులు చెన్నైలోని జీఐ రిజిస్ట్రీకి వచ్చాయి. వీటిలో 195 ఉత్పత్తులు ధ్రువీకరణ దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 60 దాకా ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో 30 దరఖాస్తులు రాగా, 22 ఉత్పత్తులకు ధ్రువీకరణ లభించింది. బంగినపల్లి మామిడి, దుర్గి స్టోన్, మచిలీపట్నం ఇమిటేషన్ జువెల్లరీ, ఏటికొప్పాక బొమ్మలు, ధర్మవరం చీరలు, హైదరాబాద్ బిర్యానీ, బనగానపల్లె మామిడి, బందరు లడ్డు, నిజామాబాద్ నల్ల మట్టి పింగాణి తదితర ఉత్పత్తులు జీఐ కోసం ఎదురు చూస్తున్నాయి. దేశీయ కళాకారులను ప్రోత్సహిస్తూ, వారి ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆన్లైన్ సంస్థ క్రాఫ్టిసన్.ఇన్ రాష్ట్రంపైనా ఆసక్తి కనబరుస్తోంది. త్వరలో ఇక్కడి తయారీదారులతో చేతులు కలపనుంది. అవకాశాలు అందుకోండి.. జీఐ ఉత్పత్తుల విక్రయానికి వ్యాపారులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్, ప్రమోషన్ సెంటర్(ఏపీటీడీసీ) సూచిస్తోంది. జీఐ ఉత్పత్తులకు కస్టమర్లు విలువిస్తున్నారని, వ్యాపార అవకాశాలను అందుకోవాలని ఏపీటీడీసీ డెరైక్టర్ ఎస్.జ్యోతి కుమార్ సోమవారమిక్కడ సీఐఐ సదస్సు సందర్భంగా తెలిపారు. ఈ ఉత్పత్తులను విక్రయించాలనుకునే వారు స్వల్ప రుసుముతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఐపీఆర్ కౌన్సిలర్ సుభజిత్ సాహా తెలిపారు. వ్యాపారులకు అవగాహన కోసం త్వరలో సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు.