Xiaomi 12 Pro is available at massive 46% discount - Sakshi
Sakshi News home page

Xiaomi 12 Pro: 46 శాతం డిస్కౌంట్‌తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!

Jun 11 2023 7:17 AM | Updated on Jun 11 2023 10:49 AM

Xiaomi 12 pro available 46 percent discount - Sakshi

Xiaomi 12 Pro: మార్కెట్లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో 'షావోమి 12 ప్రొ' (Xiaomi 12 Pro) ఒకటి. ఈ మొబైల్ ఇప్పుడు ఏకంగా 46 శాతం డిస్కౌంట్‌తో సరసమైన ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ మొబైల్‌ని అందుబాటు ధరకు ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేవింగ్స్ డేస్ సేల్స్‌లో భాగంగా షావోమి 12 ప్రొ మొబైల్ 46 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సేల్స్‌లో కేవలం ఈ మొబైల్ ఫోన్ మీద మాత్రమే కాకుండా.. ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల మీద కూడా ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తుంది.

8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ అసలు ధర రూ. 79999. అయితే డిస్కౌంట్ పొందిన తరువాత ఇది రూ. 42,499కే లభిస్తుంది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. అన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ 5జీ నెట్‌వర్క్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.72 ఇంచెస్ అమొలెడ్ డిస్‌ప్లే, అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

(ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!)

షావోమి 12 ప్రొ కొనాలనుకునే వారు HDFC క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా మంచి కండిష‌న్‌లో ఉన్న మొబైల్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. దాదాపు రూ. 80వేల మొబైల్ సగం ధరకే కొనుగోలు చేయడానికి తప్పకుండా ఈ కండిషన్స్ పాటించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement